అనిల్‌కుమార్ సిన్హా

వీర చక్ర గ్రహీత

అనిల్‌కుమార్ సిన్హా ఒక భారతీయ పోలీసు అధికారి. బీహార్ కాడర్ లో 1979 లో ఐపిఎస్ కు ఎంపికయ్యాడు. 2014 డిసెంబరు 3న కేంద్ర దర్యాప్తు సంస్థ సంచాలకుడుగా నియమితుడై వార్తలలో నిలిచాడు.[3]

అనిల్‌కుమార్ సిన్హా
అనిల్ కుమార్ సిన్హా
జననం (1956-01-16) 1956 జనవరి 16 (వయసు 68)
విద్యాసంస్థహార్వర్డ్ విశ్వవిద్యాలయం[1]
పురస్కారాలుPolice medal for meritorious service in 2000 and the President's police medal for distinguished service in 2006[2]
Police career
ప్రస్తుత హోదాసంచాలకుడు.
విభాగముకేంద్ర దర్యాప్తు సంస్థ
దేశం India
Years of service1979 - ఇప్పటి వరకు
Rank1979: Commissioned as an Indian Police Service officer

నేపధ్యము

మార్చు

మానసిక శాస్త్రము (సైకాలజీ) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఏకే సిన్హా, హార్వర్డ్ వర్సిటీ విద్యార్థి. 2013లో సీబీఐ అధికారిగా చేరిన సిన్హా, గతంలో పలు ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ అదనపు కార్యదర్శిగా, బిహార్ అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ విభాగాల్లో పనిచేశారు. సీబీఐలో శారదా స్కాం సహా పలు ముఖ్య కేసులను పర్యవేక్షించారు. ప్రతిభావంతమైన సేవలకుగాను సిన్హాకు 2000లో పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకం లభించాయి. ఐపీఎస్ అధికారిగా 1979లో చేరిన సిన్హా 18 ఏళ్లు బిహార్‌లోని వివిధ జిల్లాలకు ఎస్పీగా, స్పెషల్ బ్రాంచ్ డీఐజీగా ఉన్నారు. 1998-2005 మధ్య కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లి, ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ) డీఐజీగా పనిచేశారు. 2005లో తిరిగి బిహార్ వెళ్లి అదనపు డీజీ హోదాలో పనిచేశారు. 2010లో తిరిగి డిప్యుటేషన్‌పై కేంద్రానికి వచ్చి విజిలెన్స్ కమిషన్ అదనపు కార్యదర్శిగా చేరి 2013 వరకూ కొనసాగారు. 2013 మేలో సీబీఐ స్పెషల్ డెరైక్టర్‌గా చేరారు.

మూలాలు

మార్చు
  1. "Anil Sinha Named New CBI Director","Affairscloud" , 3 December 2014.
  2. "SHRI ANIL KUMAR SINHA JOINS AS SPECIAL DIRECTOR, CBI" Archived 2013-06-10 at the Wayback Machine, "Cbi.nic.in"
  3. ""1979-batch IPS officer Anil Kumar Sinha takes over as the new CBI chief". indianexpress. indianexpress. 30 నవంబరు 2014. Retrieved 30 నవంబరు 2014.

బయటి లంకెలు

మార్చు