అక్కన్న మాదన్నల చరిత్ర (పుస్తకం)

1962 తెలుగు పుస్తకం
(అక్కన్న మాదన్నల చరిత్ర నుండి దారిమార్పు చెందింది)


అక్కన్న మాదన్నల చరిత్ర వేదం వేంకటరాయశాస్త్రి రచించిన తెలుగు పుస్తకం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోలకొండ (నేటి గోల్కొండ) ను పాలించిన తానా షా (అబుల్ హసన్ కుతుబ్ షా), వారి మంత్రులు అక్కన్న, మాదన్నలకు సంబంధించిన చారిత్రక విశేషాలను వీరు దీనిద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించారు.

అక్కన్న మాదన్నల చరిత్ర
కృతికర్త: వేదం వేంకటరాయశాస్త్రి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: చరిత్ర
ప్రచురణ: వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మద్రాసు
విడుదల: 1949, 1962
పేజీలు: 126

ఈ పుస్తకం 1949లో తొలిసారిగా ముద్రించబడినది;[1] ద్వితీయకూర్పు 1962లో వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్ వారిద్వారా విడుదలచేయబడినది.[2] రెండు కూర్పులు ఈ ప్రచురణసంస్థకు చెందిన మద్రాసు, చాకలపేట యందున్న చంద్రికా ముద్రణాలయములో అచ్చువేయబడినవి.

విషయసూచిక

మార్చు

1. దండోరా; 2. తానాషా దర్బారు; 3. తానాషా పూర్వచరిత్ర; 4. అక్కన్న మాదన్నల స్వప్నములు; 5. ఉపాయసిద్ధి; 6. మాదన్న పరిపాలనాప్రారంభము; 7. శివాజీ; 8. శివాజీ గోలకొండ ప్రయాణము; 9. శివాజీ తానాషాను దర్శించుట; 10. ఆశాభంగము; 11. పాదుషా ప్రయత్నములు; 12. మొగలాయీలతో ఘర్షణ; 13. కుట్రలు, కుయుక్తులు; 14. మాదన్న మీద రెండవకుట్ర; 15. పాదుషాతో రాయబారము; 16. రామదాసు చరిత్రము; 17. మంత్రుల దుర్మరణము; 18. బిజాపూరు ముట్టడి; 19. గోలకొండముట్టడి ప్రారంభము; 20. క్షామము; 21. మరల ముట్టడి ప్రయత్నములు; 22. అబ్దుల్‌రజాక్‌లారీ కడపటి యుద్ధము; 23. తానాషా కడపటివిందు; 24. అబ్దుల్‌రజాక్‌లారీ బ్రదుకుట; 25. తానాషా కడపటి మాటలు

మూలాలు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. వేదము వేంకటరాయశాస్త్రి (1949). తానాషా, అక్కన్న మాదన్నలు (ప్రథమముద్రణము ed.). మద్రాసు: వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్.
  2. వేదం వేంకటరాయశాస్త్రి (1962). అక్కన్న మాదన్నల చరిత్ర (ద్వితీయముద్రణము ed.). మద్రాసు: వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్.