అడవి జామ
అడవి జామ (Calycopteris floribunda, commonly known as Ukshi) ఒక పెద్ద ఎగబ్రాకే మొక్క. ఇది సుమారు 5-10 మీటర్లు ఎత్తులో 5–10 సెం.మీ. వ్యాసం పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు వైద్యంలో ఉపయోగపడుతున్నాయి. ఇది పడమటి కనుమలు లో లోతట్టు ఉష్ణమండల సతత హరిత అడవులలో విస్తృతంగా పెరుగుతున్నది. ఇది అరుదుగా ఆంధ్రా తీర ప్రాంతంలోని తూర్పు కనుమలలో ఉంది. ఇవి కేరళలోని పవిత్ర వనాలలో కూడా కనిపిస్తాయి. హిందీలో దీనిని సాధారణంగా కొక్కరాయ్ గా, తమిళంలో మిన్నారకోటి గా పిలుస్తారు. ఈ మొక్కను భారతదేశంలోని మధ్య, దక్షిణ భాగాలలో కూడా పండిస్తారు.[1]
Calycopteris floribunda | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. floribunda
|
Binomial name | |
Calycopteris floribunda |
ఇది బూడిదరంగు బెరడు, ఉపరితలంపై మందపాటి మెత్తని యున్ని కలిగిన కొమ్మలను కలిగి ఉంటుంది. కెరాటినస్ ఆకులు, అండాకార లేదా దీర్ఘ వృత్తాకారంగా 5-12 సెం.మీ. పొడవు ఉంటాయి. కొత్త కొమ్మలు వెంట్రుకల, తుప్పు రంగులో ఉంటాయి. పువ్వులు దట్టమైన సమూహాలతో ఉంటాయి. పూలకు రేకులు లేకుండా 10 కేసరాలు 2 చక్రాలలో అమర్చబడి ఉంటాయి.
ఉపయోగాలు
మార్చువేసవిలో ప్రవాహాలు ఎండిపోయినప్పుడు క్రమం తప్పకుండా ఈ తీగపై ఆధారపడే అటవీ జీవులు అడవి జామను ప్రాణ రక్షకుడిగా భావిస్తాయి. తీగలలో నిల్వ ఉన్న నీటి విభాగాలు, ప్రజలు తమ దాహాన్ని తీర్చడానికి తరచుగా ఉపయోగిస్తారు.
మూలాలు
మార్చు- ↑ Hepatoprotective Activity of Extracts from Stem of Calycopteris floribunda Lam. Against Carbon Tetrachloride Induced Toxicity in Rats M. Chinna Eswaraiah *, T. Satyanarayana