అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది.

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, అవగాహన కలిపించాలన్నా ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.[1][2]

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
ఎన్నికల పెట్టె
జరుపుకొనేవారుఐక్యరాజ్య సమితి సభ్యులు
జరుపుకొనే రోజుసెప్టెంబరు 15
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

చరిత్రసవరించు

ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వ అంశాలు, ప్రజాస్వామ్యం యొక్క అంతర్జాతీయ పరిధిని ధృవీకరించేందుకు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) ఆధ్వర్యంలో 1997, సెప్టెంబరు 16న ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన సమావేశంలో ప్రజాస్వామ్యంపై సార్వత్రిక ప్రకటన వెలువడింది.[3] కొత్త, పునరుద్ధరించబడిన ప్రజాస్వామ్య దేశాలపై అంతర్జాతీయ సమావేశాలు 1988లో ప్రారంభం అయ్యాయి.[4]

2006లో ఖతార్ లోని దోహాలో జరిగిన అంతర్జాతీయ ప్రజాస్వామ్య సమావేశాలు ఆరవ సమావేశం (ఐసిఎన్‌ఆర్‌డి -6) లో అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించడం జరిగింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య తీర్మానం యొక్క ముసాయిదాను రూపొందించడంలో ఖతార్ ముందడుగు వేసి, సభ్యదేశాలతో సంప్రదింపులు జరిపింది. చివరకు ఐపియు సూచనమేరకు 2007, నవంబరు 8న జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15వ తేదీన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంను నిర్వహించాలని తీర్మానించి, 2008 నుండి అమలుచేయడం జరిగింది.[5]

లక్ష్యంసవరించు

సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక తేడాలు లేకుండా ప్రపంచంలోని ప్రజలందరూ ఒకే విధమైన విలువలపైన ఆధారపడి జీవితాలను గడిపే హక్కు కలిగించడం

కార్యక్రమాలుసవరించు

ప్రజాస్వామ్యం గురించి తెలిసే విధంగా వివిధ గ్రామాలలో, విద్యాసంస్థల్లో సమావేశాలు, ర్యాలీలు, అవగాహన శిబిరాలు నిర్వహిస్తారు.

మూలాలుసవరించు

  1. United Nations General Assembly, Session 62 Resolution 7 (8 November 2007). "Support by the United Nations system of the efforts of Governments to promote and consolidate new or restored democracies". www.un.org. p. page 3. Retrieved 15 September 2019.CS1 maint: extra text (link)
  2. మన తెలంగాణ, ఎడిటోరియల్ (15 September 2017). "ప్రజాస్వామ్య చేదు నిజాలు". మూలం నుండి 15 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 15 September 2019. Cite news requires |newspaper= (help)
  3. "Universal Declaration on Democracy". Retrieved 15 September 2019. Cite web requires |website= (help)
  4. "icnrd.org - This website is for sale! - icnrd Resources and Information". మూలం నుండి 6 నవంబర్ 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 15 September 2019. Cite web requires |website= (help)
  5. సాక్షి, వేదిక-అభిప్రాయం (15 September 2016). "సోదరత్వ భావనే కీలకం". Sakshi. మల్లెపల్లి లక్ష్మయ్య. మూలం నుండి 15 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 15 September 2019.