అనుసాల్వుడు - సౌభపతి యైన సాల్వుని తమ్ముడు. సాల్వుని గృష్ణుడు చంపగా నీతడు కృష్ణుని నెట్లయినను జంప నిశ్చయించెను. ధర్మరా దశ్వమేధము జేయుసమయమున గృష్ణుడు కుటుంబసహితముగ హస్తినాపురమునకు రాగా నీతడు సేనాసమేతుడై వచ్చి హస్తినాపురపార్శ్వమున దాగియుండెను. ఒకనాడు కృష్ణుడును, పాండవులును అశ్వమును పరీక్షించుచున్న వారని విని యీతడచ్చటికి నెవ్వరికిని దెలియకుండ వచ్చి క్షణములో నశ్వమును తీసికొని పారిపోయెను. భీముడు సైన్యముతో వానిని దరిమికొని చనియె. ప్రద్యుమ్నుడు, వృషకేతుడును వానిని బట్టి తెచ్చెద మని ప్రతిఙ చేసి పోయిరి. ప్రద్యుమ్ను డోడెను. వృషకేతు డను సాల్వుని నోడించి, బంధించి కృష్ణునొద్దకు దెచ్చెను. వాడు కృష్ణునకు శరణు చొచ్చి, అశ్వమేధమునకు సాయము చేయుటకు నంగీకరించి స్వనగరమునకు బోయెను. (జైమినీయాశ్వమేధము., ఆ. 12-14).

అశ్వమేధ యాగం

వనరులు

మార్చు