నక్షత్ర ఫలం చెట్టు
(అంబాణపుకాయ నుండి దారిమార్పు చెందింది)
నక్షత్ర ఫలం చెట్టును అంబాణపుకాయ, కర్మరంగము , తమాటకాయ, కరంబోలా అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Averrhoa carambola.
Averrhoa carambola | |
---|---|
Carambolas still on the tree | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | A. carambola
|
Binomial name | |
Averrhoa carambola |
ఉష్ణ మండల ప్రాంతాలలో నిదానంగా పెరిగే ఈ చెట్టు సుమారు 25 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
ఆకు పచ్చని ఈ చెట్టు ఆకులు పగలు చైతన్యంగా ఉండి రాత్రులందు లోపలి వైపుకు ముడుచుకుంటాయి.
లేత ఎరుపు రంగు గల చిన్న పుష్పాలు ముదురు ఎరుపు తొడిమతో ఉంటాయి.
నక్షత్ర ఫలం చెట్టు సంవత్సరానికి నాలుగు సార్లు పూత పూసి కాయలు కాస్తుంది.
ఈ నక్షత్ర ఫలం చెట్టు యొక్క పండు 5 విభాగాలుగా ఉండి నక్షత్రం గుర్తును పోలి ఉంటుంది. ఈ పండు అండాకారం లేక దోసకాయ ఆకారంలో కండను కలిగి సుగంధభరిత వాసనతో పసుపు ఆరంజి ఆకుపచ్చ కలసిన రంగుతో ఆకర్షిస్తుంది.
Look up నక్షత్రఫలం చెట్టు in Wiktionary, the free dictionary.