అనన్య సేన్‌గుప్తా

అనన్య సేన్‌గుప్తా (జననం 1998, లక్నో) భారతీయ నటి. అనన్య రాజ్ అని కూడా పిలువబడుతుంది. 7 హవర్స్ టు గో (2016), ది ఫైనల్ ఎగ్జిట్ (2017), ఘోస్ట్ (2019) హిందీ చిత్రాలలో నటనకు ఆమె ప్రసిద్ధి చెందింది.[1] నవీన్‌ చంద్ర హీరోగా శ్రీనివాస రాజు తెరకెక్కించిన తగ్గేదే లే (2022) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు అనన్య సేన్‌గుప్తా దగ్గరైంది.[2]

అనన్య సేన్‌గుప్తా
జుహు, ముంబైలోని పివిఆర్‌లో ది ఫైనల్ ఎగ్జిట్ చిత్రం ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా అనన్య సేన్‌గుప్తా
జననం
అనన్య రాజ్

1998
జాతీయతఇండియన్
వృత్తిసినీనటి
క్రియాశీల సంవత్సరాలు2016 – ప్రస్తుతం

బాల్యం మార్చు

అనన్య సేన్‌గుప్తా 1998లో లక్నోలో పుట్టి ముంబైలో పెరిగింది.[3]

కెరీర్ మార్చు

అనన్య సేన్‌గుప్తా తన 12వ గ్రేడ్ చదువు తర్వాత యాక్టింగ్ స్కూల్‌లో చేరింది. దీంతో ఆమెలోని థియేటర్ గ్రూప్‌లో చేరాలనే తపన సాకారమైంది. ఆమె మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, చిత్రాలలోకి అడుగుపెట్టింది.[4] ఆమె మొదటి చిత్రం 2016లో వచ్చిన 7 అవర్స్ టు గో. ఎనిగ్మా, సిల్వర్ గాంధీ అనే లఘు చిత్రాలకు ఆమె గోల్డెన్ స్పారో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, పోర్ట్ బ్లెయిర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లలో వరుసగా బెస్ట్ యాక్టర్ అవార్డులను గెలుచుకుంది.[5]

ఫిల్మోగ్రఫీ మార్చు

సినిమాలు మార్చు

Year Film Language Director
2016 7 హవర్స్ టు గో హిందీ సౌరభ్ వర్మ
2017 ది ఫైనల్ ఎగ్జిట్ [6][7] ధ్వనిల్ మెహతా
2019 ఘోస్ట్ విక్రమ్ భట్
2021 సిల్వర్ గాంధీ అవినాష్ నందా, అభిమన్యు మిశ్రా
2022 తగ్గెదే లే[3] తెలుగు శ్రీనివాస్ రాజు
2022 మద్రాసీ గ్యాంగ్[8] తమిళం అజయ్ ఆండ్రూస్ నూతక్కి

సిరీస్/టీవీ షోలు మార్చు

  • సిటీ ఆఫ్ డ్రీమ్స్ (టీవీ సిరీస్)

మూలాలు మార్చు

  1. Sinha, Kumar Raviraj (2022-05-27). "Interview with actress Ananya Raj: Working in south film industry isn't easy like many people believe". National Herald (in ఇంగ్లీష్). Retrieved 2022-09-15.
  2. "Thaggedhele: ఆ హంతకులెవరు?". web.archive.org. 2022-11-10. Archived from the original on 2022-11-10. Retrieved 2022-11-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 "I'm thrilled to be making my debut in Telugu cinema with an intense thriller: Ananya Raj - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-15.
  4. "If given a choice, I would never have started my career as a horror film actress: Actress Ananya Sengupta". The New Indian Express. Retrieved 2022-09-15.
  5. "Actor Ananya Sengupta is all set for big-screen debut with Madrasi Gang". www.indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2022-09-15.
  6. Today, Telangana (2021-09-01). "Indians warming up to the horror genre: Actress Ananya Sengupta". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-09-15.
  7. Hungama, Bollywood (2017-09-18). ""The Final Exit is a supernatural thriller with a dash of horror" – Vishal Rana : Bollywood News - Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 2022-09-15.
  8. "Ananya Raj plays a slum girl in trilingual Madrasi Gang - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-15.