అజాజ్ అహ్మద్ జాన్
అజాజ్ అహ్మద్ జాన్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పూంచ్ హవేలీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
అజాజ్ అహ్మద్ జాన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | షా మొహమ్మద్ తంత్రయ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | పూంచ్ హవేలీ | ||
పదవీ కాలం 2008 – 2013 | |||
నియోజకవర్గం | పూంచ్ హవేలీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఅజాజ్ అహ్మద్ జాన్ 2008లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పూంచ్ హవేలీ నియోజకవర్గం నుండి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చౌదరి బషీర్ అహ్మద్ నాజ్ పై 9,993 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అజాజ్ అహ్మద్ జాన్ 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీడీపీ పార్టీ అభ్యర్థి షా మొహమ్మద్ తంత్రయ్ చేతిలో 3,512 ఓట్ల తేడాతో ఓడిపోయాడు
అజాజ్ అహ్మద్ జాన్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పూంచ్ హవేలీ నియోజకవర్గం నుండి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చౌదరి అబ్దుల్ ఘనిపై 20879 ఓట్లు మెజారిటీ గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అజాజ్ అహ్మద్ జాన్ కు 41807 ఓట్లు, బీజేపీ అభ్యర్థి చౌదరి అబ్దుల్ ఘనికి 20928 ఓట్లు వచ్చాయి.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
- ↑ Election Commision of India. "J&K Assembly Election Results 2024 - Poonch Haveli". Retrieved 24 October 2024.
- ↑ "Poonch Haveli Assembly Election Results 2024 : JKNC's Ajaz Ahmed Jan wins Poonch Haveli with 41807 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.