అజిత రాజి భారత సంతతికి చెందిన ఒక అమెరికన్ మహిళ. 2014 లో ఈమెను అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, స్వీడన్లో అమెరికా రాయబారిగా నియమించడంతో వార్తలలోకి వచ్చింది.[1]

నేపధ్యము

మార్చు

ఒబామా ప్రభుత్వంలో ఇప్పటికే సమున్నత బాధ్యతలు నిర్వహిస్తున్న రాజిని స్వీడన్ రాయబారిగా నియమిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఒబామా నిర్ణయించారు. దీనిని సెనేట్ లాంఛనంగా ఆమోదించాల్సి ఉంది. 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆమె ఒబామా ఎన్నికల ప్రచారం, నిధుల సమకూర్చే విధుల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టారు. దాదాపు 500000 యూఎస్ డాలర్ల మొత్తాన్ని సేకరించి అధ్యక్షుడి గుర్తింపు పొందిన ఆమె ఇప్పటివరకు వైట్‌హౌస్‌లో బాధ్యతలు నిర్వహించారు. 1983లో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ., 1991లో ఎంబిఎ చేసిన ఆమె ప్రఖ్యాత బ్యాంకింగ్ సంస్థ జెపి మోర్గాన్కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. గోల్డ్‌మన్ సాచ్స్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ గ్యారీ సైమన్‌ను వివాహం చేసుకున్న ఆమె బహు భాషాప్రవీణురాలు. ప్రస్తుతం ఉత్తర కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న ఆమె గతంలో మధ్యప్రాచ్యం, యూరోప్‌లలో పనిచేశారు. ఆర్థికవ్యవహారాలు, నాయకత్వ బాధ్యతల నిర్వహణలో అందెవేసిన చేయి.

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అజిత_రాజి&oldid=3848003" నుండి వెలికితీశారు