అగ్నికులక్షత్రియులు

(అగ్నికుల క్షత్రియులు నుండి దారిమార్పు చెందింది)

అగ్నికులక్షత్రియ వంశం (సంస్కృతం: अग्निकुलक्षत्रिय वंश)

అగ్నికులక్షత్రియ! అగ్ని అంటే వేదము, కుల అంటే వంశము, క్షత్రియ అంటే ధర్మాన్ని రక్షించేవాడు! "సనాతన హైందవ ధర్మాలను రక్షించేవాడు". "క్షత్రాత్ త్రాయత ఇతి క్షత్రః, తస్య అపత్యం పుమాన్ క్షత్రియః" - అనగా ప్రజలను సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు క్షత్రియుడు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం క్షత్రియులు యుద్ధ వీరులు, సామ్రాజ్యాలు పరిపాలించవలసినవారు. భారతీయ మత గ్రంథాలల్లో పేర్కొనబడిన శ్రీ రాముడు,  శ్రీ కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి ఎందరో దైవస్వరూపులు క్షత్రియులుగా జన్మించారు. అగ్నికలశం, కాషాయభగవ ధ్వజం, సింహం, పులి, రెండు ఖడ్గాలతో కూడిన డాలు అగ్నికులక్షత్రియుల చిహ్నంగా నిలుస్తుంది.

పరిచయం:సవరించు

అగ్నికులక్షత్రియ వంశము భారతీయ ఇతిహాస పురాణములలో క్షత్రియ రాజవంశముగా పరిగణించబడుతుంది. భారతదేశాన్ని ఎన్నో రాజ వంశాలు వందల సంవత్సరాలపాటు పరిపాలించాయి. అందులో ఆంధ్ర అగ్నికులక్షత్రియ రాజులు ఒకరు. ఆంధ్ర ప్రాంతమును పాలించుటవలన వీరు రాజులు లేదా ఆంధ్ర క్షత్రియ రాజులు. తెలుగు మాతృభాషగా కలిగియున్న వీరు పూర్వకాలం సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించారు. వీరి వంశస్థులు నేడు ఆంధ్ర ప్రాంతంలోని ఉభయ గోదావరి జిల్లాలలోను, కృష్టా, గుంటూరు, విశాఖ, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు. తక్కువగా ఇతర జిల్లాల్లో కనిపిస్తారు. తమిళనాడులోని చెన్నై పట్టణంలో కనిపిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రిజర్వేషన్ సిస్టం ప్రకారం వీరు బీసీ-ఏ విభాగానికి చెందుతారు.

 • అగ్నికులక్షత్రియ వంశము అన్ని కులాల మాదిరి వృత్తి ఆధారంగా ఏర్పరచబడిన కులములలో ఒక కులము కాదు. దేశ రక్షణ కొరకు ధర్మ రక్షణ కొరకు ఏర్పరచబడిన ప్రాచీన క్షత్రియవర్ణం అఖండ భారత దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన రాజవంశం అని అనేక చారిత్రాత్మక ఆధారాలు వున్నాయి.
 • భారతదేశానికి స్వాతంత్రంరాక మునుపు దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారి చేత మొట్టమొదటిసారి క్షత్రియులు గా గుర్తించబడిన కులం అగ్నికులక్షత్రియ కులం. G.O. NO.271, 13 జూన్ 1929. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన G.O. ములముగా ఆంధ్రప్రదేశ్ లో నిజమైన క్షత్రియవంశం గా పరిగణించబడుతున్నారు.
 • అగ్నికులక్షత్రియులు హిందూ వర్ణ వ్యవస్థలో "క్షత్రియవర్ణం" కు చెందిన అగ్రవర్ణ కులమని చెప్పవచ్చు. అగ్నికులక్షత్రియ కులంలో ఎక్కువ శాతం ప్రజలు ఆర్ధిక వెనుకబాటుతనం వలన వీరికి బిసి కింద రిజర్వేషన్ ఇవ్వబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రిజర్వేషన్ సిస్టం ప్రకారం వీరు బిసి-ఎ విభాగానికి చెందుతారు. బిసి మండల్ కమీషనులో ఒక సభ్యుడిగా ఉన్న పెదసింగు లక్ష్మణరావు గారి అధ్యక్షతన ఓసి లుగా పరిగణిస్తున్న అగ్నికులక్షత్రియులను బిసి లుగా గుర్తించేలా చేసారు. బిసి కులాలలో అగ్నికులక్షత్రియులు అగ్రగణ్యులు.
 • పల్లవ సామ్రాజ్యం అంతమైన తర్వాత వీరు చోళ రాజులకు సామంతులుగా మారి చోళ వంశంలో ఐక్యమైపోయారు.
 • దక్షిణాదిన భాషాపరంగా అగ్నికులక్షత్రియులు, వన్నియకుల క్షత్రియులు గా మారిపోయారు.
 • ఉత్తరాదిన అగ్నికుల బ్రహ్మక్షత్రియులుగా నాలుగు వర్గాలుగా చెప్పినట్లుగా అగ్నివంశపురాజులు అనే పుస్తకంలో రాసారు.
 • వారు ప్రమర, చౌహాను, చాళుక్య, పరిహారలు. పృథ్వీరాజ్ చౌహాన్ అను రాజపుత్ర సామ్రాట్ అగ్నికులక్షత్రియులు అని అతని మిత్రుడు మంత్రి అయిన చాంద్ బర్దాయ్ తను రాసి ప్రచురించిన పృధ్వీరాజ్ రాసో అనే పుస్తకం లో తెలియజేసాడు. విద్యాదాతలుగా, ఆలయ నిర్మాతలుగా పేరుగాంచిన వారనేకులు ఈ కులంలో ఉన్నారు.
 • ఉత్తర భారతదేశాంలోని రాజపుత్స్ అనే క్షత్రియ వంశం అగ్నికులక్షత్రియ వంశం నుంచి ఆవిర్భవించారు!
 • పల్లవ రాజుల కాలంలో అంతమైన తర్వాత వీరు వ్యవసాయదారులుగా, నౌకా నిర్మాతలుగా, అంతర్జాతీయ నౌక వాణిజ్య వ్యాపారులుగా ఇలా అనేక వృత్తులలో స్థిర పడ్డారు.
 • అగ్నికులక్షత్రియ వంశం అనునది ఒకానొకప్పుడు దేశవ్యాప్తంగా ప్రబలియున్న గొప్ప పాలకవంశము. ఇది ఏవో కొన్నిరాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన కులము కాదు. అగ్నికులక్షత్రియులు ప్రధానంగా వ్యవసాయము, నౌకానిర్మాణము, శిల్పకళ, దేవాలయ అర్చకత్వములను వృత్తులుగా కలిగియుండేవారు. పల్లవులు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేసిన నౌకానిర్మాణము, నౌకాయానము, నౌకావ్యాపారము 50సం||ల క్రిందటివరకు అగ్నికులక్షత్రియులు ఆధ్వర్యంలోనే నడిచింది. పల్లవులు అభివృద్ధి పరచిన దేవాలయవ్యవస్థ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అగ్నికులక్షత్రియులు ఆధ్వర్యంలోనే నడుస్తున్నది.
 • అగ్ని పదమునకు సంస్కృత పదము 'వహ్ని'. 'వహ్ని'కి వికృతి 'వన్ని'.

పుట్టుపూర్వోత్తరాలుసవరించు

ఉత్తర భారతదేశంలో మౌర్య, శుంగ వంశములు అంతరించుట వల్ల, అప్పటికే కావేరి, గంగా నదుల మధ్య, తూర్పు పశ్చిమ సముద్రముల మధ్య విస్తరించియున్న ఆంధ్రమహాసామ్రాజ్యాన్ని శాతవాహన వంశజులైన రాజపుత్రులు అల్పరాజ్యములను స్థాపించుట వలన సరైన నాయకత్వము లేకపోవుట వల్ల, పరదేశీయుల దాడినుండి దేశమును రక్షించగల చక్రవర్తిత్వం కొరకు అప్పటి పీఠాధిపతులు బ్రాహ్మణరాజవంశముల నుండి వీరులగు నలుగురును ఏరి వారియందు బ్రహ్మతేజస్సును, క్షాత్రతేజస్సును నిలుచునట్లు సంకల్పించి వారిచేత హోమాదులను చేయించి, దేశమును నాలుగు భాగములుగాచేసి ఆ నలుగురిని అధినాయకులుగా చేశారు. ఆ నలుగురు తమ నాయకత్వమును అంగీకరించిన సామంతరాజులతో కలిసి విదేశీయుల దాడులనుండి దేశమును కాపాడారు. ఈ నాలుగువంశముల వారు అగ్నికులక్షత్రియులు అని పిలువబడ్డారు. అగ్ని దేవతలలో బ్రాహ్మణుడు. బ్రాహ్మణవర్ణమందు పుట్టి క్షాత్రమవలంబించిన వాడు "అగ్నికులక్షత్రియుడు”. వీరి నాయకత్వమును అంగీకరించిన వారిలో పల్లవులు సామంతులైన చోళులు, చాళిక్యులు ఉన్నారు.

అగ్నికులక్షత్రియ చరిత్రసవరించు

అగ్నికులక్షత్రియులు వంశరిత్యా హైందవ ధర్మ రక్షణ, దేశ రక్షణ, దేవాలయాల నిర్మాణం మరియు నిర్వహణ మరియు సంపూర్ణ రాజ్యపాలన సంరక్షణ చర్విత చర్వణమైన అగ్నికులక్షత్రియుల చరిత్ర ఇది.

ప్రస్తుత సామజిక పరిస్థితి:

అటువంటి అగ్నికులక్షత్రియ కులం నేడు నిరక్షరాస్యత మరియు అనైక్యతగా ఎవరికీ వారీగా వుంటూ పార్టీలుగా వర్గాలుగా విడి విడిగా ఉండటం వలన అన్ని రంగాలలో వెనుకబడిపోయి అధికశాతం కోస్తా తీరా ప్రాంతంలో స్థిరపడి అనేక చేతి వృత్తులు చేసుకుంటూ నిరంతరం జీవిత పోరాటం చేస్తున్నారు.

ప్రధాన సమస్యలుసవరించు

 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో శ్రీకాకుళం జిల్లా లోని ఇచ్ఛాపురం నుండి చిత్తూరు లోని కుప్పం వరకు విస్తరించి జనాభా పరంగా దాదాపు ౩౦ నుండి 35 లక్షల మంది వున్నా అతిపెద్ద సామజిక వర్గం అగ్నికులక్షత్రియ సామాజిక వర్గం అయిన మన కులం నుండి ఒక్కరి ఇద్దరికీ మాత్రమే ఎం ఎల్ ఏ లు గా పోటీ చేసే అవకాశం ఇచ్చి మనల్ని రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలలో అగ్నికులక్షత్రియులకు సీట్లు కేటాయించాలి.
 • ప్రక్క రాష్ట్రాలు ఐన తమిళనాడు మరియు పుదుచ్చేరి లలో మన కులస్థుల వెనుకబాటు తనాన్ని గుర్తించి వారికి రిజర్వేషన్ కల్పించి వారి అభివృద్ధికి సహకరిస్తున్నారు. ఇక్కడ మాత్రం మన కులాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా మన వారి అభివృద్ధికి సహకరించకుండా మన వారి సామజిక అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారు.
 • కాకినాడ జిల్లాకు విద్యాదాత "శ్రీ మల్లాడి సత్య లింగం నాయకర్" గారి పేరును కాకినాడ జిల్లాకు పెట్టాలి. కాకినాడ జిల్లాకు తలమానికంగా నిలబడి కుల, మత, ప్రాంత, వర్గ విబేదములు లేకుండా సుమారు 100 సంవత్సరములకు పైగా విద్యా బోధనా, వసతి అన్నీ ఉచితంగా అందిస్తున్న MSN ఛారిటీస్ వ్యవస్థాపకులు శ్రీ మల్లాడి సత్య లింగం నాయకర్ గారి పేరు ప్రతిపాదిత MSN కాకినాడ జిల్లాకు పెట్టడం ద్వారా ఈ మహనీయుని ఆశయాలు ఎందరికో స్ఫూర్తిదాయకం అవుతుంది. విద్యవ్యాప్తి కొరకు తన యావదాస్తిని విరాళంగా ఇచ్చినా కీ!!శే శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ గారు స్థాపించిన ఎం ఎస్ ఎన్ చ్యరిటిస్ భూములు , ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న ఏ ఒక్క నాయకుడు కానీ ప్రభుత్వం కానీ వాటి మీద ద్రుష్టి పెట్టడం లేదు. వాటిని రక్షించటం లేదు.
 • ప్రపంచ ప్రఖ్యాత చెందిన దక్షిణ కాశీగా పేరుపొందిన అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయాన్ని మరియు కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలని నిర్మించింనది మన అగ్నికులక్షత్రియులు కి!!శే శ్రీ కొపనాతి కృష్ణమవర్మ గారు మరియు కి!!శే పెనబోతూ గజేంద్రుడు గారు అయిన ఆ ఆలయాల అనువంశిక ధర్మ కర్తలుగా వారి వారసులని కాకుండా ప్రక్క కులం వారిని ధర్మ కర్తలుగా ప్రకటించి అగ్నికులక్షత్రియ కులాన్ని అవమానిస్తున్నారు.
 • ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం లో ప్రతి కులానికి సామజిక భవనం(సత్రం) వున్నా మన అగ్నికులక్షత్రియ కులానికి మాత్రమే ఏర్పాటు చెయ్యలేదు అంటే నేటి ప్రభుత్వాలు అగ్నికులక్షత్రియులను ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రతి అగ్నికులక్షత్రియుడు గ్రహించాలి.
 • అగ్నికులక్షత్రియ కార్పొరేషన్ కు తగు నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలి.
 • ఆంధ్రప్రదేశ్ లో జనాభా ప్రాతిపదికన బీసీ-ఏ జాబితాలో 15% మంది ప్రజలు ఉన్నారు. వారికి ప్రభుత్వం 10% రిజర్వేషన్ కల్పించాలి.
 • అగ్నికులక్షత్రియ, వన్నియకులక్షత్రియ, వన్నెరెడ్డి, వన్నెకాపు, పల్లి, పల్లిరెడ్డి, పల్లికాపులతో కూడిన బీసీ-ఏ జాబితాలో ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలని ప్రభుత్వం వారిని విన్నవించుకుంటున్నారు.
 • నెల్లూరు జిల్లాలో 1998 నుంచీ "రాజులు కులస్తులు" నడుపుతున్న డూప్లికేట్ అగ్నికుల క్షత్రియ సంఘాన్ని రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
 • ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్ ద్వారా గతంలో అగ్నికుల క్షత్రియులు పేరుతో రాజులు తదితర కులస్తులు తీసుకున్న BC(A) సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోవద్దని, వీటి ఆధారంగా కొత్తగా ఇంటిగ్రేటెడ్ కులం సర్టిఫికెట్లను జారీ చేయ వద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
 • అగ్నికుల క్షత్రియ సామాజిక నామాన్ని న్యాయ విరుద్ధంగా వాడుకుంటున్న ఇతర జాతీయులపై తగు చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
 • క్షత్రియులమైనా... అగ్నికుల క్షత్రియులమైనా మేము ఒక్కరిమే కనుక క్షత్రియ కార్పొరేషను పేరుతో మరోక కులానికి కార్పొరేషను ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.
 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాములో నివసిస్తున్న ప్రతి ఒక్క అగ్నికులక్షత్రియ గ్రామాన్ని "గ్రామ పంచాయతీలుగా" ప్రకటించాలి.
 • ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పల్లిపాలెం అని ఉన్న గ్రామాల పేరు మార్చి పల్లవ పురం అలానే మత్స్యకార పేట, ఫిషెర్మాన్ పేట, జాలరిపేట అని ఉన్న చోట అగ్నికులక్షత్రియుల ఆత్మగౌరవం కోసం అగ్నికులక్షత్రియ గ్రామం కింద ప్రభుత్వాలు మార్చాలి.
 • ఆంధ్రప్రదేశ్ కోస్తాతీర ప్రాంతంలో నివసిస్తున్న అగ్నికులక్షత్రియ గ్రామాల ప్రజలు తుఫానులు తాకిడికి, గోదావరి, కృష్ణా నదుల పరీవాహిక ప్రాంతాలలో వచ్చే వరద ఉధృతి సమయంలో అగ్నికులక్షత్రియ గ్రామాలు, మరియు లంక గ్రామాలు చాలా నష్టపోతున్నాయి. ప్రజలు తుఫానులకు, వరదల నుంచి ప్రజలు ఇబ్బంది చెందకుండా ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారన్ని చూపించాలి. అగ్నికులక్షత్రియ గ్రామాలకు తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ప్రధాన రహదారులు, వంతెనలు, స్మశానవాటికలు ఇటువంటి కనీస మౌలికసదుపాయాలు ప్రభుత్వాలు కల్పించాలి.
 • క్రైస్తవ మతమార్పిడులు అగ్నికులక్షత్రియ కులంలో ప్రధాన సమస్యగా తయారయ్యాయి. దేశవ్యాప్తంగా ఎన్నో సనాతన హిందూ దేవాలయాలు నిర్మింజేసి, హిందూ ధర్మ పరిరక్షణకు ఎంతో కృషి చేసినవారు అగ్నికులక్షత్రియులు. అటువంటి గణ కీర్తి కలిగిన అగ్నికులక్షత్రియులు డబ్బు కోసం, మాయమాటలు చెప్పి, ప్రలోభాలు పెట్టి క్రైస్తవ మత మార్పుడులకు గురిచేస్తూన్నారు. తమ చరిత్ర తెలియని అమాయకపు అగ్నికులక్షత్రియులు మతమార్పుడులకు గురిఅవుతున్నారు.


ఆచార వ్యవహారాలుసవరించు

అగ్నికులక్షత్రియులు మాత్రమే, హిందూమతం యొక్క సాంప్రదాయ సోపానక్రమంలో ఉన్నత స్థాయి క్షత్రియులుగా పరిగణించబడ్డారు. అగ్నికులక్షత్రియులు సనాతన క్షత్రియ ధర్మాలను ఆచరించే సుక్షత్రియులు. ముందుగా మనం హిందూ ధర్మంలో క్షత్రియుల ఆచార వ్యవహారాలను తెలుసుకోవాలి. క్షత్రియ ధర్మంలో ఉపనయనము, యజ్ఙోపవీతం, వివాహ సమయంలో ధరిస్తున్న పవిత్ర జంద్యము తీసివేయక ఎల్లప్పుడు ఉంచుకుని జంధ్యాన్ని ధరించాలి. సత్పరిపాలన, హైందవ ధర్మోద్దరణ, ఆలయలనిర్మాణము, దైవభక్తి, దేశభక్తి, బారసాల, కేశఖండనం, ఉపనయనం, ఖడ్గవిద్య, గుర్రపుస్వారీ, వివాహముకు క్షత్రియ తలపాగా, ఖండ పూజ, కన్యాదానం, ఆలయ అర్చకత్వం, కాశీ యాత్ర, రాజ్యపాలన ఇలా 16 ఆచారాలు ఉంటాయి. వర్ణాశ్రమ ధర్మం ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే ఇవి పాటిస్తారు. ఇతర కులాలు ఈ క్షత్రియ ఆచారాలను అనుసరించవు. సూర్యవంశం అగ్నికులక్షత్రియరాజుల మూలపురుషుడు ఆరాధ్య దైవం "శ్రీ రామ చంద్ర ప్రభువు". సాక్షాత్తు శ్రీరామచంద్రుని  వంశమున జన్మించిన క్షత్రియ వంశం అగ్నికులక్షత్రియులు. వీరు సూర్యవంశరాజులు రఘుకుల, రవికుల గోత్రిజ్ఞులు. అగ్నికులక్షత్రియుల కులదేవత తారాదేవి అమ్మవారు అంటే ఇప్పుడు "కంచి కామాక్షి అమ్మవారు". మన పల్లవుల కులదేవతగా పూజించే తారాదేవి అమ్మవారు ఉగ్రస్వరూపం అమ్మవారి ఉగ్రరూపం శ్రీచక్రం వేసి "కంచి కామాక్షి అమ్మవారి"గా పరివర్తనం చెందారు. ప్రస్తుతం అగ్నికులక్షత్రియ వంశస్థ పురుషుల పేరు చివరన రాజు, వర్మ, నాయకర్ అని మహిళలు పేరు చివరన దేవి, వర్మ అనే బిరుదును కలిగి ఉంటారు. భారతీయ సైన్యం లో పురాతన పదాతిదళ రెజిమెంట్‌ అయినా "రాజ్‌పుత్ రెజిమెంట్, రాజపుతన రైఫిల్స్"లో అగ్నికులక్షత్రియులు భారతసైన్యంలో చేరి సేవలు అందిస్తారు. వీరి నినాదం రాజ రామ చంద్ర కి జై.!

అపోహసవరించు

భారతదేశంలో కులాల విభజనకు, కులవృత్తులను స్థిరపరచడానికి మూలగ్రంథమైన మనుస్మృతి 10అధ్యాయం.48శ్లోకంలో "మత్స్యఘాతో నిషాదానాం" అంటే చేపలు పట్టే వృత్తి నిషాదులది” అని ఉంది. అగ్నికులక్షత్రియులు (క్షత్రియ వర్ణంకి చెందినవారు) నిషాదులని చరిత్రలో ఎక్కడా లేదు. సముద్రంలో చేపలుపట్టి అమ్ముకోవడం వీరి ప్రధానవృత్తి అని కొందరు అపోహ పడుతుంటారు.. కానీ వీరు వ్యవసాయదారులుగా, వడ్రంగులుగా, నౌకా నిర్మాతలుగా ఇలా అనేక వృత్తులలో స్థిర పడ్డారు.

మత్స్యకార కులాలు అయిన వాడబలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, నెయ్యల, పట్టపు అన్నా ఒకటేనని చెప్పటానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. కనీసము పైన ఉన్న కులాలు అగ్నికులక్షత్రియ కులానికి ఉపకులాలు కూడా కావు.

అగ్నికుల క్షత్రియులలో కొద్ది మంది మత్స్యకారులు ఉన్నారు. కాని మత్స్యకార కులాల వారందరు అగ్నికులక్షత్రియులు కాదు.

అగ్నికులక్షత్రియ కులం అయినా (క్షత్రియ వర్ణం) సమాజం ఎందుకు చిన్నచూపు చూస్తుందో, ఎందుకు హేళన చేస్తుందో, ఎందుకు అణచివేస్తుందో విజ్ఞులు, మేధావులు, నిజాయితీగల చారిత్రక పరిశోధకులు నిగ్గుతేల్చవలసి ఉంది. అగ్నికుల క్షత్రియులు బ్రాహ్మణ సనాతన ధర్మాలున్న సుక్షత్రియులు యజ్నోపవిత్రం ఆలయ అర్చకత్వం, రాజ్యపాలన వీరి నైజం అంతేకాని ఈ మధ్యలో వచ్చిన సాధారణ మత్స్యకారులతో వీరిని చేర్చి అవమానపరచటమే అవుతుంది. కాలానుగుణంగా మారిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాచరికాన్ని కుడా తస్కరించి వీరిని వీరి కులచరిత్రను కుడా కొన్ని కుల వారు ఉపయోగించుకొవటం శోచనీయం.

గోత్రాలు, గృహనామాలుసవరించు

అగ్నికులక్షత్రియులకు గోత్రాలు బహుళమున్నవి.

రఘుకుల - రవికుల గోత్రం, జంబు మహర్షి గోత్రం, అగ్ని గోత్రం

రఘుకుల - రవికుల గోత్రం

వీరి గృహనామములు : 1.గోకేటి,2.గొల్లపోతు,3.అంకాని,4.అంకాడి, 5.అంగ,6.అవనిగడ్డ,7.అండ్రాజు,8.ఆకుల, 9.బర్రి,10.బొడ్డు,11.బొమ్మిడి,12.చెన్ను,13.చింతా,14.చిప్పల,15.చెక్క,16.నాగాడి,17.గుల్లల,18.జల్లా,19.కర్రి,20 కామాడి, 21.కన్నా,22.కొక్కిలిగడ్డ, 23.కోల,24.కొల్లాటి,25.కొల్లు,26.కొపనాతి, 27.కొప్పాడ,28.లంకాడ,29.లంకె,30.మధురాంతకం,31.మల్లాడి,32.మర్ల,33.మచ్చా,34.మాతా,35.మైలా,36.మోకా,37.మోపిదేవి,38.నడకుదిటి,39.నాయుడు,40.నాగిడి,41.ఒడుగు, 42.ఓలేటి,43.పినపోతు,44.పెదసింగు,45.పీత, 46.పెమ్మాడి,47.పొన్నమండ,48.పోతాబత్తుల, 49.రామాడ,50.రామాని,51.రేవు,52.రేకాడి, 53.సమ్మిడి,54.సింగోతు,55.సునపుడి,56.సైకం,57.సంగాని,58.శీరం,59.తమ్ము,60.తమాడ, 61.తాడి,62.తిరుమలశెట్టి,63.తిరుమాని, 64.తిరుమల,65.వనమాడ,66.వాడ్రేవు, 67.వల్లభనేని,68.వాతాడి,69.విశ్వనాథపల్లి, 70.యరబాల,71.బస్వాని,72.యిల్లింగి, 73.తదితరాలు,74.కూనే,75.తాళ్ల,76.అడతాల, 77.అద్దంకి.78.కలిశెట్టి 79. దుమ్ము

జంబు మహర్షి గోత్రం

1. నెల్లూరు, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో...

(ఇక్కడ 'జంబు మహర్షి' గోత్రం గలవారు ఎక్కువ)... కాళహస్తీ, కంచి, ఆరణి, చెంగల్పట్టు, మల్లెంబాకం, పెరిమిడి, కనగలూరు, పూజారి, తిరువొత్తూరు, వేలూరు, కామాటి, నెల్లూరు, చిత్తురు.

2. ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లో...

(పల్లెపాలెం (గ్రా), కొత్తపట్నం(మం))..

గొల్లపోతు, కొక్కిలిగడ్డ, అయిల, అవనిగడ్డ, సంగాని, కారాణి, వల్లభూని, పెదసింగు, సింగోతు, రాసాని, కన్నా, మోపిదేవి, పిన్ని, చాపల, సైకం, చమ్ము(తమ్ము), వనమల, నాయుడు, సంకె, కోలా, అప్పాడి, పొన్నాడి.

3. శ్రీకాకుళం జిల్లా, గజపతినగరం పరిసర ప్రాంతాల్లో & ఒరిస్సా రాష్ట్రంలో బ్రహ్మపుత్ర, గజపతి, బరంపురం ప్రాంతాలలో

(ఇక్కడ ఎక్కువ మందికి 'రఘుకుల గోత్రం' ఉంటుంది, )

రాంబుడ్డి , దున్న, గుడ్ల , జుత్తు , సీగు, తామాడ, రంగాల, దుమ్ము, మర్ల, వనిమిన, బత్తిన, సంగాని, యజ్జల, ఉప్పరపల్లి, పెద్దింటి, తెప్పల, రొయ్యి, గేదెల, బొడ్డు, తాళ్ల...

4.చిత్తూరు, శ్రీకాళహస్తి, ఏర్పేడు, పరిసర ప్రాంతాల్లో

(i)(ఇక్కడ 'అగ్నిగోత్రం' గల వారు కొందరి ఇంటిపేర్లు)... తాళిక్కాల్, కోనేరుగారి, జ్ఞానాంభావారి, కోనేరుగారి, మప్పేటి, అర్కాడు, సున్నపు, తలప, వెంగలత్తూరు, కైలాసం.

(ii)ఇక్కడ 'జంబుమహర్షి' గోత్రం గల వారు ఎక్కువ: బండి.

5. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, ఉత్తరాంధ్ర, కృష్ణా: రఘుకుల గోత్రం, రవికుల.

ప్రముఖులుసవరించు

మూలాలుసవరించు