హస్తినాపురం
?हस्तिनापुर హస్తినాపురం ఉత్తర ప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 29°10′N 78°01′E / 29.17°N 78.02°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 202 మీ (663 అడుగులు) |
జిల్లా (లు) | మీరట్ జిల్లా |
జనాభా | 21,248 (2001 నాటికి) |
కోడులు • పిన్‌కోడ్ |
• 250 404 |
హస్తినాపురం మహాభారతమునందు పేర్కొనబడిన ఒక పట్టణం. ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఉంది. ఢిల్లీ నుండి 110 కి.మీ, మీరట్ నుండి 37 కి.మీ దూరంలో ఉంది.
పురాణ ప్రాముఖ్యత
మార్చుపురాణకాలమునందు హస్తినాపురం కురువంశపు రాజుల రాజధానిగా ఉండేది. మహాభారతంలోని సంఘటనల్లో చాలావరకూ హస్తినాపురమునందే జరిగాయి. హైందవ గ్రంథాలలో దీని మొదటి ప్రస్తావన చంద్రవంశపు రాజైన భరతుని రాజధానిగా వస్తుంది.
మధ్యయుగ కాలంలో బాబర్ భారతదేశంపై దండెత్తినపుడు హస్తినాపురంపైన కూడా దాడి జరిగింది. దేవాలయాలపై ఫిరంగులు గురిపెట్టబడ్డాయి. తదనంతర కాలంలో గుజ్జర్ కులస్థుడైన రాజా నయన్ సింగ్ నాగర్ హస్తినాపురాన్ని పరిపాలించాడు. ఇతని హయాంలో హస్తినాపురం, పరిసర ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించబడ్డాయి.
జనాభా వివరాలు
మార్చుప్రస్తుతం హస్తినాపురం పట్టణం 21,248 (2001 లెక్కలు) జనాభాతో నగర పంచాయతీగా ఉంది. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. అక్షరాస్యత 68%.
దర్శనీయ స్థలాలు
మార్చుదిగంబర జైన బాబా మందిరం, జంబూద్వీప్, కైలాస్ పర్వత్, పాండేశ్వర్ గుడి ముఖ్యమైన గుళ్ళు.
చరిత్ర
మార్చుహస్థినాపురం (సంస్కృతం) నగరం కురువంశానికి మూలపురుషుడైన హస్థిచేత స్థాపించబడిందని మహాభారతం వివరిస్తుంది.[1] ఈ నగరాన్ని గజపుర్, నాగ్‌పుర్, ఆశందివత్, బ్రహ్మస్థల్, శాంతి నగర్, కుంజర్పుర్ అని పురాణాలలో వర్ణించారు.
హస్థినాపురం కురువంశ సామ్రాజ్య రాజధాని. మహాభారతంలో ఉన్న సంఘటనలన్నీ హస్థినాపురంలో జరిగాయని ఇతిహాస కథనాల ఆధారంగా విశ్వసించబడుతుంది. శకుంతలా దుష్యంతుల కుమారుడైన భరతుడు హస్థినాపురాన్ని రాజధానిగా చేసుకున్నట్లు పురాణకథనాలు వివరిస్తున్నాయి. ఆశోకచక్రవర్తి మనుమడైన సంప్రాతి చక్రవర్తి తన పరిపాలనా సమయంలో ఇక్కడ అనేక దేవాలయాలు నిర్మించాడు. అయినప్పటికీ ప్రస్తుతం ఆ స్థూపాలు, ఆలయాలు శిథిలమైయ్యాయి. డిరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బి.బి. లాల్ ఆధ్వర్యంలో హస్థినాపురంలో త్రవ్వకాలు నిర్వహించబడ్డాయి. ఆయన సర్వేలో బయటపడిన చిత్రీకరిచబడిన బూడిదరంగు పాత్రలు ఇక్కడ చరిత్ర ఆరంభకాలంలో వ్యాపారరీతిలో సెరామిక్ పాత్రలు తయారుచెయ్యబడ్డాయని తెలియజేస్తున్నాయి. హస్థినాపురం పరిశోధనలలో మహాభారత కథనానికి సంబంధించిన వస్తువులు బయటపడలేదు. అయినప్పటికీ ఇక్కడ అభించిన సెరామిక్ పాత్రలు గంగానదీతీరానికి వచ్చి స్థిరపడిన ఆర్యుల కాలం నాటివని భావిస్తున్నారు.[2] హస్థినాపురం ప్రాచీన చరిత్ర మాత్రం ఇంకా ఆధారపూర్వకంగా నిర్ధారించవడలేదు. ఇక్కడ పురావస్తుపరుశోధన పూర్తి స్థాయిలో నిర్వహించవలసిన అవసరం ఉంది. మొగలులు హిందూస్థాన్ ప్రవేశం సమయంలో హస్థినాపురం బాబర్ చేత ఆక్రమించబడింది. ఆసమయంలో ఆలయాలు, స్థూపాలు ఫిరంగులతో ధ్వంసం చేయబడ్డాయి. ఆంగ్లేయుల కాలంలో హస్థినాపురం గుజ్జర్ రాజు నయన్ సింగ్ నాగర్ పాలనలో ఉంటూ వచ్చింది. ఆయన పరిపాలనా కాలంలో హస్థినాపురం పరిసర ప్రాంతాలలో పలు ఆలయాలు నిర్మించబడ్డాయి.[3]
సమీపప్రదేశాలు
మార్చు- బులంద్ షహర్:-
బులంద్‌షహర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బులంద్‌షహర్ జిల్లాలో ఉన్న ఒక నగరం. అంతేకాకుండా పరిపాలక రాజధానిగా కూడా ఉంది. ఈ ప్రాంతంలో మహాభారతం కాలంనాటి వారసత్వ మూలాలను కనుగొన్నారు. ఇక్కడ నిర్వహించిన అనేక త్రవ్వకాలలో దొరికిన పురాతన నాణేలు, కళాఖండాలు ప్రస్తుతం లక్నో మ్యూజియంలో సంరక్షింపబడుతున్నాయి.
- నోయిడా:-
నోయిడా చుట్టు పక్కల గల పర్యాటక స్థలాలు: నోయిడాలో ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయ వృద్ధి రేటు సాధించింది. ఇంకా ఇంటర్నేషనల్ రిక్రియేషన్ పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, యూనీటెక్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు "వరల్డ్స్ ఆఫ్ వండర్ "లాంటి వి కూడా వచ్చాయి. నోయిడా లో ఉన్న గ్రేట్ ఇండియన్ ప్లేస్ ఉత్తర భారదేశంలో కెల్లా పెద్దది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన అన్ని బ్రాండ్ల దుకాణాలు దీనిలో కొలువు దీరాయి. ఇంకా అనేక వినోదాత్మక కేంద్రాలు, మల్టీప్లెక్స్లు కూడా ఉన్నాయి.
- సహారన్‍పూర్:-
సహారన్‍పూర్ లోని పురాతన ఆలయాలు, శాకంబరి దేవి ఆలయం బాల సుందరి ఆలయం(శక్తి పీఠాలు) చూసేందుకు పర్యాటకులు ఇక్కడకు వస్తారు. నౌగాజాపీర్ కు భక్తులు తమ కోరికలు తీర్చుకునేందుకు ప్రత్యేకంగా వస్తారు. ఇక్కడ దేవాలయాలు మాత్రమే కాక పురాతన కాలానికి చెందిన అనేక బ్రిటిష్ భవనాలు కూడా కలవు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్థాపించిన బొటానికల్ గార్డెన్స్ ప్రసిద్ధి చెందినవి. దీనిలో ఒక రీసెర్చ్ సెంటర్ కూడా కలదు. ప్రశాంతమైన అంబేద్కర్ పార్క్ మరొక ఆకర్షణ.
- మొరాదాబాద్:-
ఆలీఘర్ పట్టణం ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘర్ జిల్లాలో అత్యధిక జనాభా కల ఒక పట్టణం. ఈపట్టణం ప్రధానంగా విద్యాభివృద్ధి సాధించి అనేక విద్యా సంస్థలు కలిగి వుంది. ప్రసిద్ధి చెందిన ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కూడా ఇక్కడ కలదు. అలీ ఘర్ చరిత్ర చాలా పెద్దది. ఇక్కడ బ్రిటిష్ వారికి , ఫ్రెంచ్ వారికి మధ్య అల్లి ఘుర్ యుద్ధం జరిగింది. అలీ ఘర్ ను పూర్వం లో ఇక్కడి తెగల పేరుతో కోల్ అని పిలిచేవారు. అయితే, ఇంకా ఒక ఋషి లేదా రాక్షసుడి పేరు వచ్చిందని కూడా కొన్ని కథనాలు కలవు. మొగలుల రాజు ఇబ్రహీం లోడి పాలనలో కోల్ గవర్నర్ ఉమర్ కుమారుడు మహమ్మద్ ఇక్కడ ఒక కోటను నిర్మించాడు. ఆ కోట నేటికి ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఆ కోట ఆలీఘర్ కోటగా పిలువబడుతోంది. కాలానుగుణంగా ఈ ప్రాంతం అనేక మంది రాజుల పాలనలోకి వచ్చి, అనేక పేర్లతో పిలువబడి, చివరికి అలీ ఘర్ గా మారింది.
- అలీఘర్:-
మురాదాబాద్ భారతదేశంలోని ఇత్తడి పరిశ్రమకు కేంద్రం, అందువలన దీనికి పిటల్ నగరి లేదా ‘సిటీ ఆఫ్ బ్రాస్’ అనే ముద్దుపేరు ఉంది.. ఇత్తడి పరిశ్రమే కాకుండా, మొరాదాబాద్ అనేక ప్రదేశాలను కూడా సందర్శకులకు అందిస్తుంది. భారతదేశం లోని ఇతర నగరాలూ, పట్టణాల వలె, ఆలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలు సమాజాన్ని పటిష్ఠంగా ఉంచుతున్నాయి. ఇక్కడ సీతా ఆలయం పెద్ద హనుమంతుడి ఆలయం, చదౌసి – కుంజ్ బిహారి ఆలయం, సాయి ఆలయం పాటలేశ్వర్ ఆలయం శని దేవుని ఆలయం తోపాటు కొన్ని ప్రధాన ఆలయాలు కూడా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో మొఘల్ వంశానికి చెందిన అనేక స్మరకలు నిర్దిష్ట కాల సాక్ష్యాలుగా నిలబడ్డాయి. వాటిలో నజిబుదౌలా ఫోర్ట్ మందవర్ మహల్, జామా మసీదు అత్యంత ప్రసిద్ధి చెందినవి.
- బరేలీ:-
బరేలి - ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం ఇది ఉత్తర ప్రదేశ్ లోని బరేలి జిల్లాలో ఉంది. ఇది ఉత్తర భారతదేశంలో ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. ఈ నగరంలో అనేక దేవాలయాలు, మతపరమైన స్థలాలు ఉన్నాయి. ఇది రామగంగా నది ఒడ్డున ఉంది. ఈ నగరం కొన్ని ఆసక్తికరమైన మ్యూజియాలు, వినోద పార్కులు నిలయంగా ఉంది.బరేలి కేన్ ఫర్నిచర్ తయారీకి ముఖ్య కేంద్రంగా ఉంది. ఈ నగరాన్ని బాన్స్-బరేలి అని కూడా పిలుస్తారు. బాన్స్ అంటే కేన్ అని అర్థం, ఈ నగరానికి దీనిమూలంగా ఈ పేరు రాలేదు, కాని జగత్ సింగ్ కతెహ్రియ పుత్రులు బన్సల్దెవ్, బరల్దేవ్ 1537 లో ఈ నగరాన్ని కనుగొనటంవలన ఈ పేరు వొచ్చింది.
- మధుర:-
యమునా నది ఒడ్డున కల మధుర భారతీయ సంస్కృతి, నాగరికతలకు కేంద్రంగా వుంటుంది.. ఈ దేశంలో చాలా మంది ప్రశాంత జీవనానికి ఇక్కడ కల ఆశ్రమాలకు వచ్చి ఆనందిస్తారు. మధురను హిందువులే కాదు, బౌద్ధులు, జైనులు కూడా పవిత్రంగా భావిస్తారు.ఇక్కడకల శ్రీ కృష్ణ జన్మ భూమి టెంపుల్ చాలా పవిత్రంగా భావిస్తారు. మధుర ఆకర్షణ అంతా కృష్ణుడితో ముడిపడి ఉంది.
- బృందావన్:-
బృందావనం అనేది కృష్ణుడు యమునా నది ఒడ్డున తన బాల్యం గడిపిన ప్రదేశము. ఇక్కడ హిందువులు పూజలు చేస్తారు. ఈ బృందావనంలో రాధ మీద ఉన్న ప్రేమను దివ్య నృత్యంతో చేసిన రాసలీలల ద్వారా చెప్పెను. గోపికలు స్నానము చేస్తుంటే వారి బట్టలు దొంగిలించేను. అంతే కాకుండా అనేక రాక్షసులను నాశనం చేసెను. బృందావనం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రము, దాని గొప్పతనాన్ని చాటిచెప్పే 5000 దేవాలయాలు ఇక్కడ ఉండటము గొప్ప ఆశ్చర్యమునకు గురి చేస్తుంది.
- గోవర్ధన గిరి:-
మథురకు సమీపంలో ఉన్న గోవర్ధన గిరి హిందువులకు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము.ఒక పురాణం ప్రకారం ఈ గోవర్ధన గిరి కృష్ణుడు యొక్క దైవలీలలో భాగంగా స్వర్గం నుండి భూమి మీదకు వచ్చినది అని నమ్ముతారు. అంతేకాక ఈ ప్రదేశముతో కృష్ణుడుకి సంబంధం ఉందని నమ్ముతారు. మరొక పురాణం ప్రకారం ఒకసారి కుండపోత వర్షాలు పడుతున్న సమయంలో కృష్ణుడు పర్వతాన్ని ఎత్తి వరుసగా ఏడు రోజుల పాటు తన చేతులతో పట్టుకోవడం ద్వారా ప్రజలను కాపాడెను.
- ఫిలిఖిత్:-
మథురకు సమీపంలో ఉన్న గోవర్ధన గిరి హిందువులకు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము.ఒక పురాణం ప్రకారం ఈ గోవర్ధన గిరి కృష్ణుడు యొక్క దైవలీలలో భాగంగా స్వర్గం నుండి భూమి మీదకు వచ్చినది అని నమ్ముతారు. అంతేకాక ఈ ప్రదేశముతో కృష్ణుడుకి సంబంధం ఉందని నమ్ముతారు. మరొక పురాణం ప్రకారం ఒకసారి కుండపోత వర్షాలు పడుతున్న సమయంలో కృష్ణుడు పర్వతాన్ని ఎత్తి వరుసగా ఏడు రోజుల పాటు తన చేతులతో పట్టుకోవడం ద్వారా ప్రజలను కాపాడెను.
- ఆగ్రా:-
అత్యద్భుతమైన తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. ఇది ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో, ఢిల్లీ నుండి 200 కి. మీ. దూరంలో ఉంది. ఆగ్రాలో అత్యద్భుతమైన తాజ్ మహల్ కాకుండా, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ అనే రెండు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఆగ్రా చరిత్ర దాదాపు 11 వ శతాబ్దంలో ప్రారంభమయింది. దాని చరిత్ర కాలంలో, ఆగ్రా, హిందూ, ముస్లిం మత పాలకుల మధ్య చేతులు మారింది, అందువలన రెండు సంస్కృతుల ముద్రలు దుస్తుల నేత నేసినట్లుగా ఉంటాయి.
- ఫతేపూర్ సిక్రీ:-
16 వ శతాబ్దంలో 1571, 1583 ల మధ్య మొఘల్ చక్రవర్తి అక్బర్ ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా దగ్గరగా నిర్మించిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతం ఫతేపూర్ సిక్రి మొఘల్ సంస్కృతి, నాగరికతలకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక్కడే షేక్ సలీం చిష్తి సన్యాసి అక్బర్కి కుమారుడు జన్మిస్తాడని జోస్యం చెప్పాడు. భారత పట్టణ ప్రణాళిక విధాన భావన వలన ప్రభావితమైన విషయం షాజహానాబాద్ (పాత ఢిల్లీ) లో బాగా ప్రదర్శించబడింది.
- ధుధ్వా :-
ఈ ప్రాంతం హిమాలయాలకు సమీపంగా ఉత్తర క్ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులలో ఉంది. ఈ పార్క్ లఖింపూర్ – ఖేరి జిల్లాలో ఇండియా – నేపాల్ సరి హద్దులలో ఉంది. ఈ భూమి పై అంతరించి పోతున్న పర్యావరణ ప్రదేశాలలో ఒకటైన తెరాయి ప్రాంతంలో దుధ్వా ఒకటి.
- మీరట్ :-
ఉత్తర ప్రదేశ్ లో మీరట్ నగరం ప్రపంచంలో 63 వ అత్యంత వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలు, భారతదేశంలో 14 వ వేగంగా అభివృద్ధి చెందుతున్న మీరట్ నగరం. ఈ నగరం కూడా ఉత్తర భారతదేశంలో అతిపెద్ద సైన్యం శిబిరాల్లో ఒకటి, అనేక పారిశ్రామిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఇది ప్రపంచంలో దేశం, సైకిల్ రిక్షా, క్రీడ, వస్తువులు, సంగీత సాధన పరికరాలకు అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా ఉంది.
ప్రస్థుత ఉన్న ప్రదేశం
మార్చుప్రస్తుత హస్థినాపురం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని డోయబ్ భూభాగంలో ఉంది. మీరట్‌కు 37 కిలోమీటర్లదూరలో తూర్పు డిల్లీ నుండి నేషనల్ హైవే మార్గంలో 106 కిలోమీటర్ల దూరంలో ఉంది. హస్థినాపురం తిరిగి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో 1949 ఫిబ్రవరి మాసంలో తిరిగి స్థాపించబడిన చిన్న ఊరు.
భౌగోళికం
మార్చుహస్తినాపురం సముద్రమట్టానికి 202 మీటర్ల ఎత్తులో ఉంది. ఉత్తరప్రదేశ్ లోని ఇతర ప్రదేశాలలో ఉన్న మాదిరిగానే హస్థినాపురం వాతావరణం ఉంటుంది. మార్చి నుండి మే మాసంవరకు వేసవికాలం ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రత 32°-40 ° సెంటిగ్రేడ్ ఉంటుంది. జూలై- సెప్టెంబరు మాసాలలో వర్షపాతం ఉంటుంది. వర్షాకాలంలో ఉష్ణోగ్రత తాకూవగా ఉంటుంది. డిసెంబరు- ఫిబ్రవరి మాసాలలో శీతాకాలం కొనసాగుతుంది. సంవత్సరం మొత్తంలో డిసెంబరు మాసంలో చలి అధికంగా ఉంటుంది. శీతాకాలం ఉష్ణోగ్రతలు 4°-12° వరకు ఉంటుంది.
జనసంఖ్య
మార్చు2001 గణణ్కాలను అనుసరించి హస్థినాపురం జనసంఖ్య 21,248. పురుషుల శాతం, 53%. స్త్రీల శాతం 47%. హస్థినాపురం అక్షరాస్యత శాతం 68%. జాతీయ అక్షరాస్యతా శాతం అయిన 59.5% కంటే ఇది అధికం.జనసంఖ్యలో 15% పది సంవత్సరాలకంటే పిన్న వయస్కులు.
చూడవలసిన ప్రదేశాలు
మార్చుహస్థినాపురం శిథిలాలలో ఉన్న పవ్డవేశ్వర్ శివాలయం. ఈ శిథిలాలలోని చిన్న కొండమీద ఒక కాళీ శిల్పం, పలు ఆస్రమాలు ఉన్నాయి. లోయలో గంగానదీ తీరంలో కర్ణుని ఆసలయం ఉంది. ఈ ఆలయం లోని శివలింగాన్ని కర్ణుడు ప్రతిష్ఠించి ఆరాధించాడని విశ్వసించబడుతుంది.
శ్రీ దిగంబర్ జైనమందిరం
మార్చుహస్థినాపురంలో ఉన్న శ్రీ దిగంబర జైన మందిరం చాలా పురాతనమైనది. 1801 జూన్ మాససంలో లాలా జైకుమార్ మాల్ పర్యవేక్షణలో రాజా హర్‌షుక్ రాయ్ నిర్మించాడు. జైన మందిరంలో ప్రధాన దైవం పద్మాసనంలో ఉన్న 16వ జైనతీర్ధంకర్ అయిన శాంతినాధ్ శిలామూర్తి. అదనంగా 17వ, 18వ తీర్ధంకర్ శిలామూర్తులు, శ్రీకుంతునాథ్, శ్రీఅర్నాథ్ శిలామూర్తులు ఉన్నాయి. ఆలయంలో దజన్లకొద్దీ ఉపాయాలు, ఙాపక చిహ్నాలు ఉన్నాయి. ఇవి అనేకంగా 20వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. శ్రీ దిగంబర్ జైనమందిరం ఆలయంలో భక్తులకు అత్యున్నత వసతిగృహాలు ఉన్నాయి. జైన భక్తులకు అచ్చమైన శాకాహార భోజనం లభిస్తుంది. ఆలయంలో తపాలా కార్యాలయం, పోలీస్ సబ్-స్టేషను, జైన్ గురుకులం, ఉదాసీన్ అస్రమం ఉన్నాయి. సమీపంలో పర్యాటక ఆకర్షణలు అధికంగా ఉన్నాయి. జాల్ మందిర్, జైన్ లైబ్రరీ, ఆచార్య విద్యానంద్ మ్యూజియం, 24 కోనేర్లు ఉన్నాయి.
కైలాస మందిరం
మార్చుహస్థినాపుర్ లోని శ్రీ దిగంబర్ జైన్ మందిర్ సంరక్షణలో కైలాస్ పర్వతం ఎత్తు131 అడుగులు. 2006 ఏప్రిల్‌లో కైలాస్ పర్వత్ పంచకల్యాణక్ ప్రతిష్ఠ మహోత్సవం రూపుదిద్దుకున్నాయి. కైలాస్ పర్వత్ ఆలయ ఆవరణలో అనేక జైన ఉపాలయాలు ఉన్నాయి. కైలాస్ పర్వత్‌లోయాత్రినివాస్, భోజనశాల, అడిటోరియం, హెలిపాడ్, అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.
జంబుద్వీప్
మార్చుశ్రీగ్యానతి మాతాజీ పర్యవేక్షణలో నిర్మించబడిన జైన భౌగోళిక స్వరూపం ప్రతిబింబించే అధ్భుతనిర్మాణమే జంబూద్వీప్. ఆలయ ఆవరణలో సుమేరు పర్వత్, తీన్ మూర్తి మందిర్, ద్యానమందిరం, తీన్ లోక్ రచనా, ఇతర పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.
శ్రీశ్వేతాంబర్ జైన ఆలయం
మార్చుశ్వేతాంబర అలయం సమీపకాలంలో పునరుద్ధరినచబడ్డాయి. అలాగే 2021 మార్గశీర్ష శుక్ల పక్షంలో తిరిగి విస్తరించబడుతుందని అనుకుంటున్నారు. శ్రీశ్వేతాంబర్ జైన ఆలయం పర్యవేక్షణలో 151 అడుగుల అష్టపద్ నిర్మించబడింది. పంచకల్యాణక్ ప్రతిష్ఠ బాధ్యతవహించి 2009లో గచ్చధిపతి ఆచార్యనిత్యానంద్ సురేష్వర్జీ ఆధ్వర్యంలో ఈ పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీశ్వేతాంబర్ జైన ఆలయం సమీపంలో జైన స్థానక్ కూడా ఉంది.
హస్థినాపుర్ శాంక్చ్యురీ
మార్చుహస్థినాపుర్ అభయారణ్యం భారతదేశంలో ఉన్న ప్రముఖ అభయారణ్యాలలో ఒకటి. హస్థినాపుర్ అభయారణ్యం 1986 లో స్థాపించబడింది. అభయారణ్యం మీరుట్, బిజ్నోర్, ఘజియాబాద్,, ఉత్తర్ ప్రదేశ్ లోని జ్యోతీ ఫులే నగర్ వరకు విస్తరించి ఉంది. హస్థినాపుర్ అభయారణ్యం వైశాల్యం 2073 చదరపు కిలోమీటర్లు. పర్యావరణ ఉద్యమకారుడు హస్థినాపుర్ అభయారణ్యం పునరుద్ధరణ కొరకు 2001 నుండి పోరాడుతున్నాడు.
హిస్టారికల్ భాయి ధరం సింఘ్ గురుద్వార్
మార్చుహస్థినాపూర్కు 2.5 కిలోమీటర్లదూరంలో సైయిఫ్ పూర్ అనే గ్రామంలో ఉన్న చిన్న గురుద్వారే భాయి ధరం సింఘ్ గురుద్వార్. భాయి ధరం సింఘ్ (1606-1708) ఖల్స పూర్వీకులైన ఐదు ఆరాధనీయులలో ఒకడు. భాయి ధరం సింఘ్ సైఫ్ గ్రామంలో ఉన్న భాయీశాంతి రాం కుమారుడు.
ఉత్సవాలు ప్రదర్శనలు
మార్చుహస్థినాపురంలో సంవత్సరం పొడవునా సాంస్కృతిక, మతపరమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అక్షయత్రితియ, దాష్ లక్షణ, కార్తిక్ మేళా, హోలీ మేళా, దుర్గా పూజా, ఇతర ఉత్సవాలు ఎన్.జి.ఒ, పర్యాటకశాఖ చేత నిర్వహించబడుతూ ఉంటాయి.
మూలాలు
మార్చు- ↑ J.P. Mittal (2006). History Of Ancient India (a New Version) : From 7300 Bb To 4250 Bc. Vol. 1. New Delhi: Atlantic Publishers & Distributors. p. 308. ISBN 978-81-269-0615-4. Retrieved 21 March 2018.
- ↑ "Excavation Sites in Uttar Pradesh - Archaeological Survey of India". asi.nic.in. Archived from the original on 13 సెప్టెంబరు 2015. Retrieved 25 August 2015.
- ↑ Habib, Irfan (1997). "Unreason and Archaeology: The 'Painted Grey-Ware' and Beyond". Social Scientist. 25 (1/2): 16–24. doi:10.2307/3517758. JSTOR 3517758.