అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి

భారతదేశానికి చెందిన న్యాయమూర్తి

అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 1990 నుంచి న్యాయవాదిగా సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించి 2019 ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[1]

అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 ఆగష్టు 2019 - ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 7 నవంబర్‌ 1967
లింగంపల్లి గ్రామం , మంచాల్‌ మండలం , రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
తల్లిదండ్రులు పుల్లారెడ్డి, శశిరేఖా రెడ్డి
నివాసం హైదరాబాద్
వృత్తి న్యాయమూర్తి
మతం హిందూ మతము

జననం, విద్యాభాస్యం

మార్చు

అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి 7 నవంబరు 1967లో తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా,మంచాల్‌ మండలం, లింగంపల్లి గ్రామంలో పుల్లారెడ్డి, శశిరేఖా రెడ్డి దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్ లోని హైదర్‌గూడ సెయింట్‌పాల్స్‌ హైస్కూల్‌లో పదో తరగతి, ఉప్పల్‌ లిటిల్‌ఫ్లవర్‌లో ఇంటర్మీడియట్, నిజాం కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, వాషింగ్టన్‌ డీసీలోని అమెరికన్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.[2]

వృత్తి జీవితం

మార్చు

అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి తన తండ్రి ఎ.పుల్లారెడ్డి దగ్గర న్యాయవాద జీవితాన్ని ప్రారంభించి, హైకోర్టుతో పాటు సివిల్‌ కోర్టు, భూ ఆక్రమణల నిరోధక కోర్టులో సివిల్, రాజ్యాంగ కేసులు వాదించాడు. ఆయన 2004 నుండి 07 వరకు భూ ఆక్రమణల నిరోధక కోర్టులో ప్రభుత్వ న్యాయవాది \ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, 2007 నుండి 09 వరకు ఉన్నత విద్యశాఖ ప్రభుత్వ న్యాయవాదిగా, అనంతరం ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ న్యాయవాదిగా వివిధ హోదాల్లో పనిచేశాడు.[2]ఆయన 2019 ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[3]

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ (26 August 2019). "ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 28 August 2019. Retrieved 28 August 2019.
  2. 2.0 2.1 Andrajyothy (2019). "తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు". Archived from the original on 16 అక్టోబరు 2021. Retrieved 16 October 2021.
  3. Telangana High Court (2019). "HONOURABLE SRI JUSTICE A ABHISHEK REDDY". Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.