అచ్చ తెలుగు కుబ్జాకృష్ణవిలాసము

తెలుగు భాషలో భాగమైన సంస్కృత, ప్రాకృత శబ్దాలు లేకుండా అచ్చ తెలుగులో రచించిన అరుదైన కావ్యాల్లో అచ్చ తెలుగు కబ్జాకృష్ణవిలాసము ఒకటి. ఈ గ్రంథకర్త నల్లాన్ చక్రవర్తుల లక్ష్మీనృశింహాచార్యులు.

రచన నేపథ్యం మార్చు

ఇతివృత్తం మార్చు

భాగవతంలోని గాథ ఈ గ్రంథానికి ప్రధానమైన ఇతివృత్తం.

ప్రత్యేకత మార్చు

తెలుగు భాషలో పదాలు సంస్కృత సమాలు, ప్రాకృత సమాలు, సంస్కృత భవాలు, ప్రాకృత భవాలు, దేశ్యాలు, అన్యదేశ్యాలుగా ఆరు రకాలుగా విభజించారు. సంస్కృత సమాలు(నేరుగా సంస్కృతంలోని పదాలకు చివర తెలుగు విభక్తిని కలపగా వచ్చినవి) తప్ప మిగిలినవి అచ్చతెలుగుగా లెక్కిస్తారు. అచ్చతెలుగుకు సంస్కృత సమాలు కలిస్తే మనది ఆంధ్ర భాష లేదా తెలుగు భాష. సంస్కృత సమపదం ఒక్కటి కూడా రాకుండా పద్యాన్ని రచించడం కొంచెం కష్టమైన పనే. తెలుగు(ఆంధ్ర) భాషలో వందల పద్యాలతో రాస్తూ మధ్యలో ఎక్కడయినా ఒకటి అచ్చతెలుగు పద్యం రాస్తే, అది పాఠకునికీ, శ్రోతకీ ఒక విశ్రాంతిగా ఉంటుంది. వైవిధ్యం వల్ల మనస్సుకి ఉల్లాసం కలుగుతుంది. ఐతే మొత్తం పుస్తకమంతా అచ్చతెలుగులోనే చెప్తే, ఇంకెంత సంబరపడతాడు! దాని చందం తెలిసినవాడు ఎంతగా ఆశ్చర్యపడతాడు! శ్రమను గుర్తించి ఎంతగా కొనియాడతాడు! ఊహించలేం. ఇటువంటి అభిప్రాయంతోనే తొలి అచ్చతెలుగు కావ్యాన్ని పొన్నెగంటి తెలగన్న రచించారు. ఈ గ్రంథమూ అలాంటిదే. కుబ్జ(పొట్టి, అందవికారమైన అమ్మాయి)ని మధురలో కృష్ణుడు సుందరిగా మలిచిన గాథను ఇతివృత్తంగా స్వీకరించారు. ఇటువంటి కావ్యం కవి భాషా సృజనశక్తికి అద్దంగా పాఠకుని భాషాసంపదకు ఆలంబనగా నిలుస్తుందని విమర్శకులు బేతవోలు రామబ్రహ్మం పేర్కొన్నారు.

బయటి లింకులు మార్చు