అందరూ దొంగలే

1974 తెలుగు సినిమా

"విక్టోరియా 203" హిందీ సినిమా ఆధారంగా నిర్మించబడ్డ చిత్రం. హీరో హీరోయిన్లు శోభన్, లక్ష్మి ఐనా చిత్రానికి ప్రధానాకర్షణ ఎస్.వి.రంగారావు, నాగభూషణం ధరించిన దొంగల పాత్రలే. వీరిపై రెండు పాటలు చిత్రీకరింపబడ్డాయి (చంటిబాబు ఓ బుజ్జి బాబు, గురుదేవ మహదేవ). హిందీలో ఈ పాత్రల్ని అశోక్ కుమార్, ప్రాణ్ లు పోషించారు. ఒక గుర్రపుబండిలో దాచబడ్డ వజ్రాలకు సంబంధించి కథ. (బొంబాయి (ముంబయ్) లో గుర్రపు బళ్ళను విక్టోరియా లని పిలుస్తారు.) వి.రామకృష్ణ నేపథ్యగానంతో కొన్ని హిట్ గీతాలున్నాయి.

అందరూ దొంగలే
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.బి.రాజేంద్రప్రసాద్
నిర్మాణం అక్కినేని ఆనందరావు
తారాగణం శోభన్ బాబు,
లక్ష్మి
ఎస్.వి.రంగారావు,
నాగభూషణం,
సత్యనారాయణ
నిర్మాణ సంస్థ పల్లవి ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

ఉప్పు శోభన్ బాబు

లక్ష్మి

ఎస్.వి.రంగారావు

నాగభూషణం

కైకాల సత్యనారాయణ

తిక్కవరపు రమణారెడ్డి

జయకుమారి

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: వి.బి.రాజేంద్ర ప్రసాద్

నిర్మాత: అక్కినేని ఆనందరావు

నిర్మాణ సంస్థ: పల్లవి ప్రొడక్షన్స్

సంగీతం: కె.వి.మహదేవన్

సాహిత్యం:కొసరాజు రాఘవయ్య చౌదరి,ఆరుద్ర,ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, విస్సంరాజు రామకృష్ణ దాస్,మాధవపెద్ది సత్యం

విడుదల:31.05:1974.


పాటల జాబితా

మార్చు

వరుస సఖ్య పాట రచన సంగీతం పాడిన వారు
1 నాయుడోళ్ల ఇంటికాడ నల్లతుమ్మ చెట్టు కింద కొసరాజు రాఘవయ్య చౌదరి కె.వి.మహదేవన్ వి.రామకృష్ణ, పి.సుశీల
2 గుడు గుడు గుంచం గుళ్లో రాగం ఆరుద్ర కె.వి.మహదేవన్ పి.సుశీల,రామకృష్ణ బృందం
3 చూసానురా ఈ వేళ ఆత్రేయ కె.వి.మహదేవన్ పి. సుశీల, వి.రామకృష్ణ
4 చంటి బాబు...ఓ బుజ్జి బాబు ఆరుద్ర కె.వి.మహదేవన్ మాధవపెద్ది సత్యం, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.గురుదేవా మహాదేవా సాంబసదాశివ మహాదేవా, రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,మాధవపెద్ది సత్యం

6. రా రా రా రమ్మంటే రా రా నీ భరతం పడతా రా రా, రచన: ఆరుద్ర, గానం.పి సుశీల .

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.