అదితి సునీల్ తట్కరే

అదితి సునీల్ తట్కరే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు రాష్ట్ర పరిశ్రమలు, మైనింగ్, పర్యాటక, హార్టికల్చర్, క్రీడలు & యువజ సంక్షేమ, ప్రోటోకాల్, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్ శాఖల సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహించింది.[1]

అదితి తట్కరే

రాష్ట్ర పరిశ్రమలు, మైనింగ్, పర్యాటక, హార్టికల్చర్, క్రీడలు & యువజ సంక్షేమ, ప్రోటోకాల్, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్ శాఖల సహాయ మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు * రంజిత్ పాటిల్

రాయగఢ్ జిల్లా ఇంచార్జి మంత్రి
పదవీ కాలం
2020 – 2022
నియోజకవర్గం శ్రీవర్ధన్

ఎమ్మెల్యే
పదవీ కాలం
26 నవంబర్ 2019 – 29 జూన్ 2022
ముందు అవధూత్ తట్కరే
నియోజకవర్గం శ్రీవర్ధన్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
నివాసం రోహా

రాజకీయ జీవితం

మార్చు

అదితి సునీల్ తట్కరే తన తండ్రి సునీల్ తట్కరే అడుగుజాడల్లో 2012లో రాజకీయాల్లోకి వచ్చి ఎన్సీపీ యువజన విభాగంలో కీలకంగా పని చేసి రాయ్‌గఢ్ జిల్లా మండలి అధ్యక్షురాలిగా ఎన్నికైంది.[2] ఆమె 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ తరపున శ్రీవర్ధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి వినోద్ రామచంద్ర ఘోసల్కర్ పై 39621 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 30 డిసెంబర్ 2019న ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రాష్ట్ర పరిశ్రమలు, మైనింగ్, పర్యాటక, హార్టికల్చర్, క్రీడలు & యువజ సంక్షేమ, ప్రోటోకాల్, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్ శాఖల సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టి 29 జూన్ 2022 వరకు విధులు నిర్వహించింది.[3]

మూలాలు

మార్చు
  1. DNA India (5 January 2020). "Maharashtra government portfolios allocated: Full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2022. Retrieved 2 July 2022.
  2. BBC News తెలుగు (1 January 2020). "మహారాష్ట్ర: ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్‌లో వంశాధిపత్యం, మంత్రులుగా 21 మంది రాజకీయ వారసులు". Archived from the original on 2 July 2022. Retrieved 2 July 2022.
  3. Sakshi (17 January 2020). "ఇది కోటీశ్వరుల మంత్రిమండలి!". Archived from the original on 2 July 2022. Retrieved 2 July 2022.