ఫోటోగ్రఫీ లేదా ఛాయాగ్రహణం లేదా ఛాయాచిత్రకళ (ఆంగ్లం: Photography) అనేది కాంతి లేదా కాంతికి సంబంధించిన శక్తి యొక్క చర్యచే, కాంతికి స్పందించగలిగే ఉపరితలం (Photosensitive Material, అనగా ఫిల్మ్ లేదా ఇమేజ్ సెన్సర్) పై ప్రతిబింబం (image) గా నమోదు చేయటం. [1] [2] ఫోటోగ్రఫీ కటక శాస్త్రము (Optics), రసాయన శాస్త్రము ల సంగమం. [3]

ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను భద్రపరచటంతో బాటు రసాయనిక చర్యలతో కాంతి సూక్ష్మాలని గుర్తించే ఛాయాగ్రాహక చిత్రం (photographic film) వలన గానీ /ఎలక్ట్రానిక్ ప్రక్రియతో ఇమేజ్ సెన్సర్ (చిత్రాలని గుర్తించే పరికరము) వలన గానీ మన్నికైన చిత్రాలని సృష్టించే/ముద్రించే ఒక కళ/శాస్త్రము/అభ్యాసము. సాధారణంగా ఒక వస్తువు పై ప్రసరించే కాంతిని గాని, లేదా ఒక వస్తువు నుండి వెలువడుతున్న కాంతిని గానీ ఒక కటకం (lens)తో దృష్టి (focus) ని కేంద్రీకరించి, కెమెరాలో ఉండే కాంతిని గుర్తించే ఉపరితలం పై నిర్దిష్ట సమయం వరకూ బహిర్గతం (exposure) చేయటంతో ఆ వస్తువుల నిజ ప్రతిబింబం (real image) సృష్టించటం జరుగుతుంది. దీని ఫలితంగా వైద్యుదిక చిత్ర సంవేదిక (electronic image sensor) లోని ప్రతి ఒక్క చిత్ర కణము (pixel) పై విద్యుచ్ఛక్తి (electrical charge) వైద్యుదిక చర్య (electronical processing) జరిగి తర్వాత ప్రదర్శితమగుటకు, మార్పులు చేసుకొనుటకు సాంఖ్యిక ప్రతిబింబం (digital image) ఫైల్ గా భద్రపరచబడుతుంది.

ఫలితంగా ఒక ఫోటోగ్రఫిక్ మిశ్రమము (photographic emulsion)లో నమోదైన ఒక నిగూఢ గుప్త చిత్రం (latent image) తర్వాత రసాయనిక చర్యల ఛాయాగ్రాహక సంవర్ధన (Photographic Development) తో నిర్దిష్ట ఫోటోగ్రఫిక్ పదార్థం యొక్క ప్రయోజనాన్ని బట్టి/అవలంబించే పద్ధతి (ఛాయాగ్రాహక చర్య) ని బట్టి కంటికి కనబడు నజర్ధకం (negative) గా గాని, ధనాత్మకం (positive) గా గాని అభివృద్ధి చెందుతుంది. సాంప్రదాయికంగా, ఫిలిం పై ఉండే నెగటివ్, విస్తరణ (enlarger) పద్ధతి ద్వారా గానికాంటాక్ట్ ప్రింటింగ్ పద్ధతి ద్వారా గానీ కాగితం పైకి పాజిటివ్ గా ముద్రితం (photographic print) అవుతుంది.

వ్యాపారంలో, శాస్త్రీయ రంగంలో, తయారీ రంగంలో, వినోద రంగంలో, ప్రసార మాధ్యమాలలో ఈ కళ ఉపయోగాలు చాలా ఎక్కువ.

లార్జ్ ఫార్మాట్ కెమెరా యొక్క లెంస్, మౌంటింగ్
ఆఖరి రసాయనిక ప్రక్రియ తర్వాత ఒక ఫోటోగ్రఫిక్ ప్రింటు
ఫోటోగ్రఫీ బయోగ్రఫీ
ఫోటోగ్రఫీ వ్యాసం చూడండి
కెమేరా కటకం
కెమేరా

వ్యుత్పత్తి

మార్చు

గ్రీకులో ఫోటోస్ (φωτός), అనగా కాంతి. గ్రాఫీ (γραφή) అనగా చిత్రలేఖనం. ఫోటోగ్రఫీ అనగా, గ్రీకులో కాంతిని చిత్రీకరించటం అని అర్థం.[1] ఈ పదం 1830 లోనే ఉపయోగించబడింది.

1834 లో బ్రెజిల్ లోని కెంపినాస్ లో హెర్క్యూల్స్ ఫ్లారెన్స్ అనే ఒక ఫ్రెంచి చిత్రకారుడు, ఆవిష్కర్త ఒకానొక పద్ధతిని వివరించేందుకు తన డైరీలో ఈ పదాన్ని "photographie"గా రాసుకొన్నాడు. మార్చి 14, 1839 లో లండన్ రాయల్ సొసైటీలో సర్ జాన్ హర్షల్ ఈ పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే అదే సంవత్సరం ఫిబ్రవరి 25 న Vossische Zeitung అనే జర్మను వార్తాపత్రికలో జొహాన్ వాన్ మేడ్లర్ అనే బెర్లిన్ ఖగోళ శాస్త్రవేత్త ఈ పదాన్ని వాడాడు.

పుట్టుక, చరిత్ర

మార్చు

చరిత్ర

మార్చు

ఫోటోగ్రఫీ(ఛాయాచిత్రకళ) విభిన్న సాంకేతిక ఆవిష్కారాల కలయికల ఫలితం. ఫోటోగ్రాఫ్ ల తయారీకి చాలా కాలం ముందే చైనీసు తత్త్వవేత్త మో డీ, గ్రీకు గణిత శాస్త్రవేత్తలు అరిస్టాటిల్, యూక్లిడ్ 4వ, 5వ శతాబ్దాలలోనే సూదిబెజ్జం కెమెరా ల గురించి ప్రస్తావించారు. 6వ దశాబ్దంలో బైజాంటీన్ గణిత శాస్త్రవేత్త ఆంథెమియస్ ఆఫ్ ట్రాల్లెస్ తన ప్రయోగాలలో ఒక చీకటి డబ్బా (camera obscura)ని ఉపయోగించాడు. ఇబ్న్ అల్-హెథం (అల్ హసన్) కూడా చీకటి డబ్బాలని, పిన్ హోల్ కెమెరాలని అధ్యయనం చేశాడు. ఆల్బర్ట్ మ్యాగ్నస్ సిల్వర్ నైట్రేట్ ని కనుగొనగా, జార్జెస్ ఫ్యాబ్రీషియస్ సిల్వర్ క్లోరైడ్ ని కనుగొన్నాడు.

కెమెరా అబ్స్క్యూరా

మార్చు
 
కెమెరా అబ్స్క్యూరా పని చేయు విధానం

ఇటాలియన్ తత్వవేత్త బాప్టిస్టా పోర్టా 16వ శతాబ్దం మధ్యలో కెమెరా అబ్స్క్యూరా పై మరింత పరిశోధన చేశాడు.[4] మొత్తం చీకటిగా ఉండే గదిలో, బాగా ఎండగా ఉన్న రోజులలో కేవలం ఒక కిటికీ గుండా చీకటి గదిలోకి వెలుతురు ప్రవేశించే లా చేస్తే, గది వెలుపుల ఉన్న ఇళ్ళ, చెట్ల, ప్రతిబింబాలు లీలగా తల్లక్రిందులుగా కనబడేవి. కిటికీ వెలుపల అద్దాలను అమర్చి సూర్యకిరణాలు గదిలోకి వెళ్ళేలా చేయటం, కిటికీలో ద్వికుంభాకార కటకం (Double Convex Lens) ను అమర్చటం వంటివి చేయటం వలన ప్రతిబింబాలు నిటారుగా, స్పష్టంగా కనబడటం ప్రారంభం అయ్యింది.

1568 లో డేనియల్ బార్బారో డయాఫ్రంని వివరించగా, 1694 లో కాంతి వలన కొన్ని రసాయనాలు ఎలా నల్లబడేవో విల్‌హెల్మ్ హోంబర్గ్ వివరించాడు. 1760 లో టిఫేన్ డీలా రోష్ అనే రచయిత "గిఫాంటీ" అనే తన కల్పిత పుస్తకంలో ఫోటోగ్రఫీ ఎలా ఉండవచ్చునో వివరించాడు. సూర్యకాంతి కొన్ని సిల్వర్ లవణాల రంగుల్లో మార్పు కలిగిస్తుందని స్వీడిష్ రసాయనిక శాస్త్రవేత్త విల్ హూమ్‍ షీలే కనుగొన్నాడు. హైడ్రోజన్ బెలూన్ నిర్మాత ప్రొఫెసర్ చార్లెస్ స్థూల ఆకారాల్ని మాత్రమే సూచించే చిత్రపటాలను తీయటానికి ప్రయత్నించాడు. రాజ కుటుంబాలలో తరతరాలుగా ఉంటున్న పూర్వీకుల పటాల సరికొత్త కాపీలను అప్పుడప్పుడు ఇలా తయారుచేయటం జరుగుతూనే ఉండేది.

ఇలాంటి ప్రయత్నాలు 18 వ శతాబ్దంలోనే ప్రారంభమైనవి. 1802 లో వెడ్జ్ వుడ్ చేసిన ఓ ప్రయోగం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అతను రసాయనిక పదార్థం పూసిన ఓ కాగితంపై కొన్ని ఆకులు పరిచాడు. దీనిపై సూర్యకాంతి పడినపుడు, ఆకులు లేని భాగం నల్లబడటం, ఆకుల కింది భాగం బూడిద రంగుగా మారి కాడలు, ఈనెలు తెల్లబడటం కనిపించింది.

నెపోలియన్ సైన్యానికి చెందిన నీవ్స్ అనే మాజీ అధికారి రసాయనిక పదార్థాలపై కాంతి ప్రభావాన్ని గురించి 1811 లో అనేక ప్రయోగాలు చేశాడు. తాను ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేక పోయినప్పటికీ, సాంకేతిక శాస్త్ర చరిత్రలో తనదైన ఓ విశిష్ట స్థానాన్ని అతడు సంపాదించుకున్నాడు. ఫోటోగ్రఫీ అనే పదాన్ని సృష్టించడం, కెమేరా అబ్స్క్యూరా అనే సాధనంతో చిత్రపటాల్ని తీయటానికి ప్రయత్నించటం అతనికి ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

ఈ కెమేరాని లియొనార్డో డావిన్సీ తన డైరీలో వర్ణించి రాశాడు. దీని మూల సిద్ధాంతం అంతకు మునుపే ప్రాచుర్యంలో ఉండాలి. లోపల నల్లరంగు పూసిన ఓ పెట్టెకి సూదిమొనలాంటి రంధ్రం చేస్తే, వెలుపల ఉండే వస్తువు యొక్క ప్రతిబింబం తలక్రిందులుగా, చిన్నదిగా లోపల యేర్పడుతుంది. రంధ్రంలో కటకాన్ని అమర్చితే ప్రతిబింబం నిటారుగానూ, మరీ స్పష్టంగానూ ఉంటుందనీ జర్మన్ మతాధికారి జాన్ కనుగొన్నాదు. 1569 లో జి.డి.పోర్టా అనే ఇటలీ భౌతిక శాస్త్రవేత్త మొదటి పెద్ద కెమేరా అబ్స్క్యూరాని నిర్మించాడు. దీనినమూనాని ఇప్పటికీ ఎడింబ్రా మ్యూజియంలో చూడవచ్చు.

చిత్రాలని పునరుత్పత్తి చేసే ప్రక్రియ (కెమెరాతో కాకుండా) ప్రముఖ కుమ్మరి కుటుంబానికి చెందిన థామస్ వెడ్జ్ వుడ్ సిల్వర్ రసాయనాలని ఉపయోగించి లెదర్ పై పెయింటింగుల కాపీలని సృష్టించటంతో మొదలైనది. (నాన్ ఎక్స్పోజ్డ్ సిల్వర్ రసాయనాలని కడిగి చిత్రాలని స్థిరీకరించే ప్రక్రియ తెలియక పోవటంతో) అవి మన్నేవి కావు. వెలుతురులోకి తేగానే ఇవి పూర్తిగా నలుపైపోయేవి, అందుచేత ఈ చిత్రాలని చూడటం కోసం, డార్క్ రూంలో భద్రప్రరచవలసి వచ్చేది.

ఆధునిక చిత్రకారులు కెమెరా అబ్స్క్యూరాని ఉపయోగించే వారు, కానీ పశ్చిమ దేశాల్లో ఉపయోగించే రంగులకంటే ఈ చిత్రాల రంగులు చాలా ఎక్కువగా ఉండేవి. ల్యాటిన్ లో కెమెరా అబ్స్క్యూరా అనగా చీకటి గది అని అర్థం. ఒక డబ్బాకి చేసిన రంధ్రం గుండా వెలుతురు ప్రవేశించి ఒక కాగితం పై చిత్రాన్ని సృష్టిస్తుంది.

తొలి కెమెరాల ఫోటోగ్రఫి

మార్చు

19వ శతాబ్దంలోని పారంభ సంవత్సరాలలో కెమెరాని కనుగొనటంతో కనుగొనబడిన ఫోటోగ్రఫీ అప్పటి సాంప్రదాయిక మాధ్యమాలైన చిత్రకళ, శిల్పకళ కంటే ఎక్కువ వివరాలని బంధించేగలిగేది. వాడుకలోకి తీసుకురాగల ఒక పద్ధతిగా 1820 లలో రసాయనిక ఫోటోగ్రఫీతో మొదలైనది. ఫ్రెంచి ఆవిష్కర్త నిసేఫోర్ నీప్సే 1822లో మొట్టమొదటి శాశ్వత చిత్రాన్ని ముద్రించిననూ, తర్వాత దానిని డూప్లికేట్ చేసే ప్రక్రియలో అది చెడిపోయింది. 1825 లో నీప్సే మరల సఫలీకృతుడైనాడు. తన కెమెరా అబ్స్క్యూరాతో మొట్టమొదటి శాశ్వత ఫోటోగ్రాఫ్ వ్యూ ఫ్రం ద విండో ఎట్ లే గ్రాస్ (View from the Window at Le Gras) 1826లో సృష్తించారు.

తన ఫోటోలు ఎక్స్పోజరుకై 8 గంటల సమయం తీసుకోవటం వలన వేరో ప్రక్రియ కోసం కృషి చేసాడు. 1816 లో జోహాన్ హెన్రిచ్ షూల్జే సిల్వర్, సుద్దల కలయిక కాంతికి బహిర్గతం అయితే నల్లబడుతుంది అని కనుగొన్నాడని తెలుసుకొని నీప్సే లూయీస్ డాగురెతో కలసి సిల్వర్ కాంపౌండ్ ల పై ప్రయోగాలు మొదలు పెట్టారు. నీప్సే 1833 లో మరణించిననూ డాగురే తన ప్రయోగాలని కొనసాగించి 1837లో డాగురోటైప్ని కనుగొన్నాడు. 1838 లో ప్యారిస్ నగరంలోని ఒక వీధిలో ఒక వ్యక్తి తన బూట్లని పాలిష్ చెయ్యించుకోవటానికి కొన్ని నిముషాలు ఆగటంతో డాగురే అతనిని చిత్రీకరించాడు. తన ఫార్ములాని ప్రపంచానికి ఫ్రాన్స్ దేశం ఇచ్చే కానుకగా ప్రకటించినచో అతనికి పెన్షన్ చెల్లించే ఒప్పందానికి ఒగ్గి 1839 న ఆ ప్రకారమే చేశాడు.

అయితే 1832 నాటికి హెర్కుల్స్ ఫ్లారెన్స్ బ్రెజిల్లో ఇంచుమించు ఇదే ప్రక్రియని అవలంబించి దీనిని ఫోటోగ్రఫీగా వ్యవహరించగా, అప్పటికే ఇంగ్లీషు ఆవిష్కర్త విలియం హెన్రీ ఫాక్స్ టాల్బట్ సిల్వర్ ప్రక్రియ చిత్రాన్ని శాశ్వతీకరించటానికి మరొక ప్రక్రియని కనుగొన్నా, దానిని రహస్యంగా ఉంచాడు. డాగ్యురే ప్రక్రియని తెలుసుకొన్న తర్వాత దానినే మరింత అభివృద్ధి చేసి పోర్ట్రెయిట్ లని జనాదరణ పొందేలా చేశాడు. 1840 కి నెగిటివ్ లని రూపొందించే క్యాలోటైప్ ప్రక్రియని కనుగొన్నాడు. 1835 లో ల్యాకోక్ అబ్బే లోని ఓరియల్ కిటికీ ఇప్పటివరకూ తెలిసిన అతి పురాతమైన నెగటివ్ గా గుర్తించబడింది.

ఆధునిక పద్ధతుల పై జాన్ హర్షల్ చాలా కృషి చేశాడు. ఇప్పుడు బ్లూ-ప్రింట్ గా వ్యవహరించబడే సయనోటైప్ పద్ధతిని కనుగొన్నాడు. ఫోటోగ్రఫీ, నెగిటివ్, పాజిటివ్ పదాలని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. 1819 లో సోడియం థయోసల్ఫేట్ సిల్వర్ హాలైడ్ లని కరిగించే ద్రావణిగా గుర్తించి, 1839 లో ఇది ఫోటోల స్థిరీకరించి మన్నగలిగేలా చేస్తుందని టాల్బట్, డాగురే లకి సమాచారమందించాడు. 1839 లో మొదటి గ్లాస్ నెగటివ్ ని తయారు చేశాడు.

మార్చి 1851 లో ఫ్రెడరిక్ స్కాట్ ఆర్చర్ ద కెమిస్ట్ అనే పత్రికలో వెట్ ప్లేట్ కొల్లాడియన్ (wet plate collodion) ప్రక్రియని ప్రచురించాడు. 1852, 1860 లలో డ్రై ప్లేట్ లు కనుగొనేవరకు ఈ ప్రక్రియని చాలా విరివిగా ఉపయోగించేవారు. కొలాడియన్ ప్రక్రియ మూడు ఉపసమితులు కలిగి ఉంటుంది; ఆంబ్రోటైప్ (గాజు పై పాజిటివ్ చిత్రం), ఫెర్రోటైప్ లేదా టిన్ టైపు (లోహం పై పాజిటివ్ చిత్రం), ఆల్బుమెన్ లేదా సాల్ట్ పేపర్ పై నెగటివ్ చిత్రం.

19వ శతాబ్దంలో ఫోటోగ్రఫిక్ గ్లాస్ ప్లేట్ లపైన, ముద్రణలో చాలా అభివృద్ధి జరిగింది. 1884 జార్జ్ ఈస్ట్మన్ ఫోటోగ్రఫిక్ ప్లేట్ ల స్థానే ఫిలింని ఉపయోగించే సాంకేతికతని కనుగొన్నాడు.

1908 లో గాబ్రియల్ లిప్మన్ వ్యతీకరణ పద్ధతి ద్వారా ఫోటోలలో రంగులను పునరుత్పత్తి చేయగల లిప్మన్ ప్లేట్ ను కనుగొన్నందుకు గాను, భౌతిక శాస్త్రంలో అతడికి నోబుల్ బహుకరింపబడింది.

నలుపు తెలుపు

మార్చు

తొలినాళ్ళలో ఫోటోగ్రఫీ మొత్తం మోనోక్రోం (అనగా బ్లాక్ అండ్ వైట్) లోనే ఉండేది. తర్వాతి కాలంలో కలర్ ఫిలిం లభించిననూ ఖర్చు తక్కువ కావటం, బ్లాక్ అండ్ వైట్ ఇచ్చే సాంప్రదాయిక రూపం వలన దశాబ్దాల తరబడి బ్లాక్ అండ్ వైట్ దే పై చేయిగా ఉండేది. కొన్ని మోనోక్రోం ఫోటోలు, కేవలం నలుపు తెలుపు ల మిశ్రమాలనే కాకుండా ఇతర వర్ణాలని కూడా కనబర్ఛేవి అనే విషయం గమనార్హం. సెపియా చాకోలెట్ రంగుని వర్ణం, సయనోటైప్ నీలి రంగుని కనబర్చేవి. ఇవి ఇప్పటి మొబైల్ ఫోన్ లు/కెమెరాలలో కూడా లభ్యం. నూట యాభై ఏళ్ళ క్రితం ఉపయోగించబడే ఆల్బమెన్ పద్ధతి బ్రౌన్ వర్ణం కనబర్చేది.

స్థిరత్వం ఎక్కువపాళ్ళలో ఉన్నందువలన కొందరు ఫోటోగ్రాఫర్ లు ఇప్పటికీ మోనోక్రోం వైపే మొగ్గు చూపుతారు. సాంకేతిక అంశాలు, సౌలభ్యమే కాకుండా, కొన్ని ఫోటోలు మోనోక్రోంలో ఉంటేనే నప్పుతాయి కూడా. అందుకే కలర్ డిజిటల్ ఫోటోలు అయిననూ, కొంత సాంకేతికతో వాటిని బ్లాక్ అండ్ వైట్ చిత్రాలుగానే అభివృద్ధి చేస్తారు. కొందరు తయారీదారులు మోనోక్రోంలో మాత్రమే షూట్ చేసే డిజిటల్ కెమెరాలని తయారు చేస్తారు.

19 వ శతాబ్దం మధ్యలో కలర్ ఫోటోగ్రఫీ పై పరిశోధనలు జరిగాయి. తొలినాళ్ళలో కలర్ పై ఈ ప్రయోగాలకు చాలా ఎక్కువ నిడివి గల (గంటలు, ఒక్కోసారి రోజుల తరబడి) ఎక్స్పోజర్ లు అవసరమయ్యేవి. పైగా తర్వాత ఈ కలర్ ఫోటోలు తెల్లని కాంతికి బహిర్గతం అయిన తర్వాత ఆ రంగు వెలసిపోకుండా అట్టే దీర్ఘకాలం మన్నేలా ఉంచలేకపోయాయి.

1855లో స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త జేంస్ క్లర్క్ మ్యాక్స్వెల్ కనుగొన్న మూడు రంగుల వేర్పాటు సిద్ధాంతం (త్రీ-కలర్-సెపరేషన్ ప్రిన్సిపల్) ని ఉపయోగించి 1861 లో మొట్టమొదటి శాశ్వత కలర్ ఫోటోని తీశారు. ఒకే వస్తువు యొక్క మూడు వేర్వేరు బ్లాక్ అండ్ వైట్ ఫోటో లని ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగు ఫిల్టర్ ల ద్వారా తీయడంతో వీటిని ఉపయోగించి కలర్ ఫోటోగ్రాఫ్ పునఃసృష్టికి దోహదపడే మూడు ప్రాథమిక ఛానెల్ లు ఏర్పడతాయి.

చిత్రాల యొక్క పారదర్శక ప్రింటులను అదే విధమైన ఫిల్టర్ ల ద్వారా ప్రొజెక్షన్ స్క్రీన్ పై ఒక దాని పై ఒకటి వేయడంతో వాటి పై రంగు పునరుత్పత్తి అయ్యేది. దీనినే అడిటివ్ మెథడ్ (సంకలిత పద్ధతి) ఆఫ్ కలర్ రీప్రొడక్షన్ అని అంటారు. కాగితం పై చిత్రం యొక్క కార్బన్ కాపీలని కాంప్లిమెంటరీ కలర్ లలో ఒకదాని పై మరొకటి ముద్రించటం 1860లో లూయీస్ డుకోస్ డు హారోన్ అనే ఫ్రెంచి ఫోటోగ్రఫర్ కనుగొన్నాడు. దీనినే సబ్ట్రాక్టివ్ మెథడ్ (వ్యవకలన పద్ధతి) ఆఫ్ కలర్ రీప్రొడక్షన్ అని అంటారు.

రష్యన్ ఫోటోగ్రఫర్ సెర్గేయ్ మిఖాయిలోవిఖ్ ప్రోకుడిన్ - గోర్స్కి ఈ పద్ధతిని విరివిగా ఉపయోగించాడు. దీనితో బాటు మూడు కలర్ ఫిల్టర్డ్ చిత్రాలని ఒకదాని తర్వాత ఒకటి అబ్లాంగ్ ప్లేట్ యొక్క వేర్వేరు ప్రదేశాలపై బహిర్గతం చేసే ఒక ప్రత్యేకమైన కెమెరాని వినియోగించి కలర్ ఫోటోలని సృష్టించే ప్రయత్నం చేశాడు. కానీ నిలకడ లేని వస్తువుల వలన ఫోటోలు ముద్రించిన తర్వాత సరిగా వచ్చేవి కావు.

తొలుత లభ్యమయ్యే ఫోటోగ్రాఫిక్ ఉపకరణాలలో ఫోటో సెన్సిటివిటీలో ఉన్న పరిమితుల (నీలంని సరిగానే గుర్తించగలగటం, ఆకుపచ్చని పూర్తిగా గుర్తించలేకపోవటం, ఎరుపుని అసలు గుర్తించలేకపోవటం) వలన కలర్ ఫోటోగ్రఫీ ముందుకు సాగటంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. 1873 లో జర్మను ఫోటోకెమిస్ట్ హెర్మన్ వోగెల్ ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు రంగులని గుర్తించగలిగే డై సెన్సిటైజేషన్ అనే ప్రక్రియను కనుగొన్నాడు. ఫోటోగ్రఫిక్ మిశ్రమాలలో, కలర్ సెన్సిటైజర్ లలో వచ్చిన పురోగతి దీర్ఘ కాలిక ఎక్స్పోజర్ అవసరాన్ని తగ్గించి కలర్ ఫోటోగ్రఫీని క్రమంగా వాణిజ్య రంగం వైపు మరల్చింది.

1907 లో లూమియర్ సోదరులచే కనుగొనబడ్డ ఆటోక్రోం అనే కలర్ ఫోటోగ్రఫీ ప్రక్రియ వాణిజ్యపరంగా విజయవంతమైనది. ఈ ప్లేట్లలో రంగులు అద్దిన బంగాళాదుంపల గంజితో చేసిన గింజలని మొజాయిక్ కలర్ ఫిల్టర్ గా ఉపయోగించటం వలన, మూడు రంగులలోని వివిధ భాగాలని సూక్ష్మ చిత్ర కణాలుగా ఒకదాని ప్రక్కన ఇంకొకటిగా బంధించేలా చేసేది. రివర్సల్ ప్రాసెస్ అనే చర్యని ఆటోక్రోం ప్లేట్లపై జరిపిన తర్వాత పాజిటివ్ ట్రాన్స్పరెన్సీ ఉత్పత్తి అయ్యి ఈ గింజలు ప్రతియొక్క కణాన్ని సరియైన రంగుతో, ఏకీకరించిన చిన్న చిన్న బిందువులుగా కంటికి కనబడి సబ్జెక్టు యొక్క రంగును సంకలిత పద్ధతి ద్వారా సంశ్లేషించేవి. 1890 నుండి 1950 వరకు సంకలిత పద్ధతిలో అమ్మకాలు జరిగిన అనేక రకాలైన స్క్రీన్ ప్లేట్లు, ఫిలిం లలో ఆటోక్రోం ప్లేట్లు ఒక రకం.

1935 లో కోడాక్ మొట్టమొదటి కలర్ ఫిలిం (ఇంటెగ్రల్ ట్రైప్యాక్ లేదా మోనోప్యాక్) ని కోడాక్రోం పేరుతో పరిచయం చేసింది. కలర్ లోని మూడు వివిధ భాగాలని పలు పొరల మిశ్రమం ద్వారా పంపి చిత్రాన్ని బంధించేది. మొదటి పొర వర్ణ విశ్లేషణము లోని ఎరుపు ఆధిక్యతని, మిగిలిన రెండు పొరలు ఆకుపచ్చ, నీలం లని మాత్రం బంధించేవి. ఫలితంగా ప్రత్యేకమైన ఏ ఫిలిం ప్రాసెసింగ్ అవసరం లేకుండానే మూడు బ్లాక్-అండ్-వైట్ చిత్రాలు ఒక దాని పై ఒకటి పడేవి. అయితే వీటిని పరిపూర్ణం చేసే సయాన్, మజెంటా, పసుపుపచ్చ వర్ణ చిత్రాలు, ఈ పొరల్లో కలర్ కప్లర్ లని చేర్చే క్లిష్టమైన ప్రాసెసింగ్ విధానాలతో సృష్టించబడేవి.

ఇదే విధంగా అగ్ఫా యొక్క అగ్ఫా కలర్ న్యూ 1936 లో రూపొందించబడింది. అయితే ఫిలిం తయారీ సమయంలోనే పొరల మిశ్రమంలో కలర్ కప్లర్ లని చొప్పించడంతో ఫోటోలకి రంగులు అద్దే ప్రకియ మరింత సులభం అయినది. ప్రస్తుతం లభించే కలర్ ఫిలింలు ఇప్పటికీ అగ్ఫా పలు పొరల నియమావళిని ఇంచు మించుగా అనుసరించి ఉత్పత్తి అవుతున్నాయి.

ఒక ప్రత్యేకమైన కెమెరాలో ఎక్స్పోజరు తర్వాత ఒకటి లేదా రెండు నిముషాల వ్యవధి లోనే పూర్తి స్థాయి కలర్ ప్రింటుని ఇచ్చే ఇన్స్టంట్ కలర్ ఫిలింని 1963 లో పోలరాయిడ్ కనుగొన్నది.

కలర్ ఫోటోగ్రఫీ చిత్రాలను నేరుగా స్లైడ్ ప్రొజెక్టరులో ఉపయోగించే పాజిటివ్ ట్రాన్స్పరెన్సీలుగా గానీ లేదా పెద్దవిగా విస్తరించి పాజిటివ్ లుగా ప్రత్యేక లేపనం గల కాగితం పై అచ్చు వేయబడే కలర్ నెగిటివ్ లుగా గానీ రూపొందిస్తారు. స్వయంచాలిత ఫోటో ప్రింటింగ్ పరికరాల అందుబాటుతో ఇది వరకు ఉన్న నాన్-డిజిటల్ ఫోటోగ్రఫిలో రెండవ పద్ధతిని ఎక్కువగా అవలంబించేవారు..

డిజిటల్ ఫోటోగ్రఫీ

మార్చు

1981 లో సోనీ మావికా అనే కెమెరా ఛార్జీ కపుల్డ్ డివైస్ ఫర్ ఇమేజింగ్ అనే పరకరం ఉపయోగించి కెమెరాలో మున్ముందు ఫిలిం వాడే అవసరం లేకుండా చేశారు. చిత్రాలని డిస్కులో భద్రపరచగా వాటి ప్రదర్శనకై ఒక మానిటర్ ఉన్న ఈ కెమెరా పూర్తి స్థాయిలో డిజిటల్ కాదు. 1991 లో కొడక్ విడుదల చేసిన DCS 100 మొట్ట మొదటి వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా. దీని అధిక ధర వలన ఫోటో జర్నలిజానికి, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి ఇది దగ్గర కాలేకున్ననూ వాణిజ్య పర డిజిటల్ ఫోటోగ్రఫీకి నాంది మాత్రం పలికినది.

ఫిలిం పై రసాయినిక మార్పుగా కాకుండా డిజిటల్ ఇమేజింగ్ చిత్రాన్ని నమోదు చేసే సమయంలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ సెన్సర్ సహాయంతో ఎలెక్ట్రానిక్ డాటా యొక్క సమూహంగా గుర్తిస్తుంది. ఫిలిం, ఫోటోగ్రఫిక్ పేపర్ ఉపయోగించవలసిన అవసరం ఉండటంతో కెమికల్ ఫోటోగ్రఫీలో ఫోటోలకి మార్పులు చేయడం అసాధ్యం. కానీ డిజిటల్ ఫోటోగ్రఫీలో ఫోటోలను ఇష్ట ప్రకారం మార్చుకొనవచ్చును. డిజిటల్ ఫోటోగ్రఫీ, కెమికల్ ఫోటోగ్రఫీకి ఇదే ముఖ్య భేదం. డిజిటల్ ఫోటోగ్రఫీలో ఉన్న ఈ సౌలభ్యం ఫోటో తీసిన తర్వాత కూడా, ఒక స్థాయి వరకూ దానిని మార్చటమే కాకుండా వాటిని ప్రసార మాధ్యమాలకి చేరవేయటం సులభతరం చేస్తుంది.

ఉపయోగాలు

మార్చు

ప్రారంభ దశ నుండి ఫోటోగ్రఫి పలు శాస్త్రవేత్తల, కళాకారుల ఆసక్తిని చూరగొన్నది. 1887 లో ఎడ్వార్డ్ మైబ్రిడ్జ్ వంటి శాస్త్రవేత్తలు ఫోటోగ్రఫిని మనుషుల, జంతువుల చలనాలని రికార్డు చేయటానికి, అభ్యసించటానికి ఉపయోగించారు. కళాకారులు కూడా అంతే ఆసక్తితో వాస్తవాలను ఫోటో-మెకానికల్ కోణంలో నుండే కాకుండా పిక్టోరియలిస్టు మూవ్ మెంట్ వంటి వాటి ఇతర మార్గాలని అన్వేషించే ప్రయత్నాలు చేశారు.

రక్షణ, పోలీసు, భద్రతా బలగాలు ఫోటోగ్రఫిని పర్యవేక్షణకి,. గుర్తింపుకి, డాటాని భద్రపరచటానికి ఉపయోగిస్తారు. ఔత్సాహికులు ఫోటోగ్రఫిని జ్ఞాపకాలని, మరపురాని ఘడియలని భద్రపరచుకొనటానికి, కథలు చెప్పటానికి, సందేశాలు పంపటానికి వినోద సాధనంగా ఉపయోగిస్తారు. మానవ నేత్రం గుర్తించలేని అత్యంత వేగమైన ప్రక్రియలని చిత్రీకరించటానికి హై స్పీడ్ ఫోటోగ్రఫీని ఉపయోగిస్తారు.

సాంకేతిక ఆంశాలు

మార్చు

కెమెరా ఫోటోలను ఏర్పరచే పరికరం. కాగా, ఫోటోగ్రఫిక్ ఫిలిం లేదా సిలికాన్ ఎలెక్ట్రానిక్ ఇమేజ్ సెన్సర్ ఫోటోలను గుర్తించే మాధ్యమం. నమోదు చేసే మాధ్యమం, ఫోటోగ్రఫిక్ ఫిలిం లేదా డిజిటల్ ఎలెక్ట్రానిక్ లేదా మ్యాగ్నెటిక్ మెమరీ కావచ్చును.

ఫోటోగ్రఫర్లు కాంతిని గుర్తించే (ఫిలిం వంటి) పరికరాన్ని కెమెరా యొక్క కటకాన్ని నియంత్రించి కావలసినంత కాంతికి బహిర్గతం చేసినప్పుడు ఏర్పడే (ఫిలిం పైన అయితే) నిగూఢమైన చిత్రం లేదా (డిజిటల్ కెమెరా అయితే) RAW file తగిన మార్పులు చేయబడి కంటికి కనబడే చిత్రంగా రూపాంతరం చెందుతుంది. Charge-coupled device (CCD) లేదా complementary metal-oxide-semiconductor (CMOS) సాంకేతికతలను ఉపయోగించే డిజిటల్ కెమెరాల మెమరీ కార్డులలో భద్రపరచబడ్డ చిత్రాలను తర్వాత పేపర్/ఫిలిం పై ముద్రించవచ్చును.

కెమెరా (లేక కెమెరా అబ్స్క్యూరా) మిగతా వెలుగును సాధ్యమయినంత తొలగించి కేవలం చిత్రం ఏర్పడే కాంతిని బంధించే ఒక చీకటి గది లేక పెట్టె. ఇవి వివిధ పరిమాణాలలో లభ్యం. ఒక కాలంలో కెమెరా ఒక చీకటి గదిలో ఉంటే ఫోటో తీయవలసిన వస్తువు వెలుతురు ఉన్న పక్క గదిలో ఉండవలసి వచ్చేది. ప్రాసెస్ కెమెరాలుగా పిలువబడే వీటిలో సాధారణంగా పెద్ద ఫిలిం నెగిటివ్ లు ఉపయోగించవలసి వచ్చేది.

కెమెరా చిన్నదయ్యే కొద్దీ చిత్రం ప్రకాశవంతంగా వస్తుంది అనే నియమము ఫోటోగ్రఫి పుట్టినప్పటి నుండి జగద్విదితము. అందుకే గూఢచారులు టై పిన్ లో, లగేజ్ లో ఒక భాగంలో లేదా జేబులో వేసుకొనే గడియారానికి నిగూఢ కెమెరాలని అమర్చుకొని అద్భుతమైన ఫోటోలు తీసేవారు. వీటిని టికా కెమెరాలు అంటారు.

కెమెరా నియంత్రణ (కంట్రోల్) లు

మార్చు
కంట్రోల్ వివరణ
ఫోకస్ (Focus) కెమెరాతో చూడగలిగిన వస్తువు యొక్క స్థితి, లేదా స్పష్టమైన ఫోటో వచ్చేందుకు ఆప్టికల్ పరికరం సరి చేయటం. ఇన్ ఫోకస్, ఔట్ అఫ్ ఫోకస్
సూక్ష్మరంధ్రం (Aperture) f-number గా కొలవబడే లెంస్ సర్దుబాటు. లెంస్ ద్వారా ఎంత కాంతిని అనుమతించాలో ఇది నిర్ణయిస్తుంది. అపెర్చర్ depth of field (లోతు), వివర్తణ లని నిర్ణయిస్తోంది. f-number పెరిగే కొద్దీ లెంస్ ఓపెనింగ్ తక్కువగా, కాంతి తక్కువగా, depth of field ఎక్కువగా, diffraction blur ఎక్కువగా ఉంటుంది. ఫోకల్ లెంత్ ని f-number తో భాగిస్తే, సమర్థవంతమైన అపెర్చరు (నాభ్యంతరం) యొక్క వ్యాసం వస్తుంది.
షట్టరు వేగం (Shutter Speed) షట్టర్ యొక్క వేగాన్ని నియంత్రించటం వలన షట్టర్ స్పీడ్ ఒక ఎక్స్ పోజరుకు ఇమేజింగ్ మీడియంని కాంతికి బహిర్గతం చేసే నిడివిని నియంత్రిస్తుంది. దీనిని సెకండ్ల భిన్నాలుగా లేదా మెకానికల్ షట్టర్ ల కోణాలుగా సూచిస్తారు. షట్టర్ స్పీడ్ ఎక్కువ వేగం (అంటే తక్కువ నిడివి) కలిగి ఉంటే, కదిలే కెమెరా/సబ్జెక్టు వలన ఇమేజ్ ప్లేన్ పైకి ప్రసరించే కాంతిని, ఇమేజ్ బ్లరింగ్ ని తగ్గిస్తాయి.
శ్వేత సంతులనం (White Balance) డిజిటల్ కెమెరాలలో, రంగు తీవ్రతని వెలుతురు ఉన్న పరిస్థితులను బట్టి (given set of lighting conditions) వస్తువు పై కంటికి కనిపించే తెల్లని కాంతి ఎలా ఉందో ఎలెక్ట్రానిక్ రూపంలో ఇమేజింగ్ చిప్ పైన కూడా అదే విధంగా, సహజంగా ఉండేటట్లు వైట్ బ్యాలెంస్ నియంత్రిస్తుంది. ముందు తరం ఫిలిం ఆధారిత కెమెరాలలో అయితే ఫిలిం యొక్క సరైన ఎంపిక, లేదా కలర్ ని సరిచేసే ఫిల్టర్ లని వాడి దీనిని నియంత్రించటం సాధ్యపడేది. సహజమైన రంగు కోసమే కాకుండా, రంగులు కోరుకున్న విధంగా సరైన్ వర్ణంలో కనిపించటానికి కూడా ఫోటోగ్రఫర్లు వైట్ బ్యాలెంస్ ని ఉపయోగిస్తారు.
మీటరింగ్ మోడ్ (Metering Mode) వెలుతురులో ఉన్న ముఖ్యాంశాలు, నీడలు ఫోటోగ్రఫర్ యొక్క కోరిక మేరకు వచ్చేలా నియంత్రించబడే ఎక్స్పోజరు యొక్క కొలత. చాలా ఆధునిక కెమెరాలలో ఎక్స్పోజరు స్వయంచాలకంగా మీటరు అయ్యేలా, సరిగ్గా అమరేలా ఉంటుంది. మునుపటి తరం కెమెరాలలో ప్రత్యేక లైట్ మీటరింగ్ పరికరాల పై, లేదా ఫోటోగ్రఫరుకు సరి అయిన మీటరు సెట్టింగ్ అమరిక పై ఉన్న నైపుణ్యం పై ఆధార పడి ఉండేది. వాడబడే అపెర్చర్, షట్టర్ స్పీడ్ లలోనికి కాంతి యొక్క సరియైన మోతాదును పంపటానికి, ఫిలిం యొక్క సెంసిటివిటీకి అనుగుణంగా, లేదా కాంతి యొక్క సెంసరుకి అనుగుణంగా మీటరుని సరి చేయవలసి ఉంటుంది. ఇది "ఫిలిం స్పీడు" లేదా ఐ ఎస్ ఓ సెంసిటివిటీని గాని మీటరు పై సెట్ చేయటంతో సాధ్య పడుతుంది.
ఐ ఎస్ ఓ వేగం (ISO Speed) సాంప్రదాయికమైన కెమెరాలలో ఉన్న ఫిలిం లకి ఎంత వేగం ఉండాలో నిర్ధారించటం. ఆధునిక డిజిటల్ కెమెరాలు కాంతి నుండే ఈ స్పీడును సంపాదించి వాటిని సాంఖ్యిక అవుట్ పుట్ గా మార్చి ఆటోమేటిక్ ఎక్స్పోజరు వ్యవస్థని నియంత్రిస్తాయి. ISO number పెరిగే కొద్దీ కాంతికి ఫిలిం సెంసిటివిటీ పెరుగుతుంది. ISO number తరిగే కొద్దీ కాంతికి ఫిలిం సెంసిటివిటీ తగ్గుతుంది. సరియైన ISO స్పీడ్, అపెర్చర్, షట్టర్ స్పీడ్ ల కలయిక ఫోటో మరీ మసకగా కాకుండా, మరీ కాంతివంతంగా కాకుండా సరియైన ఎక్స్ పోజర్ కి గురి అయి, మీటరు పై మధ్యస్తంగా ఉండి చక్కని ఫోటో వచ్చేందుకు దోహద పడతాయి.
ఆటో ఫోకస్ పాయింట్ (Autofocus Point) కొన్ని కెమెరాలలో ఇమేజింగ్ ఫ్రేం లోని ఒక బిందువుని కేంద్రీకరించటంతో ఆటో-ఫోకస్ వ్యవస్థ ఫోకస్ చేయటానికి ప్రయత్నిస్తుంది. చాలా సింగిల్-లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాలు (SLR) వ్యూ ఫైండర్ లో ఒక దాని కన్నా ఎక్కువ ఆటో-ఫోకస్ పాయింట్ లని గుర్తించగలవు.

ఇవే కాకుండా ఇమేజింగ్ పరికరం లోనే లభ్యమయ్యే కొన్ని ఇతర అంశాలు కూడా ఒక ఫోటో కావలసిన విధంగా లేక అందంగా రావటానికి కారణాలవుతాయి. అవి

కెమెరా నియంత్రణలు అవినాభావ సంబంధం గలవి. ఎక్స్పోజర్ యొక్క నిడివి, కటకం యొక్క సూక్ష్మరంధ్రం,, ఉపయోగించబడే కటకం యొక్క నాభ్యంతరం (జూంని బట్టి సూక్ష్మరంధ్రంలో మార్పు ఉంటుంది) తో బాటు ఫిలిం ప్లేన్ పైకి చేరే మొత్తం కాంతి మారుతుంది. వీటిలో ఏ నియంత్రణ మారిననూ దాని ప్రభావం ఎక్స్పోజరు పై ఉంటుంది. చాలా కెమెరాలలో ఈ నియంత్రణలని స్వయంచాలితంగా నియంత్రించేలా సౌలభ్యం ఉంటుంది. ఈ సౌలభ్యం సందర్భానుసారం మాత్రమే ఫోటోలు తీసేవారికి చాలా ఉపయోగపడుతుంది.

ఎక్స్పోజరు యొక్క నిడివిని షట్టరు లేని కెమెరాలలో సైతం షట్టరు వేగంగా వ్యవహరిస్తారు. ఇది సెకను యొక్క భిన్నాలలో కొలవబడుతుంది. సాధారణంగా అచలన (still-life) సబ్జెక్టులకి ఒకటి నుండి కావలసినన్ని సెకనుల వరకు, రాత్రి దృశ్యాలకి గంటలు తరబడి ఎక్స్పోజరు నిడివి అవసరమవుతాయి. ఈ రెండూ సాధ్యాలే.

ఫోకల్ రేషియో నుండి తీసుకొనబడ్డ సూక్ష్మరంధ్రపు ఎఫ్-సంఖ్య (f-number) లేదా ఎఫ్-స్టాప్ (f-stop) గా వ్యవహరిస్తారు. ఇది నాభ్యంతరం, సూక్ష్మరంధ్రం వ్యాసం యొక్క నిష్పత్తిలో ఉంటుంది. కాంతి ఎక్కువ దూరం ప్రయాణించటం వలన పొడవాటి కటకాలు వాటి గుండా తక్కువ కాంతిని ప్రసరింపజేయగా సూక్ష్మరంధ్రం యొక్క వ్యాసం అంతే ఉన్న పొట్టి కటకాలు (నాభ్యంతరం తక్కువగా ఉన్నవి) తో తీసే ఫోటోలు (ఎక్కువ కాంతిని ప్రసరింపజేస్తాయి గనుక) ఎక్కువ వెలుతురుతో ఉంటాయి.

ఎఫ్-సంఖ్య తగ్గేకొద్దీ సూక్ష్మరంధ్రం పెద్దది అవుతూ ఉంటుంది. కటకాల యొక్క నాభ్యంతరాలని కొలిచే ప్రస్తుత ఎఫ్-సంఖ్యల వ్యవస్థకి అంతర్జాతీయ ప్రామాణికాలను నిర్దేశించాయి. దీనికి ముందు రూపొందించిన కెమెరాలలో ఎఫ్-సంఖ్యల శ్రేణులు వేరే విధంగా ఉండేవి.

ఎఫ్-సంఖ్య  కి తగ్గిస్తే సూక్ష్మరంధ్రం వ్యాసం కూడా అదే కొలతలో పెరుగుతుంది, వైశాల్యం ద్విగుణీకృతం అవుతుంది. ఒక సాధారణ కటకం పైన ఉండే ఎఫ్-సంఖ్యలు 2.8, 4, 5.6, 8, 11, 16, 22, 32. ఈ ఎఫ్-సంఖ్యలు సగమయ్యే కొద్దీ ఫిలిం పైకి ప్రసరించే కాంతి ద్విగుణీకృతమవుతూ ఉంటుంది. సంఖ్యలు ద్విగుణీకృతం అయ్యే కొద్దీ కాంతి సగం తగ్గుతూ ఉంటుంది.

కెమెరాలోని షట్టర్ వేగం, సూక్ష్మ రంధ్రం, ఫిలిం స్పీడ్ (షట్టర్ వేగం) ల వివిధ కలయికలతో చిత్రాన్ని బంధించవచ్చు. ఒకదానికి ఒకటి అవినాభావసంబంధమున్న సూక్ష్మరంధ్రం, షట్టర్ వేగం వేర్వేరు సెట్టింగులని ఉపయోగించి వివిధ పరిస్థితులలో ఉన్న సెన్సర్ స్పీడ్, లైటింగ్, కెమెరా లేదా సబ్జెక్టుల కదలిక, క్షేత్ర అగాథంలతో ఫోటోలని తీయవచ్చును. వేగం తక్కువగా ఉన్న ఫిలిం గ్రెయిన్ లని, ఎలెక్ట్రానిక్ సెన్సర్ పైన తక్కువ స్పీడ్ సెట్టింగ్ నాయిస్ ని తగ్గిస్తుంది. ఎక్కువ వేగం గల షట్టర్ స్పీడ్ మోషన్ బ్లర్ ని తగ్గిస్తుంది, లేదా తక్కువ సూక్ష్మరంధ్రాన్ని ఉపయోగించి అగాథక్షేత్రాన్ని పెంచుతుంది.

ఉదాహరణకి తక్కువ కాంతికి విశాల సూక్ష్మరంధ్రాన్ని ఎక్కువ కాంతికి సంకుచిత సూక్ష్మరంధ్రాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. సబ్జెక్టు కదులుతూ ఉన్నది అయితే షట్టర్ వేగం ఎక్కువ అవసరం కావచ్చు. షట్టర్ వేగం తక్కువగా ఉన్నప్పుడు ట్రైపాడ్ అవసరం కావచ్చు. 8 ms లో f/8 (అనగా సెకను లోని 1/125 వ భాగము), 4 ms లో f/5.6 (అనగా సెకను లోని 1/250 వ భాగము) సమానమైన కాంతిని అనుమతిస్తాయి. కానీ అంతిమ ఫలితం ఈ రెండు కలయికల్లోని ఎంపిక బట్టి ఉంటుంది. కటకం యొక్క సూక్ష్మరంధ్రం, నాభ్యంతరం అగాథక్షేత్రాన్ని నిర్దేశిస్తాయి. అగాథక్షేత్రం అనగా కటకం దృష్టిలో పడే దూరాల శ్రేణి. విశాల సూక్ష్మరంధ్రం ఉన్న కటకం యొక్క అగాథక్షేత్రం తక్కువగా ఉంటుంది. అనగా చిత్ర సమతలంలోని కొంత భాగమే స్పష్టమైన దృష్టి కలిగి ఉంటుంది. వ్యక్తుల ఫోటోలు తీయటానికి, మ్యాక్రో ఫోటోగ్రఫీలో నేపథ్యం నుండి సబ్జెక్టులని వేరు చేయటానికి ఈ మెళకువ బాగా ఉపయోగపడుతుంది.

సంకుచిత సూక్ష్మరంధ్రం గల కటకం చిత్ర సమతలం లోని ఎక్కువ భాగాన్ని స్పష్టమైన దృష్టికి తీసుకు వస్తుంది. దూరంగా ఉండే ప్రకృతి అందాలు (Landscape) లేదా జన సమూహాలని తీయటానికి ఈ మెళకువ ఉపయోగపడుతుంది. కానీ సంకుచిత సూక్ష్మరంధ్రాలలోని వివర్తన కారణంగా చిత్రాలలోని స్పష్టత బాగా తగ్గే అవకాశం ఉంది. సాధారణంగా అత్యధిక స్పష్టత కటకపు పరిమితుల యొక్క మధ్యమ విలువ వద్ద సాధ్యపడుతుంది. (ఉదా: సూక్ష్మరంధ్రం విలువలు f/2.8 నుండి f/16 వరకు పరిమితులు ఉండే కటకానికి అత్యధిక స్పష్టత f/8 వద్ద ఉంటుంది. కటకాలలో పెరిగే సాంకేతికత విశాల సూక్ష్మరంధ్రాలతో కూడా స్పష్టమైన చిత్రాలని బంధించే లా తీర్చిదిద్దుతోంది.

చిత్రాన్ని బంధించటం దానిని రూపొందించటం లోని భాగం మాత్రమే. ఉపయోగించే వస్తువు ఏదయినా సరే నిగూఢమైన చిత్రాన్ని కంటికి కనబడేలా చెయ్యటానికి కొన్ని పద్ధతులని అవలంబించాలి. స్లయిడ్ ఫిలిం అయితే ప్రొజెక్షన్ చేయవలసి ఉంటుంది. ప్రింటు ఫిలిం అయితే నెగిటివ్ని ఫోటోగ్రఫిక్ పేపరు పై ముద్రించవలసి ఉంటుంది. డిజిటల్ ఫోటోలు అయితే ఇమేజ్ సర్వర్ లలో అప్ లోడ్ చెయ్యటం గానీ టెలివిజన్/కంప్యూటర్/డిజిటల్ ఫోటోఫ్రేం పై గానీ చూడాలి. ఏ రకమైన ఫిలిం అయిననూ కాగితం లేదా ఫోటోగ్రఫిక్ కాగితం వంటి సాంప్రదాయిక మాధ్యమాలపై ముద్రించవచ్చును.

చిత్రం కంటికి కనబడేలా చేసే ముందే వివిధ నియంత్రణలని ఉపయోగించి దానిని మార్చవచ్చును. ఈ నియంత్రణలు చాలా వరకు చిత్రాన్ని బంధించటంలో ఉపయోగించినవే అయిననూ కొన్ని మాత్రం రెండరింగ్ ప్రక్రియకి ప్రత్యేకమైనవి. చాలా ముద్రణా నియంత్రణలు డిజిటల్ భావనలకి సమానమైననూ కొన్ని మాత్రం వేరే ప్రభావాలని ప్రదర్శిస్తాయి. ఇతర ముద్రణా మార్పులు:

 • ఫిలింను కడిగే సమయంలో ఉపయోగించే రసాయనాలు
 • ముద్రణా ఎక్స్పోజరు యొక్క నిడివి - ఇది షట్టరు వేగంతో సరి సమానం
 • ముద్రణా అపెర్చరు - అపెర్చరుతో సమానమైననూ అగాథక్షేత్రం పై ఎటువంటి ప్రభావం చూపదు
 • కాంట్రాస్ట్ - ఇతర ఆబ్జెక్టులనుండి కావలసిన ఆబ్జెక్టులని వేరు చేసి చూపటానికి దిద్దే మెరుగులు
 • డాడ్జింగ్ - కొన్ని ముద్రణా ప్రదేశాల ఎక్స్పోజరు తగ్గిస్తుంది
 • బర్నింగ్ ఇన్ - కొన్ని ముద్రణా ప్రదేశాల ఎక్స్పోజరుని పెంచుతుంది
 • పేపర్ టెక్స్చర్ - గ్లాసీ, మ్యాట్టె
 • పేపర్ రకం - రెజిన్ కోటెడ్, ఫైబర్ బేస్డ్
 • పేపర్ సైజు
 • ఎక్స్పోజరు షేపు
 • టోనర్లు

ఇతర ఫోటోగ్రఫీ మెలకువలు

మార్చు

స్టీరియోస్కోపిక్ (3-D)

మార్చు

ఒకే వస్తువు యొక్క రెండు వేర్వేరు చిత్రాలు ఒక దాని ప్రక్కన మరొకటి ఉన్న కటకాలతో బంధించటం వలన లోతు యొక్క భ్రాంతి కలుగుతుంది. దీనివలన చూసేవారికి అది వాస్తవానుభూతిని కలిగిస్తుంది. దీనినే త్రీ-డీ 3-D ఫోటోగ్రఫి అంటారు. ఫిలిం లని ఉపయోగించి, లేదా సాంఖ్యిక ప్రక్రియని ఉపయోగించి ఈ విధంగా ఏకవర్ణపు, కలర్ ఫోటోలని 3-D చెయ్యవచ్చును.

1960వ సంవత్సరం నాటి నుండే అతినీలలోహిత, పరారుణ ఫోటోగ్రఫిక్ ఫిలిం లభ్యమవటంతో వివిధ రంగాలలోని ఫోటోగ్రఫీలో వీటి ఉపయోగం ప్రారంభమైనది. డిజిటల్ ఫోటోగ్రఫీలో వచ్చిన కొత్త సాంకేతిక విప్లవాలు సంపూర్ణ వర్ణపట ఛాయాగ్రహణంకి కొత్త ద్వారాలు తీశాయి. అతినీలలోహిత ఛాయాగ్రహణం, పరారుణ ఛాయాగ్రహణం, దృశ్యమాన వర్ణపట కాంతుల సరైన ఫిల్టర్ ల ఎంపికతో కొత్త ఫోటోగ్రఫి కళాత్మకని సంతరించుకొన్నది. ఫుల్ స్పెక్ట్రం ఫోటోగ్రఫి కళలు, జియాలజీ, నేర పరిశోధన, చట్టం అమలు చేయటానికి వాడుతారు.

లైట్ ఫీల్డ్ ఫోటోగ్రఫీ

మార్చు

చిత్రాలని లని ఏర్పరచే ఇతర మెళకువలు

మార్చు

ఫిలిం ఫోటోగ్రఫి యొక్క భవితవ్యం

మార్చు

డిజిటల్ పాయింట్ అండ్ షూట్ కెమెరాలు వీడియో, ఆడియో రికార్డింగు సౌలభ్యంతో రావటం మూలాన ఫిలిం కెమెరాలను వినియోగదారునికి దూరం చేశాయి. 2004 లో కొడక్, 2006 లో నికాన్, 2006 లో కెనాన్ తమ ఫిలిం ఫోటో కెమెరాలను రూపొందించటం ఆపివేశాయి.

2007 లో కొడక్ చే నిర్వహించబడ్డ ఒక సర్వేలో ఫోటోగ్రఫీ అప్పటికే డిజిటల్ మయమైనదనీ, అయిననూ 75 శాతం శాస్త్రీయ ఫోటోగ్రఫర్ లు ఫిలింని వాడటమే కొనసాగిస్తారనీ, అతి కొద్ది మందే డిజిటల్ వైపు వెళతారని తేల్చింది.

ఫోటోగ్రఫి రీతులు

మార్చు

అమెచ్యుర్

మార్చు

కమర్షియల్

మార్చు

విజ్ఞాన, నేర పరిశోధన

మార్చు

ఫోటోగ్రఫీ అభివృద్ది మూల కారకులు

మార్చు
మొట్ట మొదటి ఫోటో మొదటి మనుష్యులు వున్న ఫోటో కెమెరా అబ్స్క్యురా మొదటి రంగుల ఫోటో
 
ఫ్రెంచ్ పరిశోధకుడు నేసెఫార్ నిప్సే 1886 లో తీసిన చాయా చిత్రం ప్రపంచములోనే మొట్టమొదటిగా గుర్తింపబడింది.
 
లూయిస్ జాక్వాస్ మాండే డాగుఎర్రే Louis-Jacques-Mandé Daguerre అనే ఫ్రెంచ్ పరిశోధకుడు 1838-39 సంవత్సరాల మధ్య మొదటి మనుష్యులు వున్న ఒక వీధి చిత్రాన్ని తీసాడు.ఫొటోని పెద్దదిగా చేసి పరిశీలిస్తే చిత్రంలో ఎడమ వైపు క్రింద ఒక మనిషి తన బూట్లకి పాలిష్ పెట్టించ్చుకుంటున్నది గమనించవచ్చు.
 
 
జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్
అనే పరిశోధకుడు 1861 లో ప్రపంచంలో మొట్ట మొట్టమొదటి పూర్తి రంగుల చాయా చిత్రాన్ని తీసాడు.
 
మొట్టమొదట ఛాయాచిత్రాన్ని(ఫోటోగ్రాప్)1826లో నేసెఫార్ నీప్సే (Nicéphore Niépce) అనే ఫ్రెంచ్ పరిశోధకుడు పెవటెర్ (pewter)అనే పల్లెరం మీద చిత్రీకరించాడు.పెట్రోలియం ఉప ఉత్పత్తి అయిన బిటుమేన్, జుడియా అని పిలువబడే రసాయనం ల మిశ్రమాన్ని పెవటెర్ అనే మెరుగు పెట్టిన పళ్లెం మీద పూసి ఈ ఘనకార్యాన్ని సాధించగాలిగాడు.
 
లూయిస్ జాక్వాస్ మాండే డాగుఎర్రే
Louis-Jacques-Mandé Daguerre
Ibn al-Haytham (Alhazen) was a polymath who was a pioneer of modern optics and the scientific method.
 

జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్
(13 జూన్, 18315 నవంబర్, 1879) స్కాట్లాండులో జన్మించిన ఒక భౌతిక/గణిత శాస్త్రజ్ఞుడు.1861 లో మొదటి సారి కలర్ ఫొటోగ్రాఫ్ తీసిన ఖ్యాతి కూడా ఆతనికే దక్కింది.

చాయచిత్రీకరణ గురించి

మార్చు

చరిత్రకు సాక్షిగా,విజ్ఞాన,వినోద, ఎన్నో రంగాలలో ఫోటోగ్రఫీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.మానవుల జీవితాలలో ఫోటోగ్రఫీ ప్రభావానికి కొన్ని సచిత్ర ఉదాహరణలు.

చరిత్ర

మార్చు

కెమెరాలు వాటి అభివృద్ది

మార్చు
రకరకాలయిన కెమేరాలు
చిత్రీకరణ విధానం, పరికరాలు మొదటి తరం డబ్బా ఫోటో కెమెరా రెండోతరం ఫోటో కెమెరా ఇప్పటి ఆధునిక,డిజిటల్ కెమేరాలు
నిశ్చలన ఛాయా చిత్రీకరణ
 
 
 
 
 
చలన చిత్రీకరణ (సినిమా) cell
 
 
ఐ మాక్స్3డి కెమెరా
చలన చిత్రీకరణ (వీడియో)
 
దస్త్రం:Sony dv handycam.jpg
 

కెమెరా రకాలు

కెమెరా తయారీదారులు
అమెచ్యూర్ ఫోటోగ్రఫీ

మార్చు

ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ

మార్చు
 
మీడియం ఫార్మాట్ హసల్ బ్లాడ్ కెమెరా

సాంప్రదాయక ఫోటోగ్రఫీ

మార్చు

కావలసిన పరికరాలు,యంత్రాలు,ఉపకరణాలు

35ఎంఎం కెమేరాతో 135ఎంఎం ఫిల్మ్ ఉపయోగించి ఒకే ప్రదేశంనుండి కెమేరాని కదల్చకుండా 28ఎంఎం వైడ్ నుండి 210 ఎంఎం టెలి లెన్సులు ఉపయోగించి తీసిన చాయా చిత్రాలు.

ఫిల్మ్గురించి...
 

ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్(Photographic Film) అంటే వెలుతురికి ప్రభావితమయ్యే సిల్వర్ హాలైడ్ అణువులతో పూతపూయబడిన(emulsion) ఒక ప్లాస్టిక్(పాలియోస్టర్,నైట్రోసెల్యులోజ్ లేదా సెల్యులోజ్)పలుచటి కాగితం లాంటి పొర(షీట్). ఇది రకరకాలయిన కొలతలతో లభిస్తుంది.

ఫిల్మ్ గురించి మరింత సమాచారం...

ఇతర ఉపకరణాలు

 • అల్బం (Photo album)
 • గొడుగులు (Umbrella)
 • నీరు (Water)
 • వెడల్పాటి పాత్రలు (Tray)
 • రంగులు (Colors)
 • వివిధ రంగులలో బట్ట (color cloth in different shades)
 • వివిధ రంగులలో కాగితాలు ( paper sheets in different shades)
 • క్లిప్పులు (Clips)

డిజిటల్ ఫోటోగ్రఫీ

మార్చు

ఇప్పటి డిజిటల్ కెమేరాలు చిన్న అగ్గిపెట్ట కంటే తక్కువ పరిణామంలో లభిస్తున్నాయి.ఇందులో సరదాగా ఫోటోలు తీసుకునే కంపాక్ట్ కామేరాల మొదలు వృత్తి నిపుణులు వాడే అత్యంత ఆధునికమయిన 35ఎమ్ఎమ్ ఎస్ ఎల్ ఆర్(SLR) నుండి మీడియం ఫార్మాట్(Medium format) కెమేరాల వరకు ఎన్నో రకాల బ్రాండు లతో,ఖరీదుతో లభిస్తున్నాయి. ఈ డిజిటల్ కేమేరాలకి కలిసివుండే, విడిగా వుండే ఫోటో నిక్షిప్త వ్యవస్థ (storage system or device)వుంటుంది. డిజిటల్ కెమేరాతో తీసిన చాయ చిత్రాలని కంప్యూటర్ లోనికి కాని ముద్రణా యంత్రానికి గాని,స్కాన్నర్ కిగాని,ఇతర పరికరములలోనికిగాని దిగుమతి (import)చేసికోవచ్చు. కావలసిన పరికరాలు,యంత్రాలు,ఉపకరణాలు

ఇతర ఉపకరణాలు

 • అల్బం
 • గొడుగులు
 • విధ రంగులలో బట్ట
 • విధ రంగులలో కాగితాలు
 • క్లిప్పులు

కొన్ని ఫోటో నిక్షిప్త ఉపకరణాలు

మార్చు

వ్యాపారం

మార్చు

ఉపయోగించు రంగాలు

మార్చు

చిత్రీకరణ చేసే విధానం

మార్చు

ఒక ఫొటోని తీయటానికి సాంకేతిక వివరాలు(కెమెరా,ఫిల్మ్,లెన్స్,వెలురురు(లైట్స్)గురించి)ఎక్సుపోజరు(exposure),సృజనాత్మకత అవసరం. షట్టర్(shutter), అపర్చర్(aperture) ల కలయికతో నిర్దేశించిన వెలుతురుని ఫిల్మ్ మీదకాని ఇమేజి సెన్సార్ (image sensor) మీద కాని నిక్షిప్తం చేసే ప్రక్రియని ఎక్సుపోజరు అంటారు. ఒక చక్కటి ఫోటోకి ఎక్సుపోజరు అత్యంత కీలకం.ఇప్పటి ఆధునిక ఎస్ ఎల్ ఆర్,డిజిటల్ కెమేరాలు ఫోటో తీసే విధానాన్ని అత్యంత సులభం చేసి ప్రజలందరికీ సులువుగా చక్కగా ఫోటోలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.ఎక్సుపోజరుకి ఒక ఉదా:

 • ఎడమవైపు బొమ్మ తక్కువ ఎక్సుపోజరు(under exposure) తో తీసింది మధ్య లోఉన్నది సరిఅయిన ఎక్సుపోజరు (correct exposure) కుడివైపు ఎక్కువ ఎక్సుపోజరు(over exposure) తో తీసింది
 

డిజిటల్ ఫోటోగ్రఫి

మార్చు

నేర్చుకోనటం

మార్చు

పుస్తకాలు

మార్చు

పత్రికలు

మార్చు

విద్యాలయాలు

మార్చు

అంతర్జాలం ద్వారా

మార్చు

పరికరాలు

మార్చు

ఉత్పత్తిదారులు

మార్చు

పోటీలు అవార్డులు

మార్చు

లింకులు

మార్చు

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 Britannica, Encyclopedia. "History of Photography". Retrieved 12 April 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. Webster, Merriam. "photography". Retrieved 12 April 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. Harrison 1887, p. 15.
 4. Harrison 1887, p. 19.
 • Harrison, W Jerome (1887). A History of Photography. The Photographic Times.

ఇవి కూడా చూడండి

మార్చు
 • వైమానిక ఛాయాగ్రహణం
 • నిర్మాణ ఛాయాగ్రహణం
 • క్యాండిడ్ ఫోటోగ్రఫి
 • మేఘ ఛాయగ్రహణం
 • సహజ వనర సంరక్షక ఛాయాగ్రహణం
 • కాస్ప్లే ఫోటోగ్రఫి
 • డిజిస్కోపింగ్ ఫోటోగ్రఫి
 • డాక్యుమెంటరీ ఫోటోగ్రఫి
 • కామపూరిత ఛాయగ్రహణం
 • ఫ్యాషన్ ఫోటోగ్రఫి
 • ఫైన్-ఆర్ట్ ఫోటోగ్రఫి
 • అగ్ని ప్రమాద ఛాయాగ్రహణం
 • ఆహార ఛాయాగ్రహణం
 • నేరపరిశోధనా ఛాయాగ్రహణం
 • బాహ్యసౌందర్య ఛాయాగ్రహణం
 • ముఖ చిత్ర ఛాయగ్రహణం
 • ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫి
 • వైద్యరంగ ఛాయాగ్రహణం
 • ఆధ్యాత్మిక ఛాయాగ్రహణం (మిక్ సాంగ్)
 • ప్రాకృతిక ఛాయాగ్రహణం
 • సాంఘిక ఛాయాగ్రహణం
 • నగ్న ఛాయాగ్రహణం
 • ఓల్డ్-టైం ఫోటోగ్రఫి
 • సంపాదకీయ ఛాయాగ్రహణం
 • రూపచిత్ర ఛాయాగ్రహణం
 • క్రీడా ఛాయాగ్రహణం
 • అచలన చిత్ర ఛాయాగ్రహణం
 • స్టాక్ ఫోటోగ్రఫి
 • స్ట్రీట్ ఫోటోగ్రఫి
 • యాత్రా ఛాయాగ్రహణం
 • జలాంతర్గ ఛాయాగ్రహణం
 • వెర్నాక్యులర్ ఫోటోగ్రఫి
 • వర్చ్యువల్ రియాలిటీ ఫోటోగ్రఫి
 • యుద్ధ ఛాయాగ్రహణం
 • వివాహోత్సవ ఛాయాగ్రహణం
 • వన్యప్రాణి ఛాయగ్రహణం
 • కిర్లియన్‌ ఫొటోగ్రఫీ
మెళకువలు
 • విహంగ వీక్షణ ఛాయాగ్రహణం
 • అఫోకల్ ఫోటోగ్రఫి
 • ఖగోళ ఛాయాగ్రహణం
 • బోకే
 • కాంతి వ్యతిరేక ఛాయాగ్రహణం
 • క్రాస్ ప్రాసిసింగ్
 • సయనోటైప్
 • ఫిల్ ఫ్ల్యాష్
 • ఫిలిం సంవర్ధన
 • సంపూర్ణ వర్ణపట ఛాయాగ్రహణం
 • హ్యారిస్ షట్టర్
 • హై డైనమిక్ రేంజ్ ఇమేజింగ్
 • అతి వేగ ఛాయాగ్రహణం
 • చిత్ర సంగమం
 • పరారుణ ఛాయాగ్రహణం
 • గతి ఛాయాగ్రహణం
 • గాలిపట వీక్షణ ఛాయాగ్రహణం
 • లీడ్ రూం
 • చలనకాంతి చిత్రీకరణ
 • లిథ్-ప్రింట్
 • అతి సామీప్య ఛాయాగ్రహణం (స్థూల ఛాయాగ్రహణం)
 • సూక్ష్మదర్శిత ఛాయాగ్రహణం
 • ఏకవర్ణ ఛాయాగ్రహణం
 • చలన కళంకం
 • రాత్రి ఛాయాగ్రహణం
 • ప్యానింగ్
 • సమగ్ర దృశ్య ఛాయాగ్రహణం
 • ఫోటోగ్రాం
 • ఛాయాచిత్ర సంరక్షణ
 • ఛాయాచిత్ర వివర్ణం
 • ఫోటోగ్రఫిక్ ప్రింట్ టోనింగ్
 • పుష్ ప్రింటింగ్
 • పుష్ ప్రాసెసింగ్
 • పున:చ్ఛాయాగ్రహణం
 • రోల్-అవుట్ ఫోటోగ్రఫి
 • సౌర్యీకరణ
 • ష్లీరెన్ ఫోటోగ్రఫి
 • నక్షత్ర చలన ఛాయాగ్రహణం
 • ఘనపదార్థ అంతర్దర్శిత ఛాయాగ్రహణం
 • సూర్యరశ్మి ముద్రితం
 • వక్ర సమతల దృష్టి
 • టైమ్-ల్యాప్స్
 • అతినీలలోహిత ఛాయాగ్రహణం
 • వైడ్ డైనమిక్ రేంజ్
 • జూం బర్స్ట్
ఇతరాలు