నగర పంచాయితీ

భారత దేశపు పట్టణ పరిపాలనా ప్రాంతం, మునిసిపాలిటీ లాగా

ఒక నగర పంచాయతీ లేదా నోటిఫై ఏరియా కౌన్సిల్ (ఎన్ఎసి) లేదా సిటీ కౌన్సిల్ భారతదేశం అనేది, గ్రామం, పట్టణం కాని జనావాసాలకు స్థానిక స్వపరిపాలన సంస్థ. దీనిని పట్టణ స్థానికసంస్థగానే పరిగణిస్తారు.[1] 11,000 కంటే ఎక్కువ, 25 వేల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణ కేంద్రాన్ని "నగర పంచాయతీ" గా నిర్వచించారు. నగరపంచాయితీ తరువాత ఉన్నత శ్రేణి గలది పురపాలక సంఘం (Municipality).

నగర పంచాయితీని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తమిళనాడు.[2] జనాభా లెక్కల ప్రకారం, "పట్టణ పంచాయతీ" ను సూచించడానికి TP అనే సంక్షిప్త అక్షరాలను ఉపయోగిస్తారు.[3]

నిర్వహణ సవరించు

ప్రతి నగర పంచాయతీలో వార్డు సభ్యులతో ఒక చైర్మన్ ఉన్న కమిటీ ఉంటుంది. కనీసం పది మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు, ముగ్గురు నామినేటెడ్ సభ్యులను కలిగి ఉంటుంది. సభ్యుల పదవీకాలం ఐదేళ్లు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలకు సీట్లు కేటాయించబడ్డాయి. కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులను నగర పంచాయతీలోని ఎన్నికల వార్డుల నుండి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎంపిక చేస్తారు.

నగర పంచాయతీ నిర్మాణం, విధులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి భారతీయ రాష్ట్రంలోని, పట్టణ స్థానిక సంస్థలకు సొంత నిర్వహణ డైరెక్టరేట్ ఉంది.

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. "The Constitution (seventy-fourth Amendment) Act, 1992". Ministry of Law and Justice. Retrieved 28 September 2015.
  2. "Department of Town Panchayats, TN". Tamilnadu Government. Archived from the original on 2012-01-22. Retrieved 2021-01-28.
  3. "Census of India – Metadata". Census India. 2007-06-17. Archived from the original on 2007-06-17. Retrieved 2021-01-28.