2022 ఆసియా క్రీడలు
2022 ఆసియా క్రీడలు, లేక అధికారికంగా 19వ ఆసియా క్రీడలు 23 సెప్టెంబర్ నుండి 8 అక్టోబర్ 2023 వరకు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా వ్యాప్త బహుళ-క్రీడా ఈవెంట్. దీన్ని హౌజౌన్ 2022 అని కూడా పిలుస్తున్నారు.
వాస్తవానికి 2022 సెప్టెంబర్ 10 నుండి 25 వరకు జరగాల్సి ఉంది, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆటలు 2023కి వాయిదా పడ్డాయి. [1] 2023లో జరిగే తేదీలు 19 జూలై 2022న ప్రకటించబడ్డాయి.[2] 1990లో బీజింగ్, 2010లో గ్వాంగ్‌జౌ తర్వాత ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చిన మూడో చైనా నగరంగా హాంగ్‌జౌ నిలుస్తోంది. 19వ ఆసియా క్రీడల నినాదం : హార్ట్ టు హార్ట్. 19వ ఆసియా క్రీడల్లో మొత్తం 45 దేశాలు పాల్గొన్నాయి. 19వ ఆసియా క్రీడల్లో చైనా 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యం మొత్తం 383 పథకాలతో మొదటి స్థానంలో నిలిచింది. 188 పథకాలతో జపాన్ రెండో స్థానంలోనూ, 190 పథకాలతో దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలిచాయి. భారతదేశం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యలు మొత్తం 107 పథకాలతో నాలుగు స్థానంలో నిలిచింది[3].
బిడ్డింగ్ ప్రక్రియ
మార్చుజెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌ నగరం కార్యక్రమం నిర్వహిస్తామని ఒక ప్రతిపాదనను సమర్పించిందని, పాల్గొనడానికి అవసరమైన అన్ని చర్యలను పూర్తి చేసిన ఏకైక నగరం అని చైనీస్ ఒలింపిక్ కమిటీ ధృవీకరించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ 2015 ఆగస్టులో ముగిసింది. తుర్క్‌మెనిస్తాన్‌లోని అష్గాబాత్‌లో 16 సెప్టెంబర్ 2015న జరిగిన 34వ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా జనరల్ అసెంబ్లీలో హాంగ్‌జౌ అధికారికంగా ఆతిథ్య నగరంగా అవార్డు పొందింది.[4]
ఏర్పాట్లు
మార్చుమార్కెటింగ్
మార్చుచిహ్నం
మార్చు2018 ఆగస్టు 6న హాంగ్‌జౌ కల్చర్ రేడియో టెలివిజన్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకలో ఈ క్రీడల చిహ్నం "సర్జింగ్ టైడ్స్" ఆవిష్కరించబడింది; ఇది ఝీజంగ్ సంప్రదాయ చేతి ఫ్యాన్, రన్నింగ్ ట్రాక్, కియాంటాంగ్ నది టైడల్ బోర్, రేడియో తరంగాలను (వైర్‌లెస్ కనెక్టివిటీకి ప్రతీక) పోలి ఉండేలా రూపొందించబడింది. ఈ చిహ్నం "కొత్త యుగంలో ఊపందుకుంటున్న చైనీస్ లక్షణాలతో కూడిన సోషలిజపు ఉన్నతాదర్శాన్ని", "ఒలింపిక్స్ కమిటీ ఆఫ్ ఏషియా యొక్క ఐక్యత, సంఘీభావం, అభివృద్ధిలని" ప్రతిబింబించేలా ఉందని నిర్వహణ కమిటీ పేర్కొంది. [5] [6]
- ↑ Chakraborty, Amlan (2022-05-06). "Games Hangzhou Asian Games postponed until 2023 over COVID". Reuters (in ఇంగ్లీష్). Archived from the original on 8 June 2022. Retrieved 2023-07-25.
- ↑ "OCA Press Release: OCA announces new dates for the 19th Asian Games - Hangzhou". Olympic Council of Asia. 19 July 2022. Archived from the original on 23 July 2022. Retrieved 19 July 2022.
- ↑ "Reasons Behind the 107 Medal Win at 19th Asian Games 2023". IISM Mumbai (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-10-17. Retrieved 2023-11-17.
- ↑ Butler, Nick (16 September 2015). "Hangzhou confirmed as host of 2022 Asian Games". Inside the Games. Archived from the original on 19 September 2015. Retrieved 16 September 2015.
- ↑ "Hangzhou Launches 2022 Asian Games Emblem". Infobae. 12 July 2021. Archived from the original on 2 March 2023. Retrieved 2 March 2023.
- ↑ "Hangzhou 2022 launch official emblem as prepare to succeed Jakarta Palembang 2018 as Asian Games hosts". Inside the Games. 2018-08-07. Archived from the original on 23 December 2019. Retrieved 2022-02-19.