అధిక ఉమ్మనీరు లేదా పాలీ హైడ్రామ్నియాస్ (Polyhydramnios) గర్భిణీ స్త్రీలలో కనిపించే పరిస్థితి.

అధిక ఉమ్మనీరు
ప్రత్యేకతప్రసూతిశాస్త్రం Edit this on Wikidata

ఈ స్థితిలో గర్భకోశంలో ఉమ్మనీరు అధికంగా ఉంటుంది. ఇది 0.2 to 1.6% మంది గర్భిణీ స్త్రీలలో కనిపిస్తుంది,[1][2],.[3] దీనిని స్కానింగ్ పరీక్షలో ఉమ్మనీరు సూచిక (Amniotic Fluid Index) 20 cm ( ≥ 20 cm) కన్నా ఎక్కువ ఉన్నప్పుడు గుర్తిస్తారు.[4][5]

దీనికి వ్యతిరేక పరిస్థితిని అల్ప ఉమ్మనీరు లేదా ఆలిగో హైడ్రామ్నియాస్ (Oligohydramnios) అంటారు.

అధిక ఉమ్మనీరు వుండే పరిస్థితులు

మార్చు

వ్యాధి లక్షణాలు

మార్చు
  • కడుపు చాలా పెద్దదిగా వుంటుంది.
  • ఆయాసం మూలంగా ఊపిరి అందక ఆమె కూర్చుని వుంటుంది.
  • కాళ్ళకు వాపులు, సిరలు పొంగడం, మూలవ్యాధి

వ్యాధి నిర్ధారణ

మార్చు

అల్ట్రాసౌండ్ స్కానింగ్ (Ultrasound scanning) పరీక్ష ద్వారా ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నదని నిర్ధారిస్తారు. అంతేకాక పుట్టబోయే బిడ్డకు వున్న అంగవైకల్యాల్ని, కవలలు వున్నారా అనే వివరాల్ని మరికొన్ని ముఖ్యమైన విషయాల్ని ఈ స్కానింగ్ తెలియజేస్తుంది. అందువలన ఈ పరీక్ష తప్పనిసరిగా చేయించాలి.

ప్రమాదాలు

మార్చు
  • గర్భవతిగా ప్రీ ఎక్లాంప్సియా రావడానికి, ముందుగానే మాయ విడిపోయి రక్తస్రావం కావడానికి, ఉమ్మనీటి సంచి పగిలి నెలలు నిండక మునుపే పురుడు రావడానికి అవకాశం ఉంటుంది.
  • నెలలు నిండక ముందే పురుడు రావడం, అంగవైకల్యాలు, బొడ్డుతాడు జారడం, అధిక రక్తస్రావం మొదలైన ప్రమాదాల వలన కడుపులో బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంటుంది.

మూలాలు

మార్చు
  1. Alexander, ES, Spitz, HB, Clark, RA. Sonography of polyhydramnios. AJR Am J Roentgenol 1982; 138:343
  2. Hill LM; Breckle R; Thomas ML; Fries JK, Polyhydramnios: ultrasonically detected prevalence and neonatal outcome, Obstet Gynecol 1987 Jan;69(1):21-5, PMID 3540761
  3. Hobbins JC; Grannum PA; Berkowitz RL; Silverman R; Mahoney MJ,Ultrasound in the diagnosis of congenital anomalies.,Am J Obstet Gynecol 1979 Jun 1;134(3):331-45., PMID 453266
  4. Rutherford SE; Phelan JP; Smith CV; Jacobs N, The four-quadrant assessment of amniotic fluid volume: an adjunct to antepartum fetal heart rate testing., Obstet Gynecol 1987 Sep;70(3 Pt 1):353-6.
  5. Clinical Management Guidelines for Obstetrician-Gynecologists, Number 55, September 2004.