అనుష్క శర్మ
అనుష్క శర్మ ఒక భారతీయ సినీ నటి. పలు విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించింది.
అనుష్క శర్మ | |
---|---|
జననం | అనుష్క శర్మ 1988 మే 1[1] |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, రూపదర్శి |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ఇప్పటి వరకు |
నేపధ్యము
మార్చుఆర్మీ ఆఫీసర్ కుమార్తె అయిన అనుష్కా శర్మ బాలీవుడ్లో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్క ముందుగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరుపులు మెరిపించింది. లాక్మేతో పాటు సిల్క్ అండ్ షైన్, విస్పర్, నాదెళ్ల జ్యూయలరీ, ఫియట్ పాలియో లాంటి బ్రాండ్లకు ఆమె మెడల్ గా వ్యవహరించింది. యష్ చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఆమె టాలెంట్ గుర్తించి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన తొలి అవకాశం ఇచ్చింది. 'రబ్ నే బనాదీ జోడీ' సినిమాలో ఆమె నటన విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తర్వాత మళ్లీ అదే సంస్థ రూపొందించిన బద్మాష్ కంపెనీలో అనుష్క నటించింది. 2010లో బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థతో ఆమె కాంట్రాక్టు పూర్తయింది. 2012లో మళ్లీ షారుక్ ఖాన్ తో సెకండ్ హీరోయిన్ గా 'జబ్ తక్ హై జాన్' చిత్రంలో ఆమె ప్రదర్శించిన నటనకు బాలీవుడ్ దాసోహమంది. ఈ మధ్యలో కూడా లేడీస్ వర్సెస్ విక్కీ బెహల్, మట్రూకీ బిజిలీకా మండోలా లాంటి సినిమాలతో తన ప్రతిభ నిరూపించుకుంది.
కుటుంబం
మార్చుతండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ భారత సైన్యంలో అధికారి. తల్లి ఆశిమా శర్మ గృహిణి.[2] పెద్దన్నయ్య కర్ణేష్ మర్చంట్ నేవీలో పనిచేస్తున్నాడు.[3] సైనిక పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి బెంగుళూరు లోని మౌంట్ కార్మల్ కళాశాల నుండి ఉన్నత విద్య పూర్తి చేసింది.[4] తర్వాత నటనావకాశాల కోసం ముంబైకి మకాం మార్చింది.
నటించిన చిత్రాలు
మార్చుసంవత్సరం | చిత్రం | పాత్ర | వివరాలు |
---|---|---|---|
2008 | రబ్ నే బనాదీ జోడీ | తాని సాహి | ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కార ప్రతిపాదన |
2010 | బద్మాష్ కంపెనీ | బుల్ బుల్ సింగ్ | |
2010 | బ్యాండ్ బాజా బారాత్ | శ్రుతి కక్కర్ | ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కార ప్రతిపాదన |
2011 | పటియాలా హౌస్ | సిమ్రన్ | |
2011 | లేడీస్ వర్సెస్ రిక్కి భెల్ | ఇషికా దేశాయ్ | |
2012 | జబ్ తక్ హై జాన్ | అకిరా రాయ్ | ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారము |
2013 | మాతృ కి బిజిలీ కా మండోలా | బిజిలీ మండోలా | |
2014 | పీకే | జగత్ జనని | |
2014 | బాంబే వెల్వెట్ | నిర్మాణంలో ఉన్నది (Filming begins in April 2013)[5] |
మూలాలు
మార్చు- ↑ "Wish Anushka Sharma a very Happy Birthday". Times of India. 29 April 2010. Archived from the original on 14 మే 2010. Retrieved 2011-02-20.
- ↑ "Walk The Talk with Anushka Sharma-ndtv".
- ↑ "Hardly ban-nered, Entertainment – Bollywood". Mumbai Mirror. 2009-03-24. Archived from the original on 2009-03-27. Retrieved 2010-06-24.
- ↑ "The Daily Mail – Daily News from Pakistan – Newspaper from Pakistan". Dailymailnews.com. Archived from the original on 2009-02-07. Retrieved 2010-06-24.
- ↑ http://filmfare.com/news/ranbiranushka-finalised-for-bombay-velvet-233.html
బయటిలంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనుష్క శర్మ పేజీ