అణా
(అణాలు నుండి దారిమార్పు చెందింది)
అణా (హిందీ: आना ānā)(ఆంగ్లం: Anna) బ్రిటిష్ పాలనలోని మారక ద్రవ్య ప్రమాణం. ఒక రూపాయికి 16 అణాలు.[1] ఒక అణాకు 6 పైసలు. అర్దణా అనగా మూడు పైసలు. ఈ పద్ధతి స్వరాజ్యం వచ్చాక కూడా కొనసాగింది. 1957లో దశాంక విధానం అమలులోకి వచ్చినప్పుడు రూపాయికి 100 నయాపైసలు (కొత్త పైసలు)గా నిర్ణయించారు. 1964లో 'నయాపైస'ను 'పైస'గా పేరు మార్చారు. ఇప్పటికీ 25 పైసలను 'నాలుగు అణాలు' అనీ, 50 పైసలను 'ఎనిమిది అణాలు' అనీ వాడటం అనేక భాషల్లో కనబడుతుంది.
వాడకము; క్రింది నాణేలు వాటి మారకం చూడండి:
- 1/12 అణా (అణాలో 12వ భాగం లేదా దమ్మిడీ)
- 1/4 అణా (అణాలో 4వ భాగం, కానీ లేదా పావు అణా, బొమ్మలో చూపినది)
- 1/2 అణా (అణాలో సగభాగం లేదా పరక)
- అణా (6 పైసలు లేదా 1/16 రూపాయలు)
- 2 అణాలు (12 పైసలు లేదా బేడ)
- 1/4 రూపాయి (4 అణాలు లేదా పావలా)
- 1/2 రూపాయి (8 అణాలు లేదా అర్ధ రూపాయి)
వాడుక
మార్చుఅణా ఇప్పడు వాడుకలో లేదు.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- ↑ "Republic India Coinage". Archived from the original on 2015-03-24. Retrieved 2014-04-05.Accessed 14 July 2011.