అజీద్ అబ్దుల్ షేక్

(అజీద్‌ అబ్దుల్‌ షేక్‌ నుండి దారిమార్పు చెందింది)
అజీద్ అబ్దుల్ షేక్
అజీద్‌ అబ్దుల్‌ షేక్‌ రాసిన కవితలు, వ్యాసాలు, కథలు రాష్ట్రంలోని వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం అయ్యాయి.వీరు ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లిం రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, జర్నలిసుల సంఘం నాయకునిగా కూడా బాధ్యతల నిర్వహించారు

బాల్యము మార్చు

అజీద్‌ అబ్దుల్‌ షేక్‌... నల్గొండ జిల్లా.,గరిడేపల్లి మండలం గట్టిపల్లిలో 1968, జూలై 10న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షరీఫాబీ, ఖాజామోహిద్దీన్‌. చదువు: ఎం.ఎ., బి.ఇడి.

వృత్తి మార్చు

జర్నలిస్ట్‌.

రచనా వ్యాసంగము మార్చు

అజీద్‌ అబ్దుల్‌ షేక్‌ 1987 నుండి రాసిన కవితలు, వ్యాసాలు, కథలు వ్రాయడము ప్రారంభించారు. అవి రాష్ట్రంలోని వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం అయ్యాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి మాత్రమే కాకుండ కర్నాటక బళ్ళారి నుండి వెలువడిన పలు వార, పక్ష, మాసపత్రికల రూపకల్పన చేయడంలో వీరు సహకారం అందించారు , ఆయా పత్రికలకు గౌరవ సంపాదాకుడిగా చేయూత నిచ్చారు.

ప్రచురణలు మార్చు

1. తురక వాడ (కవితా సంపుటి), 2. జిందగీ (వ్యాస సంపుటి). ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లిం రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, జర్నలిసుల సంఘం నాయకునిగా బాధ్యతల నిర్వహించారు. లక్ష్యం: ప్రజా చైతన్యం కోసం కృషి.

మూలాలు మార్చు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 48


మూలాల జాబితా మార్చు