అణు విద్యుత్ లేదా అణు శక్తి అనగా ఒక పదార్థం యొక్క అణువుల కేంద్రకాలను పట్టి ఉంచే ఒక శక్తి. అణువులు అంటే పదార్థాన్ని విడగొడుతూ పోతే చివరికి మిగిలే అతి సూక్ష్మమైన కణాలు. ప్రతి అణువుకు ఒక కేంద్రం ఉంటుంది. వీటిలోనే అణుశక్తి దాగి ఉంటుంది. కొన్ని రేడియో ధార్మిక పదార్థాలకు సంబంధించిన కొన్ని అణువులు ఈ శక్తినంతటినీ దాచుకోకుండా కొంత భాగాన్ని రేడియేషన్ రూపంలో బయటకు వెదజల్లుతూ ఉంటాయి. [1]

Ganges River near Narora Nuclear Power Plant UP India అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం

ఈ అణుశక్తిని వెలికితీయడానికి ప్రధానంగా రెండు పద్దతులున్నాయి. ఒకటి కేంద్రక విచ్ఛిత్తి మరొకటి కేంద్రక సంలీనం. కేంద్రక విచ్ఛిత్తి అంటే ఒక అణువును రెండుగా విడగొట్టడం. కేంద్రక సంలీనం అంటే రెండు అణువులను కలిపి ఒక అణువును తయారు చేయడం. ఈ రెండు పద్దతుల్లోనూ అపారమైన శక్తి విడుదలౌతుంది. ఈ ప్రక్రియ ప్రకృతి సిద్ధంగా కూడా జరుగుతుంది. ఉదాహరణకు సూర్యుడి నుంచి వేడిమి పుట్టడానికి కేంద్రక సంలీనమే కారణం. అణు విద్యుత్కేంద్రాలలో కేంద్రక విచ్చిత్తిని ఉపయోగించి విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ రెండూ ప్రక్రియలను అణ్వాయుధాల తయారీలో కూడా వాడతారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Nuclear Energy". Energy Education is an interactive curriculum supplement for secondary-school science students, funded by the U. S. Department of Energy and the Texas State Energy Conservation Office (SECO). U. S. Department of Energy and the Texas State Energy Conservation Office (SECO). July 2010. Archived from the original on 2011-02-26. Retrieved 2010-07-10.