అఖాడచండీ ఆలయం

ఇది 10వ శతాబ్దానికి చెందిన దేవాలయం. ఇది బదుసాహి అనే పురాతన నగరంలోని బిందుసాగర్ సరస్సుకు పశ్చిమో

అఖాడచండీ ఆలయం (ఒరియా: ଅଖଡ଼ଚଣ୍ଡି ମନ୍ଦିର) (Lat.20°14’46”N., Long.85°60’02”E., Elev.61 ft) ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉంది. ఇది 10వ శతాబ్దానికి చెందిన దేవాలయం. ఇది బదుసాహి అనే పురాతన నగరంలోని బిందుసాగర్ సరస్సుకు పశ్చిమోత్తర దిశగా ఉంది.

అఖాడచండీ ఆలయం
అఖాడచండీ ఆలయం
పేరు
స్థానిక పేరు:అఖాడచండీ ఆలయం
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:ఒడిషా
జిల్లా:ఖుర్దా
ప్రదేశం:భువనేశ్వర్
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:చండి
నిర్మాణ శైలి:మందిరం
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
10 వ శతాబ్దం

ఆలయ విశేషాలు

మార్చు

దేవాలయం మార్కండేయ ఆలయానికి 15 మీటర్ల దూరంలోనూ, మోహినీ దేవాలయానికి వాయువ్యదిశలో 30 మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ అధిష్టాన దేవత మహిషాసుర మర్ధిని. ఈ దేవాలయం దక్షిణముఖంగానూ, అందలి ప్రధాన దైవం తూర్పు ముఖంగానూ ఉంటుంది. అనేక మతపరమైన ఉత్సవాలు, బాలభోగములు ఇక్కడ నిర్వహిస్తూంటారు. ఈ దేవాలయం భువనేశ్వర్ పురపాలక సంఘంచే నిర్వహింపబడుతున్నది. ఈ దేవాలయం ఒడిషా పురావస్తు శాఖ వారిచే X, XI ఆర్థిక కమిషన్ అవార్డులతో పునర్నిర్మించబడింది. ఈ దేవాలయం బిందుసాగర్ సరస్సుతో ఆవరింపబడి ఉంది. ఈ దేవాలయం బిందుసాగర్ సరస్సుకు 6.40 మీటర్ల దూరంలో ఉంది.

నిర్మాణ శైలి

మార్చు

వాస్తు అంశాలు

మార్చు

దేవాలయం కళింగ నిర్మాణ శైలిలో రాతితో నిర్మితమైనది. ప్రధాన దేవాలయం ఖఖరా డెయూల్. ఇది 1.28 మీ. వెడల్పు,1.83 పొడవు గల దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. దేవాలయం పై 42.94 మీ. ఎత్తున పభగ నుండి మస్తక అరకు ఖఖరా యొక్క విమానం ఉంటుంది. ఇవి ఐదు విభాగాలుగా 1.74 మీ. కొలతలుగా విస్తరింపబడి ఉంది. పపగ క్రిందిభాగమున 0.26 ఎత్తు ఉంటుంది. దేవాలయం యొక్క గండి ఖఖర వరుసలో మూడు అరుసలుగా అర్థ స్తూపాకృతులలో పైకప్పుకు విస్తరించి ఉంటాయి.

అలంకరణ అంశాలు

మార్చు

The doorjamb is decorated with two plaster design measuring 1.10 metres x 0.65 metres. Besides the main entrance there are two subsidiary gateways in the eastern and northern walls. These two gateways are uniform in measurement measuring 0.92 metres x 0.59 metres.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు