అనుభవాలూ-జ్ఞాపకాలూనూ

అనుభవాలూ-జ్ఞాపకాలూనూ ప్రముఖ రచయిత, పత్రిక సంపాదకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రాసుకున్న ఆత్మకథ. ఈ పుస్తకంలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జీవితం, ఆయన రచనా వ్యాసంగం తదితర అంశాలతో పాటు ఆనాటి గోదావరి జిల్లాల నుడికారం, సమాజంలో పలు వర్గాల జీవనశైలి, జీవనవిధానం మొదలగు అంశాలు ప్రతిబింబిస్తాయి.

అనుభవాలూ-జ్ఞాపకాలూను
కృతికర్త: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఆత్మకథ
ప్రచురణ:
విడుదల:

రచన నేపథ్యంసవరించు

ఆత్మకథల్లో ఒక వ్యక్తి జీవితంతో పాటు స్థలకాలాలకు సంబంధించిన విలువైన చిత్రీకరణ ఉంటుంది. కానీ తెలుగు రచయితల్లో, నాయకుల్లో ఆత్మకథలు రాసే అలవాటు తక్కువ, మరీముఖ్యంగా 1950ల ముందు సమాజాన్ని చిత్రీకరించే ఆత్మకథలు ఇంకా అరుదు. ఈ నేపథ్యంలో అనుభవాలూ-జ్ఞాపకాలూనూ పుస్తకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ప్రచురణ వివరాలుసవరించు

రచనాకాలం నుంచి మొదలుకొని ఈ పుస్తకం వివిధ కాలాల్లో పలు ప్రచురణ సంస్థల ద్వారా ముద్రణ పొందింది.

 
రాజమండ్రిలో వేదగిరి రాంబాబు చే నెలకొల్పబడిన శ్రీపాద సుబ్రహ్మణ్యం విగ్రహం


2013లో ప్రగతి ప్రచురణ సంస్థ ద్వారా ప్రచురితమైన అనుభవాలూ-జ్ఞాపకాలూనూ 300రూపాయల ధరకు ప్రచురించారు.

విశేషాలుసవరించు

  • ఈయన చాలా రచనల్లో కనిపించే చెరకుపానకం, చెరకుపానకంతో చేసిన వంటకాల ప్రస్తావనకు ఇందులో వివరం లభిస్తుంది. రచయితకు చిన్నతనంలో చెరకుపానకం అంటే చాలా ఇష్టం. ఆయన తరచుగా స్నేహితులతో పొలాలకు చెరకుపానకం కొరకు వెల్లేవాడు.
  • ఈయన విద్యాబ్యాసం ఎక్కువగా వారాలుగా సామాన్యంగా నడిచింది. దానిని ఆయన ఎక్కువ నవలలో కథానాయకుడు దిగివస్థాయి నుండి వచ్చి విజయం సాధించినవాడుగా (క్షీరసాగరమథనం, వడ్లగింజలు) చూపిస్తారు.

అభిప్రాయాలుసవరించు

  • ఇది సాహిత్యచరిత్రలోనే అపురూపం. భారతీయ భాషల్లో నేను ఎరిగినంతవరకూ ఈరకం గ్రంథం లేదు. బంగాళీలో రవీంద్రుడు రాసిన చిన్న గ్రంథం ఉంది. అది యింగ్లీషులో కూడా అనువాదమయింది. అయితే, రవీంద్రుడి గ్రంథం వేరు, మనది వేరున్నూ. మనది అద్భుతం, అనన్యసామాన్యం. - పురిపండా అప్పలస్వామి
  • ‘పద్యంలోనే పసందు ఉం’దని అనుకునే ప్రాతకాలపు నమ్మకాలు శ్రీ శాస్త్రి గారి వచనరచనా సమీక్షలో సంస్కారం పొంది ‘గద్యమే హృద్య’మని ఘంటాపథంగా చాటి చెప్పుతారు. వారి ఉపజ్ఞా, ప్రతిభా, సారస్వతరంగానికి సమీచీన సందేశాలందిస్తాయి.’ - దీక్షిత దాసు
  • వారి అనుభవాలూ జ్ఞాపకాలు నిజానికి వలసతత్వంపై తెలుగులో వచ్చిన అతి గొప్ప నిశిత విమర్శయే కాక సాహిత్య వాజ్ఞ్మయ తత్త్వ మూలాలని భారత జాతుల భాషల సంస్కృతుల్లోంచి (సంగీతం గురించి వారి యోచనలు చూడండి) గ్రహించడానికీ సాహిత్య రచన యే సాధించగలుగుతుందని సూచించిన సూత్రీకరించిన గొప్ప తాత్త్విక ద్రష్ట రచన – మార్గదర్శకపు వాఙ్మయం - డి.వెంకట రావు (ఆశిష్ నంది వలసవాదంపై రాసిన ఇన్టిమేట్ ఎనిమీ అనువాదానికి ముందుమాటలో)

మూలాలుసవరించు