అనువాద రమణీయం (పుస్తకం)
అనువాద రమణీయం ముళ్లపూడి వెంకటరమణ రాసిన సాహితీ సర్వస్వం. ఇది ఎనిమిదవ సంపుటం. సాహితీ సర్వస్వంలో ప్రస్తుతానికి ఇది చివరి సంపుటం. శ్రీ రమణ అనువాదశైలి గురించి పరిచయం చేసే ఈ సంపుటిలో '80 రోజుల్లో భూప్రదక్షిణం', 'పిటి 109' కనబడతాయి. మొదటిది జూల్స్‌వెర్న్ (1828-1905) రాసిన 1873 నాటి నవల. రెండోది 1961లో గ్రంధస్థం చేసిన రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన యదార్ధగాథ.[1]
అనువాద రమణీయం | |
కృతికర్త: | ముళ్ళపూడి వెంకటరమణ |
---|---|
బొమ్మలు: | బాపు |
ముద్రణల సంఖ్య: | రెండు |
అంకితం: | ఎంవీఎల్ |
ముఖచిత్ర కళాకారుడు: | బాపు |
దేశం: | భారతదేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | సాహితీ సర్వస్వము |
ప్రచురణ: | విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు |
విడుదల: | జూన్, 2006 |
ప్రచురణ మాధ్యమం: | సాహితీ సర్వస్వం |
పేజీలు: | 291 |
విశేషాలు
మార్చుఈ పుస్తకములో రెండున్నాయి.
1. జూల్స్ వెర్న్ 80 రోజుల్లో భూ ప్రదక్షణం. : '80 రోజుల్లో భూప్రదక్షిణం' కధాంశం ఓ పెద్ద మనిషి పందెం కాసి 80 రోజుల్లో భూమిచుట్టూ తిరిగిరావడం.
2. పి.టి 109 ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో కెనెడీ...: కెనెడీ అమెరికా అధ్యక్షుడైన తరుణంలో రాబర్ట్ డోనవాస్ అనే జర్నలిస్టు 'పిటి 109 - జాన్ ఎఫ్ కెనెడీ ఇన్ వరల్డ్ వార్ టూ' అనే పేరుతో ఓ పుస్తకం రాశాడు. కెనెడీకి ఆ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లామర్‌ని దృష్టిలో పెట్టుకుని అది పలుభాషల్లోకి అనువదితమైంది. కష్టసమయంలో ఓ లీడరు ఎలా వ్యవహరించాలో చెప్పే స్ఫూర్తిదాయకమైన గాథ ఇది.
ఇందులో మొదటిది ఒక మంచి నవల. చదువరులని అత్యంత ఉత్కంటతో చదివించ గలది.
మూలాలు
మార్చు- ↑ "Mullapudi Venkata Ramana Sahithi Sarwswam- 8 (Anuvadaramaneeyam) - ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వం -8 (అనువాద రమణీయం) by Mullapudi Venkata Ramana - Mullapudi Venkata Ramana Sahithi Sarwswam- 8 (Anuvadaramaneeyam)". anand books/ (in ఇంగ్లీష్). Archived from the original on 2021-01-17. Retrieved 2020-08-29.