నిజాం మీర్ ముహమ్మద్ అజ్మెత్ అలీ ఖాన్ (జననం 1960 జూలై 23) హైదరాబాద్ నిజాం వారసుడు, అసఫ్ జా ప్రస్తుత అధిపతి. 2023లో చివరి నిజాం ముకర్రం జా కన్నుమూసిన తరువాత తొమ్మిదవ నిజాం గా ఆయనను 2023 జనవరి 20న అసఫ్ జాహీ రాజవంశం సాంప్రదాయ పద్ధతిలో ఎన్నుకున్నారు.[1] ఇకపై నిజాం ఆస్తులు, ట్రస్టులు తదితర బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తారు.

మీర్ ముహమ్మద్ అజ్మెత్ అలీ ఖాన్
అసఫ్ జా IX
9వ హైదరాబాదు నిజాం
పరిపాలన2023 జనవరి 14 – ప్రస్తుతం
Coronation20 జనవరి 2023 (2023-01-20)
పూర్వాధికారిముకర్రం జా
Heir apparentమురాద్ జా
జననం (1960-07-23) 1960 జూలై 23 (వయసు 64)
లండన్, ఇంగ్లాండ్
Spouseనాజ్ జా
వంశముమురాద్ జా
Names
హిజ్ ఎక్సల్టెడ్ హైనెస్ అసఫ్ జా IX, ముజఫర్-ఉల్-ముల్క్ వాల్ మమాలిక్, రుస్తమ్-ఇ-దౌరన్, అరుస్తు-ఇ-జమాన్, నిజాం-ఉల్-ముల్క్, నిజాం-ఉద్-దౌలా, మీర్ ముహమ్మద్ అజ్మెత్ అలీ ఖాన్, సిపాహ్ సలార్, ఫతే జంగ్ , హైదరాబాద్ నిజాం, బేరార్.
Regnal name
అసఫ్ జా IX
అల్మా మేటర్
  • మిల్‌ఫీల్డ్
  • లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం
  • సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం
Houseహౌస్ ఆఫ్ అసఫ్ జా
తండ్రిముకర్రం జా
తల్లిప్రిన్సెస్ ఎస్రా
మతంసున్నీ ఇస్లాం
Occupationఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్

బాల్యం, విద్య

మార్చు

అజ్మత్ జా, ముకర్రమ్ జా కుమారుడు. ఆయన లండన్లో ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసాడు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ నుంచి 1984లో ఫొటోగ్రఫీలో పట్టా పొందాడు.

కెరీర్

మార్చు

ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్న అజ్మత్ జా హాలీవుడ్లో కొన్ని సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా, సినిమాటోగ్రాఫర్గా విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో స్టీవెన్ స్పిల్ బర్గ్, రిచర్డ్ అటెన్ బరో తదితర దిగ్గజాలతో కూడా కలిసి పని చేసాడు.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Hyderabad: నిజాం వారసుడిగా అజ్మత్ జా.. చౌమహల్లా ప్యాలెస్ నుంచి ప్రకటన". web.archive.org. 2023-01-22. Archived from the original on 2023-01-22. Retrieved 2023-01-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=అజ్మత్_జా&oldid=3848529" నుండి వెలికితీశారు