అజిత్ నాథ్ రే
అజిత్ నాథ్ రే (1912, జనవరి 29 - 2009, డిసెంబరు 25), భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. 1973 ఏప్రిల్ 25 నుండి 1977 జనవరి 28న పదవీ విరమణ చేసేవరకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.
అజిత్ నాథ్ రే | |
---|---|
14వ భారత ప్రధాన న్యాయమూర్తి | |
In office 1973 ఏప్రిల్ 25 – 1977 జనవరి 28 | |
Appointed by | వి. వి. గిరి |
అంతకు ముందు వారు | సర్వ్ మిత్ర సిక్రి |
తరువాత వారు | మీర్జా హమీదుల్లా బేగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1912 జనవరి 29 |
మరణం | 2009 డిసెంబరు 25 కలకత్తా, పశ్చిమ బెంగాల్ | (వయసు 97)
జననం
మార్చుఅజిత్ నాథ్ రే 1912, జనవరి 29న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించాడు.
వృత్తి జీవితం
మార్చు1969 ఆగస్టులో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 1973 ఏప్రిల్ లో భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. 1969లో బ్యాంక్ జాతీయీకరణ చట్టం రాజ్యాంగబద్ధతను పరిశీలించిన పదకొండు మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో అజిత్ నాథ్ రే ఒక్కడే భిన్నాభిప్రాయాన్ని వినిపించాడు. ప్రెసిడెన్సీ కాలేజ్, కలకత్తా, ఓరియల్ కాలేజీ, ఆక్స్‌ఫర్డ్, గ్రేస్ ఇన్, కలకత్తా హైకోర్టు ద్వారా కోర్టుకు నియామకమయ్యాడు.[1] ఇతని కుమారుడు జస్టిస్ అజోయ్ నాథ్ రే అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[2]
మరణం
మార్చుఅజిత్ నాథ్ రే 2009, డిసెంబరు 25న కలకత్తాలో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ Austin, Granville (1999). Working a Democratic Constitution – A History of the Indian Experience. New Delhi: Oxford University Press. pp. 216–217. ISBN 019565610-5.
- ↑ Socialist India. Indian National Congress. All India Congress Committee. 1974.