అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.[1]

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం
తేదీఆగస్టు 9
ప్రదేశంప్రపంచవ్యాప్తంగా

ప్రారంభం

మార్చు
 
తైనో ఆదివాసీలు

1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది.[2] ఈ కమిటీ 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించింది.[3]

కార్యక్రమాలు

మార్చు
  1. ఈ దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో ఆదివాసీ హక్కుల గురించి అవగాహన కలిగిస్తారు.
  2. ఆదివాసులకు అండగా నిలబడిన వారిని స్మరించుకుంటారు.

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
  2. వి6 వెలుగు, ఫీచర్స్ (9 August 2018). "ఇవాళ ప్రపంచ ఆదివాసీ దివస్". Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. వార్త, సంపాదకీయం (8 August 2020). "నేడు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం". Vaartha. కోరం జ్ఞానేశ్వరీ. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.

ఇతర లంకెలు

మార్చు