అన్నంభట్టు సంస్కృతాంధ్రలో పండితుడు.[1] ఈయన రాసిన తర్కసంగ్రహం అనే గ్రంథం న్యాయశాస్త్రం అభ్యాసం చేసేవారికి తొలి పాఠ్యపుస్తకంగా ఉపయోగించారు. ఈయన 15 వ శతాబ్దంలో గుంటూరు జిల్లా గరికపాడులో జీవించాడనీ కొందరూ, 18వ శతాబ్దం తొలి పాదానికి చెందినవాడనీ కొంతమందీ భావిస్తున్నారు. మీమాంస, వేదాంత, వ్యాకరణ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు కూడా రాశాడు.[2]

హారతి ఇస్తున్న పండితుడు

జీవిత విశేషాలు మార్చు

అన్నం భట్టు ఆంధ్ర రాష్ట్రములోని గరికపాడు కు చెందినవాడు. అతను 17వ శతాబ్దికి చెందినవాడు. అతని తండ్రి అద్వైత విద్యాచార్య తిరుమలుడు. ఆ ప్రాంతం నిజాం ఆలీ ఖాన్ పాలనలో ఉండేది. అతను పండ్రెండేళ్లు కుండిన పురం లేదా కొండవీడు లో తన విద్యాభ్యాసం పూర్తిచేసడు . తన విద్యాభ్యాసం పిమ్మట తర్క సంగ్రహము అనే మహా గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు . ఇందులో మొత్తం రెండు వేల శ్లోకాలు కలవట.[1]

అన్నంభట్టు తర్కసంగ్రహం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించేప్పుడు గ్రంథరచన అయిపోవచ్చింది. ఇంక కవి గారి వివరాలను తెలిపే ముగింపు శ్లోకాన్ని వ్రాస్తూ ఉన్నాడు. అతనికి "విదుషాన్నంభట్టేన " అనగా పండితుడైన అన్నంభట్టుచే రచించబడిన అనే ఆలోచన వచ్చింది. కానీ అది అనుష్టుప్ శ్లోకం కనుక, ప్రతీ ఒక్క పాదంలోనూ ఎనిమిది అక్షరాలు ఉండాలి. కవిగారు వ్రాయాలనుకొన్న పాదంలో ఏడు అక్షరాలు మాత్రమే ఉన్నాయి . ఆ ఎనిమిదవ అక్షరం కోసం నానా తంటాలు పడుతున్నాడు. తర్క శాస్త్రములో పాండిత్యములో ఎంతో ప్రజ్ఞ కలిగిన మహాకవికి కూడా గంటలు గడుస్తున్నాయి కానీ సరియైన పదం ఎలా వేయాలో దొరకటం లేదు. ఇంటిలో భోజన సమయం అవుతున్నది . శిష్యులంతా గురువుగారికోసం వేచియున్నారు. మడికట్టుకుని కూర్చుని రచన చేస్తున్న అన్నంభట్టును భోజనానికి ఆహ్వానిస్తూ తదేకంగా ఆలోచిస్తున్న కవిగారిని ఆ సోమిదమ్మ అసలు విషయం ఏమిటి అని అడిగింది. అతను ఆమెకు అసలు విషయం చెప్పగానే..అయ్యో ఇంతమాత్రానికి తలపట్టుకోవాలా.. ఆ అన్నంభట్టుని ఇవతలకు తీసుకురండి అనగానే కవిగారి తలలో ఆలోచన వెల్లివిరిసింది. అతను వ్రాయాలనుకున్న "విదుషాన్నం భట్టేన " ఆమె సలహాతో "అన్నంభట్టేన విదుషా " అయింది. ఈ విషయం చూస్తే ఏమర్థం అవుతోంది ఆనాటి భారత స్త్రీలు కూడా పాండిత్య ప్రజ్ఞ కలవారని తెలియడం లేదూ.[3]

అన్నంభట్టు రచించిన తర్క సంగ్రహం గ్రంథాన్ని దేశములోని అనేక రాజ్యాలకు తర్క శాస్త్రం గొప్పతనం తెలియజేయడానికి, అందులో తప్పొప్పుల సవరణకు పంపితే అందరి ఆమోదం పొందినది. అన్నం భట్టు తన స్వంత ప్రాంతమైన గరికపాడు లోనే ఒక గురుకులం ఏర్పాటు చేసి తర్క శాస్త్ర బోధ చేసేవారట. ఆ రోజుల్లో అన్నం భట్టు ఖ్యాతి విని ఎందరో విద్యార్థులు తర్క శాస్త్రం అభ్యసించడానికి గరికపాడుకు విచ్చేసేవారట . తన యాబది అయిదవ ఏట అన్నం భట్టు వారు తన శిష్యులందరితో కలసి శ్రీశైల శిఖర దర్శనం చేసి స్వామి వారిని స్తుతించి భక్తి పారవశ్యములో మునిగిపోయారట. నాటి నుండి తన యూరులోనే యుంటూ దైవ సేవ అతిథి అభ్యాగతుల సేవ చేస్తూ తనకున్న పొలంలోనే వ్యవసాయం చేసుకొనుచు విద్యార్థులకు విద్య గరపుచు జీవించారట. ఆరోజుల్లో విద్వత్తు ఉన్నవారందరినీ రాజాస్థానాలు రమ్మని పిలిపించుకునేవి. కానీ అన్నం భట్టు వారికి రాజాస్థానాల మీద మక్కువ లేదు. అతనికి బహుసంతానము కలదు. చివరి వరకు విద్యార్థులకు తర్క విద్య బోధిస్తూ శ్రీశైల మల్లేశ్వరుని చివరి రోజుల్లో సేవిస్తూ తరించారట.[1]

రచనలు[4] మార్చు

  • తర్కసంగ్రహము
  • తర్కసంగ్రహదీపిక
  • సుబోధినీసుధాసారము
  • మితాక్షరబ్రహ్మసూత్రవ్యాఖ్యానం
  • అష్టాధ్యాయీ టీకా
  • కైయట ప్రదీప వ్యాఖ్యానం
  • సిద్ధాంజనము
  • న్యాయపరిశిష్టప్రకాశనము
  • తత్వబోధినీ టీకా
  • మితాక్షరి

తర్కసంగ్రహము- తర్కసంగ్రహదీపిక లో కొన్ని ముఖ్య విషయములు మార్చు

వీటిలో ముఖ్య విషయములు: ప్రమాణములు, తర్కం, పరార్ధహేతు - సాధ్య తర్క విధానం.

ప్రమాణములు మార్చు

ఇందులో ముఖ్య భాగములు

  • జ్ఞానర్జన : వైదిక కర్మకాండల ద్వారా ముక్తిని పొందవచ్చునని మీమాంసికులు కొందరు తలచారు. ఇది సరికాదనీ అవి మనఃశుద్ధిని కలిగించేంతవరకే ఉపయోగపడతాయనీ, ఆ తరువాత చింతన, పరామర్సల ద్వారా సత్యాంవేషణ జరిపితే కాని మానవుడు ముక్తిని పొందజాలడని వైయ్యయికుడైన గౌతముడు బోధించాడు. జ్ఞానార్జనకి అవసరమైన శాస్త్రాలను చక్కగా అభ్యసించాలి. జ్ఞానార్జన అంటే పదార్ధాలు, వాటి సంబంధ బేధాలు, మొదలైన విషయాలను తెలుసుకొని, ఆపైన ఆలోచన, మననం, వివేచన మొదలైన విధానాలలో కృషి చేయుట.
  • ప్రమాణం: జ్ఞానార్జన ఎలా సాధ్యమౌతుంది? ఆర్జించిన జ్ఞానం ఎప్పుడు ఆమోదించబడుతుంది? అనే ప్రశ్నలకి ప్రమాణాలు ఆధారం అవుతుంది. ఇవి 8 విధానములు. అవి ప్రత్యక్ష ప్రమాణము, అనుమానము, ఉపమానము, శబ్దము, అనుభవము, అర్ధాపత్తి, యోగదృష్టి, ఆప్తవాక్యము. వీటిలో హిందూ పండితులందరు ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణాలను మాత్రమే ఒప్పుకుంటారు. ఇందులో శబ్ద ప్రమాణాన్ని : అర్ధయుక్త వాక్య ప్రమాణం, వేద ప్రమాణం, అనుభవ ప్రమాణం, అర్ధాపత్తి ప్రమాణం, యోగదృష్టి ప్రమాణం, ఆప్తవాక్య ప్రమాణం గాను విభజించారు.
  • తర్కం: దీనిని సుజ్ఞానార్జన తత్త్వం ముఖ్యమైనది. ఆమోదయోగ్యమైన పద్దతుల్లో జ్ఞానార్జన చేసి వాటిలోని దోషాలను విచారించి, తొలగించి, సుజ్ఞానాన్ని సంపాదించాలని దీని ముఖ్య వుద్దేశ్యము.
  • పరార్ధహేతు-సాధ్య తర్క విధానము: అనుమాన ప్రమాణమే తర్క శాస్రానికి జీవం. హేతువు నుంచి మనం సాధించగల ఫలితాన్ని సాధ్యం అంటారు. తనలో తను పరామర్సించుకొని, హేతువు నుంచి సాధ్యాన్ని తెలుసుకొంటె, అది స్వార్ధ (స్వ-అర్ధ) హేతు-సాధ్య తర్క విధానం అవుతుంది. ఇంకొకరికి తెలియపరచడానికై హేతు- సాధ్య వివరణ చేస్తే, అది పరార్ధ హేతు-సాధ్య తర్క విధానము అవుతుంది.A kind of Syllogism.
  • ఈ శాస్త్రములో వాడే ముఖ్య పదాలు: కారణము, కార్యము, హేతువు, సాధ్యం, నిగమనం లేదా ఫలితం.[5]

వనరులు మార్చు

  • 1978 భారతి మాస పత్రిక వ్యాసము-హైందవ తర్క శాస్త్ర పరిచయము- వ్యాసకర్త:కందుల నాగభూషణంగారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 Ramaswamie, Cavelly Venkata. Biographical Sketches of Dekkan Poets.
  2. బుడ్డిగ సుబ్బరాయన్ (1990). బాలల విజ్ఞాన సర్వస్వము - సంస్కృతి విభాగము (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  3. తర్క సంగ్రహం - అన్నంభట్టు : భండార్కర్ ఇన్స్టిట్యూట్ , 1974
  4. "Product Search for annam bhatt". Exotic India. Retrieved 2020-05-17.[permanent dead link]
  5. https://kavanasarma.files.wordpress.com/2017/11/haindavatarkasastramu.pdf[permanent dead link]