నందిని అగసర (జననం: 2003 ఆగస్టు 7) భారతీయ క్రీడాకారిణి. ఆమె 2022 ఆసియా క్రీడల కోసం భారత అథ్లెటిక్స్ జట్టులో భాగంగా ఎంపికైంది.[1]

నందిని అగసర
వ్యక్తిగత సమాచారం
జాతీయతభారతీయురాలు
జననం (2003-08-07) 2003 ఆగస్టు 7 (వయసు 20)
క్రీడ
క్రీడఅథ్లెటిక్స్

చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడలలో హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది.[2][3] 2023 అక్టోబరు 1న జరిగిన హెప్టాథ్లాన్‌ ఫైనల్లో 5712 పాయింట్లతో ఆమె మూడో స్థానంలో నిలిచింది.[4]

కెరీర్ మార్చు

అగసర నందిని పాల్గొన్న టాప్ టోర్నమెంట్లు..

  • 2023: చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకం. సెప్టెంబరు 30న హాంగ్‌జౌ ఆసియన్ గేమ్స్ హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో ఆమె 200 మీటర్ల పరుగులో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేసింది.
  • 2022: అక్టోబర్‌లో, బెంగుళూరులోని శ్రీ కంఠీరవ అవుట్‌డోర్ స్టేడియంలో జరిగిన నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం గెలుచుకుంది.
  • 2022: ఆగస్టులో, ఆమె ప్రపంచ అథ్లెటిక్స్ U20 ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో ఏడవ స్థానంలో నిలిచింది, పాస్కల్ గెరెరో స్టేడియం, కాలి, కొలంబియా, కొత్త అండర్-20 జాతీయ రికార్డును నెలకొల్పింది.
  • 2021: జూన్‌లో, పాటియాలాలోని నేషనల్ ఇంటర్-స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకుంది.

మూలాలు మార్చు

  1. "Full list of Indian athletes for Asian Games 2023". Firstpost (in ఇంగ్లీష్). 2023-08-26. Retrieved 2023-10-02.
  2. Sportstar, Team (2023-10-01). "Asian Games 2023: Nandini Agasara won bronze in women's heptathlon". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
  3. PTI (2023-10-01). "Nandini Agasara wins bronze in women's heptathlon 800m". telanganatoday.com. Retrieved 2023-10-01.
  4. "Agasara Nandini | ఆసియా క్రీడల్లో సత్తాచాటిన తెలంగాణ గురుకుల అథ్లెట్‌.. హెప్టాథ్లాన్‌లో అగసర నందినికి కాంస్యం-Namasthe Telangana". web.archive.org. 2023-10-03. Archived from the original on 2023-10-03. Retrieved 2023-10-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)