అనిల్ జోషియార

గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

అనిల్ భాయ్ జోషియార గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో 1995 నుండి 1997 వరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు.

డా. అనిల్ జోషియార

శాసనసభ్యుడు
పదవీ కాలం
2 మే 1995 – 14 మార్చి 2022
నియోజకవర్గం భిలోడ (ఎస్‌టీ) నియోజకవర్గం

ఆరోగ్య శాఖామంత్రి
పదవీ కాలం
1995 – 1997

వ్యక్తిగత వివరాలు

జననం (1953-04-24)1953 ఏప్రిల్ 24
చునా ఖాన్ గ్రామం, గుజరాత్, భారతదేశం
మరణం 2022 మార్చి 14(2022-03-14) (వయసు 68)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (1995–1996)
రాష్ట్రీయ జనతా పార్టీ (1996–1998)
సంతానం కేవల్ జోషియార
వృత్తి డాక్టర్ & రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

అనిల్ జోషియార గుజరాత్ రాష్ట్రం, చునా ఖాన్ గ్రామంలో 1953 ఏప్రిల్ 24న జన్మించాడు. ఆయన ఎంబిబిఎస్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

అనిల్ జోషియార రాష్ట్రీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున భిలోడ (ఎస్‌టీ) నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1995 నుంచి 1997 వరకూ రాష్ట్ర ఆరోగ్య & గిరిజన శాఖ మంత్రిగా పని చేశాడు.[1] ఆయన 1998 నుంచి 2000 వరకూ గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేశాడు. అనిల్ జోషియార భిలోడ నియోజకవర్గం నుంచి వరుసగా 2002, 2007, 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మరణం మార్చు

అనిల్ జోషియార కోవిడ్ అనంతర సమస్యలతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2022 మార్చి 14న మరణించాడు.[2][3]

మూలాలు మార్చు

  1. "Vaghela Adds 20 Ministers To Cabinet". Business Standard. 2 November 1996. Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.
  2. Nava Telangana (14 March 2022). "కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.
  3. Andhra Jyothy (14 March 2022). "గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.