మేడి
(అత్తి నుండి దారిమార్పు చెందింది)
మేడి చెట్టు పెద్ద వృక్షం. ఇది మర్రిచెట్టును పోలి ఉంటుంది.
మేడి | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ఫై. రెసిమోసా
|
Binomial name | |
ఫైకస్ రెసిమోసా | |
Synonyms | |
Ficus glomerata Roxb. |
మేడిపండు
మార్చు- అంజూర ఫలం, అత్తిపండు, ఫిగ్, సీమ మేడిపండు... ఎలా పిలిచినా ఒకటే పండు. ఇది కంటికి చూడగానే ఆకట్టుకోదు. తీపి, పులుపు, వగరు కలిసి రుచి అంత అమోఘంగానూ ఉండదు. మిగతా పళ్లలా పెద్ద ప్రాచుర్యమూ, ప్రచారమూ లేదు. ధర చూడబోతే పెద్ద ఖరీదేమీ కాదు. కానీ జనం వీటిని చూడగానే కొనేద్దాం అనుకోరు. అయినా పాపం, ఈ పండు అవేవీ మనసులో పెట్టుకోదు. బోల్డన్ని పోషకాలు అందిస్తుంది. కనుక అందుకుని ఆదరించాల్సింది మనమే! పైగా దానివల్ల ప్రయోజనమూ మనకే!
- అంజూర పండే కాదు, ఎండువీ అంతే ఆరోగ్యం. ఇది అనేక స్వీట్లల్లో ఉపయోగిస్తారు.
- అంజూర్‌లో కొవ్వు, పిండిపదార్థాలు, సోడియం వంటివి తక్కువ.
- కానీ ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
- పాలు, పాల ఉత్పత్తులు ఇష్టపడనివారు వీటిని తీసుకుంటే శరీరానికి కావలసిన కేల్షియం, ఐరన్ అందుతాయి. అందుకే రక్తహీనతతో బాధపడేవారికి అంజూర్ తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు.
- కడుపులో మంట, అజీర్తి, పేగుపూత వంటివి తలెత్తకుండా అంజూర్ కాపాడుతుంది.
- ఇందులోని పొటాషియం గుండెకు సమస్యలు రానివ్వదు.
- రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది.
- బరువు తగ్గాలనుకునేవారు, ఎక్కువ ఆకలితో బాధపడేవారు అంజూర్ తినొచ్చు. ఈ పండులోని ఇనుము, కేల్షియం, ఫైబర్ ఆకలిని తగ్గిస్తాయి.
- నోటి దుర్వాసన గలవారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది.
- వీటి పై తొక్క గట్టిగా ఉంటుంది. ఇష్టంలేకుంటే వాటిని కాసేపు నీటిలో ఉంచి తొక్కతీసి తినొచ్చు.
- ఎండు అంజూర్ పళ్లలో మినరల్స్ అధికం. అవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి.
- వీటిలోని ట్రైప్టోఫాన్స్ చక్కగా నిద్ర పట్టడానికి సాయపడతాయి.
- ఎలర్జీ, దగ్గు, కఫం గలవారు ఈ పండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనిపిస్తుంది.
- ఈ పండులో ఉండే 'పెక్టిన్' అనే పదార్థం కొవ్వును అదుపులో ఉంచుతుంది.
చిత్రమాలిక
మార్చు-
అత్తి పండ్లు