అజ్నాలా

(అజ్నలా నుండి దారిమార్పు చెందింది)

అజ్నాలా భారతదేశం, పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ నగరానికి సమీపంలో ఉన్న ఒక పట్టణం. ఇది అమృత్‌సర్ జిల్లాలోని ఒక నగర పంచాయతీ. అమరవీరుల ప్రదేశమైన కలియన్ వాలా ఖుహ్, ఇక్కడి పర్యాటక ప్రదేశం.

అజ్నాలా
అజ్నాలా is located in Punjab
అజ్నాలా
అజ్నాలా
పంజాబ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 31°50′N 74°46′E / 31.84°N 74.76°E / 31.84; 74.76
దేసం India
రాష్ట్రంపంజాబ్
జిల్లాఅమృత్‌సర్
Elevation
213 మీ (699 అ.)
జనాభా
 (2001)
 • Total18,602
భాషలు
 • అధికారికపంజాబీ
 • Dialectమాఝీ మాండలికం
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationPB-14

అజ్నాలా పశ్చిమ పంజాబ్‌లో 31°50′N 74°46′E / 31.84°N 74.76°E / 31.84; 74.76 వద్ద పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. [1] సముద్రమట్టం నుండి దీని సగటు ఎత్తు 213 మీటర్లు. అజ్నాలా, ప్రసిద్ధ పంజాబీ గాయకుడు AP ధిల్లాన్ స్వస్థలం. 2021 లో భారతదేశ పర్యటన సందర్భంగా అతను తన స్వస్థలమైన అజ్నాలాను సందర్శించాడు.

చరిత్ర

మార్చు

1857 తిరుగుబాటు

మార్చు

1857 నాటి సిపాయీల తిరుగుబాటు సమయంలో, 26వ స్థానిక పదాతిదళానికి చెందిన 282 మంది సిపాయిలు లాహోర్‌లో తిరుగుబాటు చేశారు. తదనంతరం తమకు న్యాయమైన విచారణ జరుగుతుందని నమ్మి లొంగిపోయారు. అప్పటి జిల్లా డిప్యూటీ కమీషనర్ అయిన ఫ్రెడరిక్ హెన్రీ కూపర్ విచారణ లేకుండానే వారిని ఉరితీయించాడు. [2] మృతదేహాలను పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న లోతైన ఎండిపోయిన బావిలో పడేశారు. తరువాత దానిని బొగ్గు, సున్నం, ధూళితో పూడ్చేసారు. [3] <sup id="mwJg">[3]</sup> 2014 మార్చిలో స్థానిక సిక్కు గురుద్వారా అధిపతి, మందిరంలో బావిని తవ్విస్తున్నపుడు ఖననం చేయబడిన వారి అవశేషాలు బయటపడ్డాయని ప్రకటించారు. <sup id="mwKQ">[4]</sup> [4] స్థానిక పంజాబీ మాండలికంలో ఈ బావిని షహీదాన్ దా ఖు అని పిలుస్తారు, దీని అర్థం "అమరవీరుల బావి".

జనాభా శాస్త్రం

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, అజ్నాలా జనాభా 21,107. అందులో 11,347 మంది పురుషులు, 9,760 మంది స్త్రీలు. అజ్నాలా అక్షరాస్యత రేటు 82.19%. ఇది రాష్ట్ర సగటు 75.84% కంటే ఎక్కువ. అజ్నాలాలో పురుషుల అక్షరాస్యత దాదాపు 86.05% కాగా మహిళా అక్షరాస్యత శాతం 77.72%. అజ్నాలా నగర పంచాయితీలో మొత్తం 4,060 గృహాలకు ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2397, అంటే అజ్నాలా (NP) మొత్తం జనాభాలో 11.36%

మూలాలు

మార్చు
  1. Falling Rain Genomics, Inc - Ajnala
  2. Cooper, Crisis in the Punjab, pp. 154–156, cited in The Great Indian Mutiny by Christopher Hubbard, p. 132
  3. "India to examine claims over '1857 rebel' bodies". BBC News. 3 March 2014. Retrieved 6 April 2018.
  4. "The Tribune, Chandigarh, India - Main News".
"https://te.wikipedia.org/w/index.php?title=అజ్నాలా&oldid=3672712" నుండి వెలికితీశారు