పీకే

2014లో విడుదలైన హిందీ సినిమా

పీకే (తాగిన మైకంలో ఉన్నవాడు; eng: Tipsy ) 2014 డిసెంబరు 19న విడుదలై అద్భుత విజయాన్ని సాధించిన హిందీ చిత్రం

పీకే
PK
PK Theatrical Poster.jpg
చిత్ర ప్రచార చిత్రం
దర్శకత్వంరాజ్‌కుమార్ హిరాణి
నిర్మాతరాజ్‌కుమార్ హిరాణి
విధు వినోద్ చోప్రా
సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌
స్క్రీన్ ప్లేఅభిజత్ జోషి
రాజ్‌కుమార్ హిరాణి
నటులుఆమిర్ ఖాన్
అనుష్క శర్మ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
బొమన్ ఇరాని
సౌరభ్ శుక్లా
సంజయ్ దత్
సంగీతంఅజయ్ అతుల్
శంతను మొయిత్ర
అంకిత్ తివారి
ఛాయాగ్రహణంసి.కె.మురళీధరన్
కూర్పురాజ్‌కుమార్ హిరాణి
నిర్మాణ సంస్థ
పంపిణీదారుUTV Motion Pictures
విడుదల
19 డిసెంబరు 2014 (2014-12-19)
నిడివి
153 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
ఖర్చు85 crore (US$12 million) [2]
బాక్సాఫీసు92.50 crore (US$13 million)[3][4][5] 1st weekend collections.

కథసవరించు

పీకే అనగా తాగి మత్తెక్కినవాడు అని అర్ధం. కథానాయకుడి ప్రవర్తన విచిత్రంగా ఉండుట చేత అతనిని అందరు పీకే అని సంబోధిస్తారు. గ్రహాంతరవాసి పి కె (అమీర్‌ఖాన్‌) భూమ్మీదకి రాగానే తన రోదసీ నౌకకి సంకేతాలను పంపించే రిమోట్‌ని పోగొట్టుకుంటాడు. దానిని ఎక్కడ వెతకాలో, ఎవరిని అడిగితే దొరుకుతుందో తెలీక ఇబ్బంది పడుతోన్న పి కెకి అన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చేది భగవంతుడే అని తెలుస్తుంది. అయితే వందల కొద్దీ రూపాల్లో ఉన్న దేవుడిని ఎలా కొలవాలో, ఏ పద్ధతిలో ప్రసన్నం చేసుకోవాలో అర్థం కాదు. అతనికి టీవీ విలేఖరి జగత్‌జనని (అనుష్క శర్మ) సాయపడుతుంది. ఆమె సాయంతో పి కె తను పోగొట్టుకున్నది ఎలా తిరిగి సాధించుకున్నాడు, ఈ క్రమంలో అతనెలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ.


    • పీకె (చాలా బాగుంది) REVIEW BY ANDHRABHOOMI VENNELA ( RATING FOUR STARS)

తారాగణం: అమీర్‌ఖాన్, అనుష్కశర్మ, సంజయ్‌దత్, బొమన్ ఇరాని, సౌరబ్ శుక్లా, సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ తదితరులు సంగీతం: అతుల్ గోగవలె, శంతన్ మొయిత్రా నిర్మాత: విధు వినోద్ చోప్రా స్టోఠీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: రాజ్‌కుమార్ హిరాని

గుప్పిట మూసి చేయి చాస్తే -అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి చేతిని చూస్తున్న వాళ్లలో కలగడం సహజం. పికె సంచలనానికి అదే కారణం. రహస్యాన్ని -రహస్యం అని చెప్పకుండా ప్రమోషన్‌గా వాడేసుకుని ‘ఏకె-47’లా పేలాడు -పీకె. అందుకే -విడుదలకు ముందే పిచ్చి పాపులార్టీ వచ్చేసింది పీకేకి. కథ -సీక్రెట్. కథనం -సీక్రెట్. పాత్రలు -సీక్రెట్. ప్రతీదీ సీక్రెట్. తెలిసిందల్లా హీరో అమీర్‌ఖాన్. దర్శకుడు హిరాని. నిర్మాత వినోద్‌చోప్రా. సో.. అంచనాలు మరీ పెరిగిపోయాయి. ఎదురు చూసిన వాళ్లలో టెన్షన్‌ను పీక్‌కి పెంచేశారు. నిజానికి ఈ సినిమాకు హీరో -హిరాని. మున్నాభాయ్ ఎంబిబిఎస్‌లో వైద్య విధానాన్ని ప్రశ్నించాడు. లగే రహో మున్నాభాయ్ అంటూ గాంధీగిరిని ప్రస్తావించాడు. 3 ఇడియట్స్‌లో విద్యావిధానాన్ని నిలదీశాడు. ఇప్పుడు దొంగస్వాములు, బాబాలకు -పీకె 47 గురిపెట్టాడు. కధేంటి? గ్రహాలపైకి వ్యోమనౌకలు పంపి జీవరాశి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు మనిషి ఎప్పటినుంచో చేస్తున్నాడు. అందుకు భిన్నంగా -గ్రహంతర వాసి (అమీర్‌ఖాన్) భూమండలం మీదకొస్తే..? అతనొచ్చిన వ్యోమనౌక రిమోట్‌ను భూమీద పొగొట్టుకుంటే...? ఈ రెండు ప్రశ్నలు చాలు. మస్కిష్కంమీద కోటానుకోట్ల సన్నివేశాలు అల్లుకోవడానికి. దర్శకుడు హిరానీ చేసిన మాయ అదే. పచ్చలహారంలాంటి రిమోట్‌కై వెతుకులాట.. ఆ ప్రయత్నంలో గ్రహాంతరవాసికి ఎదురైన అనుభవాలు.. కనిపించిన భగవంతుడిని వెతికే ప్రయత్నంలో ‘మిస్సింగ్’లాంటి చమత్కారాలు.. గ్రహాంతరవాసి అమాయకత్వం చూసి పీకె హై క్యా (తాగొచ్చావా) అనే వెటకారాలు.. కథను పతాకస్థాయికి తీసుకుపోతాయి. టీవీ జర్నలిస్ట్ జగజ్జనని అలియాస్ జగ్గు పరిచయం, విచిత్రం అనిపించిన పీకేతో ప్రయాణం.. ఒక్కొక్కటిగా మనల్ని మరోలోకంలోకి లాక్కుపోతాయి. మనుషుల్లోని సవాలక్ష అవలక్షణాలు, కోణాలను -గ్రహాంతరవాసి అనువాల రూపంలో చూపించాలన్న ఆలోచనే వైవిద్యమైన కథకు ఆస్కారం వచ్చింది. దానికి బలమైన సన్నివేశాలను రాసుకుని -దర్శకుడు హిరాని పీకె 47 పేల్చాడు. అందరూ ఆరాధించే గాడ్‌మన్ (సౌరబ్ శుక్లా) దగ్గర రిమోట్ ఉన్నట్టు గుర్తించిన తరువాత -దాన్ని సంపాదించి తన గ్రహానికి తిరిగి వెళ్లేందుకు పీకే ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్న సన్నివేశాలతో సినిమా ముగుస్తుంది. ఈ ప్రయత్నాలు, ప్రయాణంలో భాగంగా -జగ్గు ప్రేమకథ, పీకెలో చిగురించే అనురాగంలాంటి సన్నివేశాలతో దర్శకుడు హిరాని గుండెకు తడి స్పర్శను అందించాడు. ముట్టుకుంటే భగ్గుమనే -మతపరమైన అంశాలను ప్రస్తావించే కథే అయినా ఎక్కడా దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు. కన్విన్స్‌డ్ డైలాగులతో నొప్పించకుండా వినోదాన్ని పండించి మార్కులు కొట్టేశాడు. వాస్తవానికి -ఇలాంటి ఆలోచనలతో చాలా సినిమాలే వచ్చాయి. ఎక్కడో నరకం నుంచి భూమికి దిగివచ్చి -ఇక్కడ ‘్భవిష్యవాణి’ని పొగొట్టుకుని వెతుక్కున్న ‘యమలీల’లు లాంటి కథే ఇది కూడా. కాకపోతే -ఇప్పటి వరకూ ఇలాంటి కథతో వచ్చిన సినిమాలు కామెడీకి పరిమితమైపోతే, భిన్నమైన కోణాన్ని వెతుక్కుని సామాజికాంశాన్ని ఇలాంటి కథతో చర్చించవచ్చన్న ఆలోచన దర్శకుడికి రావడం గ్రేట్. తన ఆలోచనను ప్రేక్షకుడికి కన్విన్స్ చేయడానికి పడిన తపన, కష్టం సినిమాలో కనిపిస్తుంది. ప్రతి ప్రాజెక్టులోనూ అమీర్‌కు ఓ ప్రత్యేకత ఉంటుంది. మామూలు మనిషిలా తయారైన గ్రహాంతరవాసి ఎలా ఉంటాడో -పీకెలో అమీర్ రుచి చూపించాడు. టైమింగ్‌తో ప్రతి సన్నివేశాన్నీ రక్తికట్టించాడు. బాలీవుడ్ సినిమాలు కోట్ల క్లబ్‌లకు ఎందుకు పరుగులు తీస్తున్నాయో -ఇలాంటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. సినిమా అంటే -ఐదు పాటలు, పది ఫైట్లు అనుకునే సగటు దర్శకులకు హిరానీ మరో పెద్ద బాలశిక్ష అందించాడు. చెప్పదలచుకున్న కథమీద నిబద్ధతతో పనిచేస్తే ఎంత గొప్పగా చెప్పవచ్చో పీకెతో రుచి చూపించాడు. పీకె గురించి చెప్పుకునే కంటే -తెరపై ఎలా పేలాడో చూస్తేనే బావుంటుంది.

తారాగణంసవరించు

 • అమీర్‌ఖాన్‌
 • అనుష్క శర్మ
 • సంజయ్‌ దత్‌
 • సౌరభ్‌ శుక్లా
 • సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌
 • బొమన్‌ ఇరానీ

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

 1. "Aamir Khan's PK cleared with UA certificate; makers won't host any special screenings". Bollywood Hungama. Retrieved 8 December 2014.
 2. "EXCLUSIVE: Aamir Khan's PK to fetch Rs. 85 crores from satellite rights sale". Bollywood Hangama. Retrieved 20 December 2014.
 3. "PK First Weekend Collection". Koimoi. Retrieved 22 December 2014.
 4. "PK First Day Territorial Breakdown". Box Office India. Retrieved 20 December 2014.
 5. "PK Has Very Good First Day". Box Office India. Archived from the original on 20 డిసెంబర్ 2014. Retrieved 20 December 2014.

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పీకే&oldid=2824012" నుండి వెలికితీశారు