నిమ్మ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నిమ్మ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. నిమ్మరసం గురించి ఎక్కువగా వీటిని పెంచుతారు.
నిమ్మ | |
---|---|
![]() | |
Citrus x limon | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Subclass: | |
Species: | C. × limon
|
Binomial name | |
Citrus × limon (లిన్నేయస్) Burm.f.
|
పులుసు నిమ్మ పొద లేక చిన్నపాటి చెట్టు. దీని కొమ్మలు తేలికగా వుంటాయి. కొమ్మలు దట్టంగా వుంటాయి. వీటి పై కొనదేలిన ముళ్లు వుంటాయి. లేత కొమ్మలు లేత ఆకుపచ్చ రంగులో అండాకారములో వుంటాయి. ఆకులు అంచులు వంకర టింకరగా వుంటాయి. వీటికి చిన్న చిన్న పూలు గుత్తులుగా ఏర్పడతాయి. ఇవి ద్విలింగ పూలు. పూత మొగ్గలు మొదట లేత ఊదా లేక గులాబిరంగులో వుండి క్రమేణ తెలుపు రంగుకి మారతాయి. వీటి రక్షక పత్రాలు ఆకులుకొనదేలి ఆకుపచ్చగా, ఆకర్షక పత్రాలు తెల్లగా, మందంగా ఉంటాయి. కేసరాలు చిన్నవిగా ఉంటాయి. అండాశం ఆకుపచ్చగా, ఉబ్బి వుంటుంది.[1]
చరిత్ర సవరించు
నిమ్మ గురించి మొదటిసారిగా 10వ శతాబ్దంలోని అరబ్ సాహిత్యంలో పేర్కొనబడింది. భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో మొదటిసారిగా పండించారు. సుదీర్ఘ సముద్రయానం చేసే వారిలో వచ్చే స్కర్వీ వ్యాధి గ్రస్తులలో నిమ్మరసంతో ప్రయోగాలు జరిపి ఇందులోని విటమిన్ సి లోపించడం వల్ల ఈవ్యాధి వస్తుందని కనుగొన్నారు. నిమ్మచెట్టు పొట్టిగా దట్టంగా ఉండి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు ముళ్ళతో ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల క్రింది భాగంలో పత్రపుష్పాలు రాలిన తర్వాత చిన్న బుడిపె మాదిరిగా తయారై అది పండుగా మారుతుంది. నిమ్మపండు గుండ్రంగా ఉండి ఒక చివర సూదిగా ఉంటుంది. పూర్తిగా పండిన నిమ్మపండు చర్మం ముదురు పసుపు రంగులో ఉంటుంది. పండులో తెల్లని చిన్న విత్తనాలుంటాయి.
సుదీర్ఘ సముద్రయానం చేసే వారిలో వచ్చే స్కర్వీ వ్యాధి గ్రస్తులలో నిమ్మరసంతో ప్రయోగాలు జరిపి ఇందులోని విటమిన్ సి లోపించడం వల్ల ఈవ్యాధి వస్తుందని కనుగొన్నారు.
వర్ణన సవరించు
నిమ్మచెట్టు పొట్టిగా దట్టంగా ఉండి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు ముళ్ళతో ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల క్రింది భాగంలో పత్రపుష్పాలు రాలిన తర్వాత చిన్న బుడిపె మాదిరిగా తయారై అది పండుగా మారుతుంది. నిమ్మపండు గుండ్రంగా ఉండి ఒక చివర సూదిగా ఉంటుంది. పూర్తిగా పండిన నిమ్మపండు చర్మం ముదురు పసుపు రంగులో ఉంటుంది. పండులో తెల్లని చిన్న విత్తనాలుంటాయి.
ఉత్పాదన సవరించు
నిమ్మ ఉత్పాదనలో మెక్సికో, భారతదేశం ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి.
ఉపయోగాలు సవరించు
- నిమ్మరసం వేసవికాలంలో ఉప్పు లేదా పంచదారతో కలిపి పానీయంగా తాగడం చాలా మందికి ఇష్టం. ఒక నిమ్మపండు నుండి ఇంచుమించు 3 చెంచాల రసం వస్తుంది. నిమ్మరసంతో పులిహోర చాలా రుచిగా ఉంటుంది.
- నిమ్మరసంలో చేపలు, మాంసం కొంతసేపు నానబెట్టిన అది మెత్తబడి రుచిగా ఉంటుంది.
- నిమ్మపండులతో ఊరగాయ చేస్తారు. ఇది పత్యం చేసేవారికి చాలా ఇష్టంగా ఉంటుంది.
ఎండా కాలంలో నిమ్మ రసం కలిపిన షోడ ఉపయోగం తెలియని వారుండరు/. నీమ్మతో షర్బత్ లు, నిల్వ వుండే పానీయాలు తయారు చేస్తారు. ఎండన పడి వచ్చిన వారికి నిమ్మరసం ఇస్తే చాల త్వరగా శక్తి వస్తుంది. అందుకే నిరాహార దీక్ష విరమించె వారు నిమ్మ రసంతో దీక్ష విరమిస్తారు.
ఆరోగ్య ప్రయోజనాలు సవరించు
Nutritional value per 100 g (3.5 oz) | |
---|---|
శక్తి | 121 kJ (29 kcal) |
9 g | |
చక్కెరలు | 2.5 g |
పీచు పదార్థం | 2.8 g |
0.3 g | |
1.1 g | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ సి | 64% 53 mg |
ఇతర భాగాలు | పరిమాణం |
నీరు | 89 g |
Citric acid | 5 g |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. |
- నిమ్మరసంలోని విటమిన్ సి గల ఏంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు చేసినవారికి ఇది చాలా మంచిది.
- ఆయుర్వేదంలో నిమ్మ జీర్ణక్రియలోను చర్మసౌందర్యానికి చాలా మంచిదని వివరించబడింది. నిమ్మరసం వేడినీటిలో కలిపి సేవిస్తే కాలేయం శుభ్రపరుస్తుందని భావిస్తారు.
- దీనిలోని కొన్ని పదార్ధాలు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
- జపాన్ లోని కొందరు నిమ్మ వాసన ఎలుకలలో ఉద్రేకాన్ని తగ్గిస్తాయని నిరూపించారు.
- రెండు చెంచాల నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసులో కలుపుకొని రోజుకి నాలుగు లేక ఐదు సార్లు తాగడము వలన పచ్చకామెరల వ్యాధి తగ్గుతుంది.
- రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
- లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి, రోజుకు రెండు మూడుసార్లు నిమ్మరసం సేవిస్తే, బరువు తగ్గుతుంది.[2]
- చుండ్రు, మొటిమలు, మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. లాభం ఉంటుంది.[3]
- మలబద్ధకము, అజీర్ణం, అగ్నిమాంద్యం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీరోజూ రెండు పూటలా నిమ్మరసం త్రాగితే జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. ఆకలి పెరిగి, బరువు హెచ్చుతుంది.[4]
చర్మ సౌందర్యానికి నిమ్మకు మించినది లేదు. అందుకే చాల సౌందర్య సబ్బులలో నిమ్మను వాడతారు. అలాగే నిమ్మను చాల సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. ముఖంమీద ముడతలను, మృతకణాలను ఇది తొలగిస్తుంది. జిడ్డు చర్మాన్ని మాపడానికి దీనికి మించిన మందు లేదు. ఊబ కాయానికి కూడా ఇది చాల మంచి మందు. రోజు ఉదయం నీళ్లలో నిమ్మరసం తేనె కలిపి సేవించడం వల్ల చాల ఉపయోగముంటుంది. చేతులు, పాదాలు మృధువుగా వుండడానికి నిమ్మ రసం వాడతారు. శిరోజ సంరక్షణకు కూడా నిమ్మ ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిమ్మ ఉపయోగాలు అనంతం.
పోషక విలువలు సవరించు
శక్తి --------30 kcal. పిండిపదార్థాలు --9 g. చక్కెరలు -----2.5 g. పీచుపదార్థాలు-- 2.8 g. కొవ్వు పదార్థాలు--0.3 g. మాంసకృత్తులు---1.1 g. నీరు--------89 g. విటమిన్ సి-----53 mg 88% Citric acid---5 g
నిమ్మ రకాలు సవరించు
మనకు తెలిసిన నిమ్మ పరిమాణంలో తేడాలు తప్ప అన్ని ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కాని నిమ్మలో చాల రకాలున్నాయి. ప్రపంచంలో నిమ్మ ఉత్పత్తిలో మనదె అగ్ర స్థానం. పింగ్ర్, కాఫిర్, కీ మస్క్ వైల్డ్ స్వీట్ లైమ్, ఇలా చాల రకాలున్నాయి. సామాన్యంగా నిమ్మ చెట్టు చిన్న గుబురు మొక్క. కొన్ని నిమ్మ తీగలు కూడా వుంటాయి. దాన్నే తీగ నిమ్మ అంటారు. పెద్ద పరిమాణంలో వుండే నిమ్మకాయలను గజ నిమ్మ అంటారు. మనకు సాధారణంగా తెలిసిన రంగులు పసుపు వచ్చ లేదా ఆకు పచ్చ. కాని వీటిలో ఎర్రని, తెల్లని, గులాబి రంగు వి కూడా వుంటాయి. దొండ కాయల్లాగ పొడవుగా ఉండే నిమ్మకాయలు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ పులుసు నిమ్మ ఉత్పత్తి పరిచయము (ఈఫ్రెష్ఇండియా జాలస్థలి)[permanent dead link]
- ↑ "నిమ్మ ఉపయొగాలు". Archived from the original on 2015-03-31. Retrieved 2015-02-13.
- ↑ "ప్రతీరోజూ నిమ్మకాయ వల్ల కలిగె ఉపయొగాలు". Archived from the original on 2017-02-11. Retrieved 2017-02-08.
- ↑ "నిమ్మకాయ రసం ఉపయొగాలు". Archived from the original on 2015-01-23. Retrieved 2015-02-13.