అతి విశిష్ట సేవా పతకం

అతి విశిష్ట సేవా పతకం (AVSM) అనేది భారత సాయుధ దళాల లోని అన్ని శ్రేణులకు "అసాధారణమైన స్థాయిలో అందించిన విశిష్ట సేవలకు" గుర్తింపుగా ఇచ్చే సైనిక పురస్కారం. శాంతికాలానికి ఇచ్చే ఈ పతకం, యుద్ధసమయాలలో విశిష్ట సేవకు ఇచ్చే ఉత్తమ యుద్ధ సేవా పతకానికి సమానం.

Ati Vishisht Seva Medal


TypeMilitary award
Awarded forDistinguished Service
దేశం India
అందజేసినవారుIndia President of India
EstablishedJanuary 26, 1960
Precedence
Next (higher) Sarvottam Jeevan Raksha Padak[1]
Equivalent Uttam Yudh Seva Medal[1]
Next (lower) Vir Chakra[1]
అతి విశిష్ట సేవా పతకం


Typeసైనిక పతకం
Awarded forవిశిష్ట సేవకు
దేశం India
అందజేసినవారుIndia భారత రాష్ట్రపతి
Established1960 జనవరి 26
Precedence
Next (higher) సర్వోత్తమ జీవన రక్షా పతకం[1]
Equivalent ఉత్తమ యుద్ధ సేవా పతకం[1]
Next (lower) వీర చక్ర[1]

ఈ పతకాన్ని మరణానంతరం కూడా ఇవ్వవచ్చు. ఒకటి కంటే ఎక్కువ పురస్కారాలు ఇచ్చినపుడు తదుపరి పతకాలను రిబ్బన్‌పై ధరించే బార్ ద్వారా సూచిస్తారు. పతక గ్రహీత, తన పేరు తరువాత "AVSM" అని రాసుకోవచ్చు.

చరిత్ర

మార్చు

తొలుత, అతి విశిష్ట సేవా పతకాన్ని1960 జనవరి 26 న "విశిష్ట సేవా పతకం, క్లాస్ II" పేరుతో నెలకొల్పారు. అదే రోజున, సైన్య సేవా పతకం, సేనా పతకం, నవసేనా పతకం, వాయుసేనా పతకం అనే మరో ఐదు పతకాలను కూడా నెలకొల్పారు.[2] 1961 జనవరి 27 న దీని పేరు మార్చారు. 1980 నుండి పతక ప్రదానాన్ని ఆపరేషన్ల సేవకు పరిమితం చేసారు.[3]

డిజైన్

మార్చు

అతి విశిష్ట సేవా పతకాన్ని వెండి గిల్ట్‌తో తయారు చేస్తారు. దాని ముందు భాగంలో ఐదు కోణాల నక్షత్రం, వెనుకవైపున సింహ తలాటం ఉంటుంది. రిబ్బన్ బంగారు రంగులో, 32 మిమీ వెడల్పుతో, రెండు ముదురు నీలం చారలతో మూడు సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది.

ఒకటి కంటే ఎక్కువ అతి విశిష్ట సేవా పతకాలు వచ్చినపుడు అదనపు పతకాలను రిబ్బన్‌పై ధరించిన బార్ ద్వారా సూచిస్తారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. Retrieved 9 September 2014.
  2. "DESIGNS OF NEW SERVICE MEDAL AND THEIR DESIGNS" (PDF). archive.pib.gov.in. 29 July 1960. Retrieved 10 January 2022.
  3. Haynes, Ed. "Ati Vishisht Seva Medal". Archived from the original on 2007-08-20.