ఆత్మకథలు
ఆత్మకథ అనేది వ్యక్తులు తమ జీవిత విశేషాల గురించి తామే రాసుకునే సాహితీ ప్రక్రియ. తెలుగునాట పలువురు రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు ఎక్కువ గాను, ఇతరులు కొంత అరుదు గానూ ఆత్మకథలు రాశారు.
వ్యుత్పత్తి
మార్చుఆత్మ అనే పదానికి శరీరం కంటె భిన్నమై, శాశ్వతత్వం కలిగినదనే ఒక భావన; ‘నేను’ అనే భావన; సర్వావస్థల యందు అనుస్యూతంగా ఉండే తత్త్వం. పొత్తూరి వెంకటేశ్వరరావు రాసిన పారమార్థిక పదకోశంలో అర్థాన్ని ఇచ్చారు. బ్రౌణ్య తెలుగు ఆంగ్ల నిఘంటువులో జీవుడు, సెల్ఫ్ (స్వీయ/స్వ/తన), శరీరము, స్వభావము, బుద్ధి వంటి అర్థాలు ఇచ్చింది. ఐతే ఆత్మ కథ అన్న పదబంధంలో హైందవ పారమార్థిక అర్థం కాక తన లేదా స్వ అనే అర్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రక్రియ పేరు తన కథ అన్న భావం నుంచి వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తెలుగులో మొదట్లో వచ్చిన ఆత్మకథలను స్వీయ చరిత్రగా అభివర్ణించారు.
ప్రక్రియ లక్షణాలు
మార్చురకాలు
మార్చుఆత్మకథలు రెండురకాలు
- వ్యక్తులు తామే సొంతంగా రాసుకొనేవి
- వ్యక్తులు చెప్పగా వేరొకరు రాసేవి
కొన్ని ప్రసిద్ధ ఆత్మకథలు-రచయితలు
మార్చు- నా యెరుక - ఆదిభట్ల నారాయణదాసు - తెలుగులో రచించిన తొలి ఆత్మకథ
- కందుకూరి వీరేశలింగం స్వీయచరిత్రము - కందుకూరి వీరేశలింగం పంతులు - తెలుగులో తొలిగా ప్రచురణ పొందిన ఆత్మకథ
- హంపీ నుంచి హరప్పా దాక - తిరుమల రామచంద్ర - 2002లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన గ్రంథం
- శతపత్రము - గడియారం రామకృష్ణ శర్మ - 2007లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన గ్రంథం
- అనుభవాలూ-జ్ఞాపకాలూను - శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
- నా జీవిత యాత్ర - టంగుటూరి ప్రకాశం
- నా స్మృతిపథంలో - ఆచంట జానకీరాం
- కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయచరిత్ర - దువ్వూరి వేంకటరమణ శాస్త్రి
- యాది - సామల సదాశివ
- జీవనయానం - దాశరథి రంగాచార్య
- దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర - కొండా వెంకటప్పయ్య
- మారుతున్న సమాజం - నా జ్ఞాపకాలు - మామిడిపూడి వేంకటరంగయ్య
- సి. వి. కె. రావు ఆత్మకథ - సి. వి. కె. రావు
- విన్నంత కన్నంత - బూదరాజు రాధాకృష్ణ ఆత్మకథ
ఇవి కూడా చూడండి
మార్చు- ఏడిదము సత్యవతి - తెలుగులో ఆత్మకథ రాసిన తొలి మహిళ