అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు.
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం | |
---|---|
యితర పేర్లు | మానవ హక్కుల దినోత్సవం |
జరుపుకొనేవారు | UN Members |
ప్రారంభం | 1948 |
జరుపుకొనే రోజు | డిసెంబరు 10 |
ఉత్సవాలు | యునైటెడ్ నేషన్స్ |
ఆవృత్తి | వార్షికం |
ప్రారంభం
మార్చు1948 డిసెంబరు 10న ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కుల ప్రకటన చేసింది. అందువల్ల డిసెంబరు 10వ తేదీని అంతర్జాతీయ మానవహక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంకోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటుచేయబడ్డాయి.[1]
భారతదేశంలో
మార్చుసా.శ1215లో ఇంగ్లండ్ అప్పటి రాజు జాన్ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన నుండే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు రూపొందాయి. 1993లో రూపొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994, జనవరి 8నుండి అమలులోకి వచ్చింది.[2]
కార్యక్రమాలు
మార్చు- 2008 డిసెంబరు 10న యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 60వ వార్షికోత్సవం జరిగింది. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్.ఆర్ రూపొందించిన డాక్యుమెంట్ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది.[3]
- 1998లో మాల్దావా ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటూ ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. తైవాన్‌లో షియా మింగ్-టెహ్ 1979లో హ్యూమన్ రైట్స్ ప్రదర్శనలు నిర్వహించింది.
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి (10 December 2016). "మీకు మానవ హక్కుల గురించి తెలుసా?". Archived from the original on 19 April 2019. Retrieved 19 April 2019.
- ↑ సాక్షి, వేదిక-అభిప్రాయం (10 December 2014). "అంతర్జాతీయ హక్కుల దినోత్సవం". జాన్ బర్నబాస్ చిమ్మె. Archived from the original on 19 April 2019. Retrieved 19 April 2019.
- ↑ "The Universal Declaration of Human Rights: 1948–2008". United Nations. 2008. Retrieved 19 April 2019.