అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, కల్యాణి
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కల్యాణి (ఎయిమ్స్ కల్యాణి) భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ లోని కళ్యాణిలో ఉన్న ఒక ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లలో ఇది ఒకటి. ఇది 2014లో ప్రకటించబడింది, 2015లో ఆమోదించబడింది, 2016లో నిర్మాణం ప్రారంభమైంది, ఈ ఇన్స్టిట్యూట్ 2019లో కార్యకలాపాలు ప్రారంభించింది, 2019 సంవత్సరంలో ప్రారంభించిన ఆరు ఎయిమ్స్‌లో ఇది ఒకటి.
రకం | ప్రభుత్వ |
---|---|
స్థాపితం | 2019 |
అధ్యక్షుడు | చిత్ర సర్కార్ |
డైరక్టరు | గీతాంజలి బాట్మానబనే (in-charge) |
విద్యార్థులు | 50 |
స్థానం | కళ్యాణి, పశ్చిమ బెంగాల్, భారతదేశం 22°58′10″N 88°31′28″E / 22.9695°N 88.5245°E |
కాంపస్ | గ్రామీణ |