విశిష్ట సేవా పతకం
విశిష్ట సేవా పతకం, భారత సాయుధ దళాల్లోని అన్ని శ్రేణులకూ, "అత్యున్నత స్థాయి విశిష్ట సేవ"కు గుర్తింపునిస్తూ యోధులకు ఇచ్చే పతకం.
Vishisht Seva Medal | |
---|---|
Type | Military award |
Awarded for | Distinguished service, to all ranks of the armed forces |
దేశం | India |
అందజేసినవారు | President of India |
Established | 26 January 1960 |
Precedence | |
Next (higher) | Sena Medal (Army) Nau Sena Medal (Navy) Vayu Sena Medal (Air Force) |
Equivalent | Yudh Seva Medal |
Next (lower) | Uttam Jeevan Raksha Padak[1] |
విశిష్ట సేవా పతకం | |
---|---|
Type | సైనిక పతకం |
Awarded for | సాయుధ దళాల లోని శ్రేణులన్నిటికీ, విశిష్టమైన సేవకు గుర్తింపుగా |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | భారత రాష్ట్రపతి |
Established | 1960 జనవరి 26 |
Precedence | |
Next (higher) | సేనా పతకం (సైన్యం) నవసేనా పతకం (నావికాదళం) వాయుసేనా పతకం (వాయుసేన) |
Equivalent | Yudh Seva Medal |
Next (lower) | ఉత్తమ జీవన రక్షా పతకం[2] |
1980 నుండి, యుద్ధాలమాపరేషన్లలో అసాధారణమైన సేవలకు గుర్తింపుగా ఇచ్చేందుకు యుద్ధ సేవా పతకాన్ని ప్రవేశపెట్టారు.[3] అప్పటి నుండి విశిష్ట సేవా పతకాన్ని ఆపరేషనేతర సేవలకు మాత్రమే పరిమితం చేసారు.
చరిత్ర
మార్చువాస్తవానికి విశిష్ట సేవా పతకాన్ని 1960 జనవరి 26 న "విశిష్ట సేవా పతకం, క్లాస్ III" పేరుతో నెలకొల్పారు. అదే రోజున సైన్య సేవా పతకం, సేనా పతకం, నవసేనా పతకం, వాయుసేనా పతకం అనే మరో ఐదు పతకాలను కూడా నెలకొల్పారు.[4] 1961 జనవరి 27 న దీని పేరును మార్చారు.
అర్హత
మార్చుఈ పతకాన్ని మరణానంతరం కూడా ప్రదానం చేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ పతకాలు ఇచ్చిన సందర్భంలో తదుపరి పతకాలను రిబ్బన్‌పై ధరించిన పట్టీల ద్వారా సూచిస్తారు. ఈ పతకధారి తన పేరు చివర "VSM" అని పెట్టుకోవచ్చు. ఈ పతకాన్ని తొలుత "విశిష్ట సేవా పతకం, క్లాస్ III" అనే పేరుతో నెలకొల్పారు.[3] 1967 జనవరి 27 న దాన్ని ఇప్పటి పేరుకు మార్చారు. పతకం రూపం మారలేదు.
పతకరూపం
మార్చువిశిష్ట సేవా పతకం 35-మి.మీ వృత్తాకారంలో, మధ్యలో ఐదు కోణాల నక్షత్రంతో ఉంటుంది. నిటారైన పట్టీ నుండి వేలాడుతూ ఉంటుంది. జాతీయ చిహ్నంతో, హిందీలో "విశిష్ట సేవా పతకం" అని ఉంటుంది. రిబ్బన్ పసుపు రంగులో 32 మిమీ పొడవు ఉంటుంది, 2 మి.మీ. వెడల్పుతో ఉండే మూడు ముదురు నీలం చారలతో, నాలుగు సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. Retrieved 9 September 2014.
- ↑ "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. Retrieved 9 September 2014.
- ↑ 3.0 3.1 Ed Haynes. "Vishisht Seva Medal". Archived from the original on 2007-07-27. Retrieved 2024-09-24.
- ↑ "DESIGNS OF NEW SERVICE MEDAL AND THEIR DESIGNS" (PDF). archive.pib.gov.in. 29 July 1960. Retrieved 10 January 2022.