జార్జి రెనాల్డ్స్ (George W. M. Reynolds) అనే ఆంగ్లరచయిత రచించిన లవ్స్ ఆఫ్ ది హరెం (Loves of the Harem, 1855) అనే నవలకు ఇది అనువాదం. ఈ రచనలో ఖలీల్ అనే సామాన్యుడు కాన్‌స్టాంటినోపుల్ అనే మహానగరాన్ని నిత్యం యుద్ధాలు, ఘోరరక్తపాతం నుంచి కాపాడి చక్రవర్తిగా మారడం కథాంశం. దీనిని మొసలికంటి సంజీవరావు తెలుగులోకి అనువదించెను. ఇది 1928లో ముద్రించబడెను. రచయిత దీని ప్రధమభాగాన్ని తన మేనమామయైన అప్పారావు పంతులుకు అంకితమిచ్చారు.

George Reynolds on the first page of the first printing of Reynolds's Miscellany from 1846. The text of the first installment of Wagner the Wehr-Wolf begins at the bottom of the page.

తురుష్క రాజధాని "కాన్‌స్టాంట్" నగరము లో ఘోరమైన మరణములు నిగూఢంగా జరుగుతున్న కాలమది. 30 సంవత్సరములు దాటని యువకులు జాతి, మత విచక్షణ లేక, ఆకస్మికంగా మరణించుచుండిరి. వారి శవములు భాస్వర జలములందు తేలుతుండెడివి. వానిని పరిశీలింపగా వారందరకు మెడ వెనుక కొంచెము క్రిందు గా దగిలిన కత్తి పోటువలన మరణించుచున్నట్లు తెలిసినది. హంతకుడెవ్వడో తెలియలేదు. భయంకర దుర్మరణముల సంఖ్య అధికమగుచుండెను. నగరమునందు హాహాకారములు చెలరేగినవి.

కథా ప్రారంభమున రాజధాని స్థితి ఇట్లుండెను. "ఖలీలు" అనే కథానాయకుడు ప్రజలను రక్షించే భాద్యత వహించి, అత్యధ్బుత కార్యములు చేసి కృతకృత్యుడై చివరకు సార్వభౌముడయ్యెను.[1]

మూలాలు

మార్చు
  1. రెనాల్డ్స్(మూలం), మొసలికంటి సంజీవరావు(అను ) (1928). అంతఃపురము.

బాహ్య లంకెలు

మార్చు