అండాశయం (మొక్కలు)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
అండాశయం పుష్పించే మొక్కలలో ఉండే అండకోశం(గైనోసియం) అను స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణంలో ఒక భాగం. మొక్కల అండాశయంను ఆంగ్లంలో 'ప్లాంట్స్ ఓవరీ' అంటారు. ఇది అండకోశ పీఠభాగంలో ఉండిన ఉబ్బిన పెట్టె వంటి నిర్మాణం. దీనిలో ఉబ్బెత్తుగా ఉండే ప్రత్యేక స్థానాలు అండాలను భరిస్తాయి. ఈ ప్రత్యేక స్థానాన్ని అండన్యాస స్థానం అని అంటారు. ఈ స్థానంలో అండాలు ఉండు గదిని బిలం అని పిలుస్తారు. పుష్పభాగాలతో సాపేక్షంగా అండాశయం ఆక్రమించే స్థానాన్ని బట్టి అండాశయాలు మూడు రకాలు. అవి 1. ఊర్ధ్వ అండాశయం, 2. నిమ్న అండాశయం, 3. అర్ధనిమ్న అండాశయం.
- ఊర్ధ్వ అండాశయం: అండకోశాదస్థిత పుష్పాలలో ఈ రకమైన అండాశయం ఉంటుంది.
- నిమ్న అండాశయం: అండకోశోపరిస్థిత పుష్పాలలో ఈ రకమైన అండాశయం ఉంటుంది.
- అర్ధనిమ్న అండాశయం: పర్యండకోశ పుష్పాలలో ఈ రకమైన అండాశయం ఉంటుంది.
అండన్యాస స్థానం
మార్చుఅండాశయంలో అండాలు ఉండు భాగాన్ని అండన్యాస స్థానమని అంటారు. అండన్యాస స్థానంలో అండాలు అమరి ఉండు విధానాన్ని 'అండన్యాసం' అంటారు. అండన్యాసం అనేక రకాలుగా ఉంటుంది.
- ఉపాంత అండన్యాసం: ఉదా: డిలోనిక్స్ మొక్కలో చూడవచ్చు.
- కుడ్య అండన్యాసం: ఉదా: గైనాన్ డ్రాప్సిన్ మొక్కలో చూడవచ్చు.
- అక్షీయ అండన్యాసం: ఉదా: వంకాయ మొక్కలో చూడవచ్చు.
- కేంద్ర అండన్యాసం: ఉదా: డయాంథిస్ మొక్కలో చూడవచ్చు.
- ఉపరితల అండన్యాసం: ఉదా: నిమ్మ మొక్కలో చూడవచ్చు.
- పీఠ అండన్యాసం: ఉదా: పొద్దుతిరుగుడు మొక్కలో చూడవచ్చు.