అనుష్క సేన్
అనుష్క సేన్ (జననం 2002 ఆగస్టు 4)[1] భారతీయ టెలివిజన్ నటి, మోడల్. పిల్లల ఫాంటసీ షో బాల్ వీర్‌లో మెహర్ పాత్రను పోషించింది.[2] ఆమె టెలివిజన్ ధారావాహిక ఖూబ్ లడీ మర్దానీ - ఝాన్సీ కీ రాణిలో మణికర్ణికా రావు/రాణి లక్ష్మీ బాయి పాత్రలను పోషించింది.
అనుష్క సేన్ | |
---|---|
జననం | |
విద్య | ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్, ముంబై |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
|
వ్యక్తిగత జీవితం
మార్చురాంచీలో బెంగాలీ బైద్య కుటుంబంలో అనుష్క సేన్ జన్మించింది,[3] తర్వాత వారి కుటుంబం ముంబై మారింది. ఆమె కందివాలిలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది. కామర్స్ విద్యార్థిగా 12వ తరగతి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలో ఆమె 89.4% మార్కులు సాధించింది.[4] 2021 నాటికి, ఆమె ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో ఫిల్మోగ్రఫీలో డిగ్రీ చదువుతోంది.[5]
కెరీర్
మార్చుఆమె 2009లో జీ టీవీ సీరియల్ యహాన్ మైన్ ఘర్ ఘర్ ఖేలీతో బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. ఆమె మొదటి మ్యూజిక్ వీడియో హమ్కో హై ఆషా విడుదలైంది.[6] 2012లో, ఆమె టీవీ సీరియల్ బాల్ వీర్‌లో మెహర్ పాత్రను పోషించి పాపులర్ అయ్యింది. 2015లో, ఆమె బాలీవుడ్ చిత్రం క్రేజీ కక్కాడ్ ఫ్యామిలీలో నటించింది.
ఆమె టీవీ సీరియల్స్ ఇంటర్నెట్ వాలా లవ్, డెవాన్ కే దేవ్, మహదేవ్ లలో నటించింది. ఆమె పీరియాడికల్ డ్రామా ఫిల్మ్ లిహాఫ్: ది క్విల్ట్‌లో చేసింది. సమ్మదిత్తి అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా ఆమె నటించింది. 2020లో ఆమె అప్నా టైమ్ భీ ఆయేగా అనే టీవీ షోలో లీడ్‌గా ఉంది.[7] ఆమె అనేక మ్యూజిక్ వీడియోలలో కూడా చేసింది.
ఆమె 2019 సిరీస్ ఖూబ్ లాడీ మర్దానీ - ఝాన్సీ కి రాణిలో మణికర్ణికా రావు/రాణి లక్ష్మీ బాయి అనే చారిత్రక పాత్ర పోషించినందుకు ప్రసిద్ది చెందింది.[8]
మే 2021లో, ఆమె స్టంట్-ఆధారిత రియాలిటీ టీవీ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 11లో పాల్గొన్నది.[9] ఈ షోలో పార్టిసిపెంట్లలో అతి పిన్న వయస్కురాలు ఆమె.[10]
మూలాలు
మార్చు- ↑ "Anushka Sen celebrates 19th birthday in Udaipur". India Today. 4 August 2021. Retrieved 9 December 2021.
- ↑ Tripathi, Anuj (ed.). "'बालवीर' की छोटी बच्ची हो गई इतनी ग्लैमरस, PHOTOS देख पहचानना मुश्किल". Zee News. Retrieved 24 July 2022.
- ↑ "Anushka Sen Biography: Everything about the social media influencer and the youngest contestant of Khatron Ke Khiladi 11". jagrantv. Retrieved 11 November 2021.
- ↑ "Anushka Sen secures 89.4% in CBSE 12th standard exams". The Times of India. 14 July 2020. Retrieved 6 April 2021.
- ↑ Patowari, Farzana (26 January 2021). "Anushka Sen: It has resolved my attendance issues". The Times of India. Retrieved 5 May 2021.
- ↑ "Securing 89.4% in CBSE 12th grade to doing an ad with 'chachu' MS Dhoni; a look at lesser known facts about Baalveer's Anushka Sen". The Times of India. 15 July 2020. Retrieved 16 December 2022.
- ↑ Maheshwri, Neha (8 November 2020). "Anushka Sen replaced in 'Apna Time Bhi Aayega'". The Times of India. Retrieved 6 April 2021.
- ↑ "Anushka Sen to play the title role in 'Jhansi Ki Rani'". The Times of India. 7 January 2019.
- ↑ Keshri, Shweta (30 August 2021). "Anushka Sen gets eliminated from KKK 11, says lasting for 7 weeks is big". India Today. Retrieved 25 September 2021.
- ↑ "List of KKK 11 contestants". DNA India. 6 May 2021. Retrieved 12 May 2021.