అగ్నికులక్షత్రియులు

(అగ్నికుల క్షత్రియ నుండి దారిమార్పు చెందింది)

అగ్నికులక్షత్రియులు అనే కులం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వెనుకబడిన తరగతులకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ఏ విభాగానికి చెందుతారు.[1] నేడు ఆంధ్ర ప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలలోను, కృష్టా, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ఎక్కువగా వీరు తీరా ప్రాంతాలలో నివసిస్తారు.

అగ్ని కుల క్షత్రియులు
వర్గీకరణఇతర వెనుకబడిన తరగతులు (ఆంధ్రప్రదేశ్)
జనాభా గల రాష్ట్రాలుఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ
Reservation (Education)BC-A

ప్రస్తుత సామజిక పరిస్థితి

మార్చు

నేడు అగ్నికులక్షత్రియ కులం నిరక్షరాస్యత,అనైక్యతగా ఎవరికీ వారీగా వుంటూ పార్టీలుగా వర్గాలుగా విడి విడిగా ఉండటం వలన అన్ని రంగాలలో వెనకబడిపోయారు. అధికశాతం కోస్తా తీరా ప్రాంతంలో చేపల పెంపకం, చేతి వృత్తులు చేసుకుంటూ నిరంతరం జీవిత పోరాటం చేస్తున్నారు.

సమస్యలు

మార్చు
  • ప్రపంచ ప్రఖ్యాత చెందిన దక్షిణ కాశీగా పేరుపొందిన అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయాన్ని, కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలని నిర్మించింనది అగ్నికులక్షత్రియ కులస్తులు.[2]
  • కోపనాతి కృష్ణమవర్మ, పెనబోతూ గజేంద్రుడు ఈ ఆలయాల నిర్మించారు.కానీ ధర్మకర్తలుగా వేరే కులస్తులు ఉంటున్నారు. ఆలయ ధర్మకర్తల వీరి కులస్తులు ఉండేలా వీరి కుల సంఘం ఎప్పటినుంచో పోరాటం చేస్తుంది.

ఆచార వ్యవహారాలు

మార్చు

అగ్నికులక్షత్రియులకు ఉపనయనము, యజ్ఙోపవీతం ఆచారం ఉంది. వివాహానికి ముందు ఉపనయనం చేసుకుంటారు. వీరి కులస్తులు ఎక్కువగా హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వీరికి రఘుకుల గోత్రం ఉంది.

ప్రముఖులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "National Commission for Backward Classes". www.ncbc.nic.in. Retrieved 2023-05-17.
  2. "Lakshmi Narasimha Swamy Temple, Antarvedi, Andhra Pradesh". hindupost.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-22. Retrieved 2023-05-17.