అగ్‌మెంటెడ్ రియాలిటీ
అగ్‌మెంటెడ్ రియాలిటీ (augmented reality) అనేది ఒక భౌతిక, వాస్తవ ప్రపంచ పర్యావరణం ఒక ప్రత్యక్షప్రసార దర్శకత్వం లేదా పరోక్ష వీక్షణ సాంకేతికత. దీని అంశాలు ధ్వని, వీడియో, గ్రాఫిక్స్ లేదా జిపిఎస్ డేటా వంటి కంప్యూటర్ - జెనరేటెడ్ సెన్సారి ఇన్‌పుట్ ద్వారా అభివృద్ధిచేయబడతాయి (లేదా అనుబంధితమైవుంటాయి).[1]
మెడిటటెడ్ రియాలిటీ అనే సాంకేతికత ద్వారా మనిషి చూసే దృశ్యంలో ఊహాత్మక వస్తువులను ప్రవేశపెట్టినట్లు, ఉన్న దృశ్యంలో వస్తువులను తొలగించినట్టు చూపెట్టవచ్చు. ఇది ఒక కంప్యూటర్ సిస్టం ద్వారా నిరంతరం జరిగే ప్రక్రియ. దీని ఫలితంగా మనిషి చూసే దృశ్యాన్ని వేరే దృష్టికోణంలో చూడగలిగే అవకాశాన్ని ఇది మనకి అందిస్తుంది.
దీనికి భిన్నంగా, వర్చ్యువల్ రియాలిటీ సాంకేతికతో మనిషి చూసే వాస్తవ దృశ్యాన్ని పూర్తిగా కంప్యూటర్ ద్వారా కల్పిత దృశ్యంతో భర్తీ చేస్తుంది.[2][3]
వివరంగా చెప్పాలంటే, అగ్‌మెంటేషాన్ అనేది, మన చుట్టూ ప్రత్యక్షం చేసే వాస్తవ దృశ్యాల్లో కల్పిత వస్తువులను కంప్యూటర్ సహాయంతో ఇమడింపచేసి చూపే నిరంతర ప్రక్రియ. ఉదాహరణకు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ రోడ్డు మీద మనం టీ.వీ లో చూసే కార్టూన్లు మన ముందు రోడ్డు మీద నడుస్తున్నట్లు చూడవచ్చు. ఈ రోడ్డు అనే వాస్తవంలో కార్టూన్ అనే కల్పితాన్ని ఇమిడేలా చేయటమే అగ్‌మెంటెడ్ రియాలిటీ సాంకేతికత.
దీని ద్వారా మనం వేరే ప్రదేశంలో జరుగుతున్నా వాస్తవ దృశ్యాన్ని కూడా మన కళ్ళముందు జరుగుతునట్టు చూపెట్టవచ్చు.[4][5][6][7][8] ఉదాహరణకు, విశ్వంలో జరుగుతున్న అనేక మార్పులను మన ముందు కదులుతున్నట్లు చూడవచ్చు.
ఈ సాంకేతికతను వినోదానికి మాత్రమే కాకుండా మరెన్నో కీలక సేవలకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ఇచ్చే ఎ.ఆర్. హెల్మెట్ నిర్మాణం చేపట్టే బిల్డింగ్ గురించి ప్రత్యక్ష సమాచారం అందిస్తుంది. ఇది అక్కడ పనిచేసే వారికీ ఉపయోగపడుతుంది.
మూలాలు
మార్చు- ↑ Graham, M., Zook, M., and Boulton, A. "Augmented reality in urban places: contested content and the duplicity of code." Transactions of the Institute of British Geographers, DOI: 10.1111/j.1475-5661.2012.00539.x 2012.
- ↑ Steuer, Jonathan. Defining Virtual Reality: Dimensions Determining Telepresence Archived 2016-05-24 at the Wayback Machine, Department of Communication, Stanford University. 15 October 1993.
- ↑ Introducing Virtual Environments Archived 2016-04-21 at the Wayback Machine National Center for Supercomputing Applications, University of Illinois.
- ↑ Chen, Brian X. If You’re Not Seeing Data, You’re Not Seeing, Wired, 25 August 2009.
- ↑ Maxwell, Kerry. Augmented Reality, Macmillan Dictionary Buzzword.
- ↑ Augmented reality-Everything about AR Archived 2012-04-05 at the Wayback Machine, Augmented Reality On.
- ↑ Azuma, Ronald. A Survey of Augmented Reality Presence: Teleoperators and Virtual Environments, pp. 355–385, August 1997.
- ↑ Zhanpeng, H.,Pan H., et al. Mobile augmented reality survey: a bottom-up approach.