పైసా

(పైస నుండి దారిమార్పు చెందింది)

పైసా : Paisa (Bengali: পয়সা, హిందీ: पैसा, Urdu: پیسہ) మాదకద్రవ్య ప్రమాణం. ఇది అనేక దేశాలలో వ్యవహరింపబడుతున్నది. బంగ్లాదేశ్లో పొయెషా (Bengali: পয়সা, బైసా (అరబ్బీ: بيسة‎, ఒమాన్). భారత్, నేపాల్, పాకిస్తాన్ లలో పైసా, రూపాయిలో 1⁄100 భాగం. బంగ్లాదేశ్ లో పోయెషా బంగ్లాదేశీ టాకాలో 1⁄100తో సమానం. ఒమాన్ లో బైసా ఒమానీ రియాల్ కు 1⁄1000 సమానం.

పదవ్యుత్పత్తి

మార్చు

పైసా అనే పదము, హిందీ, ఉర్దూ భాషా పదము. పావు-అణా అనే పదము సంస్కృతభాష పదము పదాంశ నుండి ఉద్భవించినది, అర్థము పాద=మూల, అంశ=భాగము.[1][2]

ఇది రూపాయిలోని అతిచిన్న మారక ద్రవ్య ప్రమాణం. ఒక రూపాయికి 100 పైసలు, 16 అణాలు. ఒక అణాకు 6 పైసలు. ఈ పద్ధతి స్వరాజ్యం వచ్చాక కూడా కొనసాగింది. 1957లో దశాంక విధానం అమలులోకి వచ్చినప్పుడు రూపాయికి 100 నయాపైసలుగా నిర్ణయించారు. 1964లో 'నయాపైస' (కొత్త పైస) ను 'పైస'గా పేరు మార్చారు. ఇప్పటికీ 25 పైసలను 'నాలుగు అణాలు' అనీ, 50 పైసలను 'ఎనిమిది అణాలు' అనీ వాడటం అనేక భాషల్లో కనబడుతుంది.

సాధారణ పద ఉపయోగం

మార్చు

హిందీ, ఆప్ఘన్ పర్షియన్, ఇతర భాషలలో "పైసా" అనగా డబ్బు లేదా నగదు. మధ్యయుగకాలపు వర్తకులు, అరేబియా వర్తకులు నగదును పైసాగా వ్యవహరించారు. అరేబియా సముద్రమార్గాన వర్తకం చేసేవారు, అరేబియా, ఆఫ్రికా, భారత్ తదితర ప్రదేశాలలో నగదును "పైసా"గా వ్యవహరించేవారు.[3] తూర్పు ఆఫ్రికాలోని స్వాహిలి భాషలో డబ్బును "పెసా" అని వ్యవహరిస్తారు.[3] ఇంకొక ఉదాహరణ కెన్యా దేశంలో మొబైల్ మూల డబ్బును ఎం.పైసా (మొబైల్ పైసా) గా వ్యవహరిస్తారు.

మాదకద్రవ్య ఉదాహరణలు

మార్చు

Here are examples of paisa:

మూలాలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. http://www.merriam-webster.com/dictionary/paisa
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-23. Retrieved 2013-11-24.
  3. 3.0 3.1 NADA: the Southern Rhodesia Native Affairs Department annual, Issue 30, Government of Southern Rhodesia, 1964, ... currency terms pesa, upeni, mali, khete, tickey all derive from Hindu or Arabic currency terms still in use in what was once called the Erythraean Sea ...

మూస:Historic Indian currency and coinage

"https://te.wikipedia.org/w/index.php?title=పైసా&oldid=2975003" నుండి వెలికితీశారు