అనిత ఓ అనిత
అనిత ఓ అనిత అనే పాట ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇది ఒక ప్రైవేట్ పాట. కాని సినిమా పాట అంత విజయవంతం అయింది. ఈ పాట ఎవరు ఎప్పుడు వ్రాశారో తెలియదు. కాకపోతే నాగరాజు అనే వ్యక్తి రచించి, పాడారని అనేక ఛానల్లలో కార్యక్రమాల ప్రసారం జరిగింది. ఓ భగ్న ప్రేమికుడు తన ప్రియురాలిని ఊహించుకుని రాసిన పాటగా విశేష ప్రాచుర్యం పొందినది. యువత ఈ పాటను తమ మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకొనుటకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక చిత్రాలలో విలన్, ముఖ్య పాత్రలు చేసిన చరణ్ రాజ్ పాటను, రాసిన నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని అనితా ఓ అనితా యదార్థ ప్రేమ కథ అనే సినిమాను నిర్మించి, దర్శకత్వం కూడా వహించారు.
సాహిత్యం
మార్చు- నా ప్రాణమా నను వీడిపోకుమా
- నీ ప్రేమలో నను కరగనీకుమా
- పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
- వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది
- "అనిత అనితా
అనిత ఓ వనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేదప్రేమ పైనా