అజ్మతుల్లా ఒమర్జాయ్

అజ్మతుల్లా ఒమర్జాయ్ (జననం 2000 మార్చి 24) ఒక ఆఫ్ఘన్ క్రికెట్ ఆటగాడు. అతను 2021 జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు.[1]

అజ్మతుల్లా ఒమర్జాయ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అజ్మతుల్లా ఒమర్జాయ్
పుట్టిన తేదీ (2000-03-24) 2000 మార్చి 24 (వయసు 24)
నంగర్‌హర్, ఆఫ్ఘనిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 49)2021 జనవరి 21 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2023 ఆగస్టు 22 - పాకిస్తాన్ తో
తొలి T20I (క్యాప్ 44)2022 మార్చి 3 - బంగ్లాదేశ్ తో
చివరి T20I2023 జూలై 14 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017–presentMis Ainak Region (స్క్వాడ్ నం. 99)
2023-presentPeshawar Zalmi (స్క్వాడ్ నం. 100)
2023–presentRangpur Riders
కెరీర్ గణాంకాలు
పోటీ T20I వన్‌డేలు T20
మ్యాచ్‌లు 24 13 62
చేసిన పరుగులు 185 137 588
బ్యాటింగు సగటు 16.81 22.83 22.61
100లు/50లు 0/0 0/1 0/1
అత్యుత్తమ స్కోరు 33 56 62
వేసిన బంతులు 315 430 1137
వికెట్లు 11 6 59
బౌలింగు సగటు 41.36 59.00 24.93
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - - -
అత్యుత్తమ బౌలింగు 3/22 1/17 3/16
క్యాచ్‌లు/స్టంపింగులు 8/- 2/- 29/-
మూలం: Cricinfo, 1 September 2023

దేశీయ కెరీర్

మార్చు

అతను 2017 ఆగస్టు 10న 2017 ఘాజీ అమానుల్లా ఖాన్ రీజినల్ వన్ డే టోర్నమెంట్‌లో మిస్ ఐనక్ రీజియన్ కోసం తన తొలి లిస్టు ఎ మ్యాచ్‌ అడాడు.[2] అతను 2018 మార్చి 25న 2018 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో స్పీన్ ఘర్ రీజియన్ తరపున తొలి ఫస్ట్-క్లాస్ ఆట ఆడాడు [3]

2018 సెప్టెంబరులో అతను, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో పాక్టియా జట్టుకు ఎంపికయ్యాడు. [4] 2018 అక్టోబరు 7న 2018–19 ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో పాక్టియా పాంథర్స్ తరపున ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు. [5] 2020 సెప్టెంబరులో అతను, 2020 ష్పగీజా క్రికెట్ లీగ్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు ఉమ్మడి విజేతగా నిలిచాడు. [6]

అంతర్జాతీయ కెరీర్

మార్చు

2017 డిసెంబరులో, అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [7] 2018 డిసెంబరులో, అతను 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ అండర్-23 జట్టుకు ఎంపికయ్యాడు. [8] 2019 నవంబరులో, అతను బంగ్లాదేశ్‌లో జరిగే 2019 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [9] 2020 ఫిబ్రవరిలో, అతను ఐర్లాండ్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టుకు ఎంపికయ్యాడు. [10] 2021 జనవరిలో, అతను ఐర్లాండ్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టుకు ఎంపికై, [11] 2021 జనవరి 21న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి వన్‌డే ఆడాడు.[12]

2021 మార్చిలో, అతని వీసా సమస్యలు పరిష్కారమయ్యాక [13] జింబాబ్వేతో జరిగే T20I మ్యాచ్‌ల కోసం అతన్ని ఎంపిక చేస్తామని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. [14] 2022 ఫిబ్రవరిలో, బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క T20I జట్టులో అతను ఎంపికయ్యాడు. [15] అతను 2022 మార్చి 3న బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ తరపున T20I ల్లో అడుగుపెట్టాడు.[16]

మూలాలు

మార్చు
  1. "Azmatullah Omarzai". ESPN Cricinfo. Retrieved 10 August 2017.
  2. "2nd Match, Ghazi Amanullah Khan Regional One Day Tournament at Khost, Aug 10, 2017". ESPN Cricinfo. Retrieved 10 August 2017.
  3. "14th Match, Alokozay Ahmad Shah Abdali 4-day Tournament at Kunar, Mar 25-28 2018". ESPN Cricinfo. Retrieved 27 March 2018.
  4. "Afghanistan Premier League 2018 – All you need to know from the player draft". CricTracker. 10 September 2018. Retrieved 10 September 2018.
  5. "4th Match (D/N), Afghanistan Premier League at Sharjah, Oct 7 2018". ESPN Cricinfo. Retrieved 7 October 2018.
  6. "Ayobi Kabul Eagles lift Shpageeza Title in a thrilling Final". Afghanistan Cricket Board. Retrieved 16 September 2020.
  7. "Mujeeb Zadran in Afghanistan squad for Under-19 World Cup". ESPN Cricinfo. 7 December 2017. Retrieved 7 December 2017.
  8. "Afghanistan Under-23s Squad". ESPN Cricinfo. Retrieved 3 December 2018.
  9. "Afghanistan Emerging travels to Bangladesh for Asia Cup". Afghanistan Cricket Board. Retrieved 12 November 2019.
  10. "Afghanistan squad announced for series against Ireland". Afghanistan Cricket Board. Retrieved 6 February 2020.
  11. "Afghanistan announce 16-member squad for ODI series against Ireland". Cricbuzz. Retrieved 2 January 2021.
  12. "1st ODI, Abu Dhabi, Jan 21 2021, Ireland tour of United Arab Emirates". ESPN Cricinfo. Retrieved 21 January 2021.
  13. "Afghanistan T20I squad announced albeit visa issues for Some Players". Afghanistan Cricket Board. Retrieved 14 March 2021.
  14. "Mujeeb Ur Rahman, Gulbadin Naib wait on 'visa issue' ahead of T20I series". ESPN Cricinfo. Retrieved 16 March 2021.
  15. "Nabi included in ODI squad for Bangladesh series". CricBuzz. Retrieved 14 February 2022.
  16. "1st T20I (D/N), Mirpur, Mar 3 2022, Afghanistan tour of Bangladesh". ESPN Cricinfo. Retrieved 3 March 2022.