అగమ్యాగమనము (Incest) అనగా రక్తసంబంధంతో సంబంధంలేని లైంగిక సంబంధం, లేదా దగ్గర రక్తసంబంధీకుల మధ్య లైంగిక సంబంధం. బైబిల్లో ఆదాము ఆవ్వల కుమారులు కుమార్తెలకు మధ్య వివాహాలు జరిగాయి. మధ్యభారత దేశంలో పంచమ బైగ దళితుల్లో తాతయ్య/అమ్మమ్మలు మనుమలు/మనుమరాళ్ళు లను వివాహం చేసుకోవడం, మలాబార్ ద్వీపంలో తండ్రికి పెద్ద కుమార్తెను రెండవ భార్యగా చేసుకోవడం వంటి ఆచారాలున్నాయి.

Table of prohibited marriages from The Trial of Bastardie by William Clerke. London, 1594
Maya king Shield Jaguar II with his aunt-wife, Lady Xoc. AD 709

పూర్వం లో కేవలం కొత్త తరానికి జన్మనివ్వడానికి నియోగ అనే పద్ధతి ఉండేది. నియోగ అనగా భర్తలో వీర్యదోషం ఉన్నా లేక భర్త మరణించినా సంతానం భార్య మరో పురుషుడిని ఆశ్రయించడం. ఈజిప్టుకు ఆఖరి ఫరో అయిన క్లియోపాత్రా 7 తన చిన్న సోదరుడైన టొలెమీ 13 ను సంతానం కోసం వివాహం చేసుకున్నది. గ్రీకు పురాణం ప్రకారం మిర్హా తన తండ్రియైన సినిరాస్ తో కలిసి ఎడొనిస్ కు జన్మనిచ్చింది. థెబ్స్ కు చెందిన ఓడిపన్ అనే రాజు తన తల్లి అయిన జోకస్టాను వివాహమాడతాడు.

ఆగమ్యాగమనము వలన తరతరాలనుండి ఉండే రక్తము బలహీనమైపోతుంది. మానవ జాతి నశించిపోతుంది. కనుక పుట్టే పిల్లల్లో శరీరక జన్యు లోపాలను నివారంచడానికి ఆగమ్యాగమనం చాలా దేశాల్లో పూర్వమే నిషేధించబడింది. ఆగమ్యాగమనము అనేది అపవిత్ర కార్యంగా చెప్పబడింది. తల్లిదండ్రులకు, బిడ్డలకు, సోదరీ సోదరులకు మధ్య గల సంబంధాలను ఎందరో ఋషులు పవిత్ర బంధాలుగా వివరించారు. ఆగమ్యాగమనంలో ఒకటైన మేనరికపు వివాహాలు భారత దేశంలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.

మూలాలు

మార్చు

యితర లింకులు

మార్చు